NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Madhuranagarilo March 27 2024 Episode 323: కూలి పని చేస్తున్న మధురను చూసి బాధపడుతున్న ధనంజయ్..

Madhuranagarilo Today Episode March 27 2024 Episode 323 highlights

Madhuranagarilo March 27 2024 Episode 323:  మధుర వెళ్లి వాళ్ళని ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. కూలి కోసం నిలబడ్డాం అమ్మ మా మేస్త్రి వచ్చి మమ్మల్ని తీసుకువెళ్తాడు రోజు కూలికి అని అక్కడ ఉన్న ఆవిడ చెబుతుంది. అయితే మీతో పాటు నేను కూడా కూలి పనికి వస్తాను అని మధుర అంటుంది. నిన్ను చూస్తే కూలి పని చేసే దానిలా లేవు కదా అమ్మ నువ్వు చేయగలవా అని ఆవిడ అంటుంది. చేస్తానమ్మా నా అవసరం అలాంటిది అని మధుర అంటుంది. సరే ఇక్కడే ఉండు ఆటో వస్తుంది ఎక్కువసేపు ఆటో ఉండదు తొందరగా ఆటో ఎక్కాలి అని ఆవిడ చెప్పడంతో మధుర దేవునికి దండం పెట్టుకొని వస్తాను అని వెళుతుంది. ఇంతలో కూలీలను తీసుకపోయే అతను ఆటో తీసుకొని అక్కడికి వస్తాడు. ఆటో తోలుతున్న డ్రైవర్ ఎవరో కాదు శ్యామ్.

Madhuranagarilo Today Episode March 27 2024 Episode 323 highlights
Madhuranagarilo Today Episode March 27 2024 Episode 323 highlights

అందరూ ఆ ట్రాలీ ఆటో ఎక్కుతారు. ఒక్క నిమిషం ఆపండి ఇంకొక ఆవిడ వస్తుంది అని కూలీల ఒక ఆవిడ అంటుంది. ఎంతసేపమా లేట్ అవుతుంది పోనీ అని మేస్త్రి అనగానే అన్న ఐదు నిమిషాలు వెయిట్ చేద్దాం అన్న పాపం ఆవిడ కూలి ఎందుకు పోగొట్టడం అని శ్యామ్ అంటాడు. మధుర దేవుడికి దండం పెట్టుకొని వచ్చి ఆటో ఎక్కుతుంది. అందరూ వచ్చేసారు పోనీ  అన్న గానే శ్యామ్ ఆటో తీసుకొని వెళ్తాడు. కట్ చేస్తే, పని దగ్గరికి తీసుకొస్తాడు శ్యామ్. అందరూ ఆటో దిగి పనిలోకి వెళ్ళిపోతారు. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అమ్మ వెళ్లి పని చెయ్ అని మేస్త్రి చెప్పడంతో మధుర వెళ్లి పని చేస్తుంది. వాచ్మెన్ ఏం చేస్తున్నావ్ అయ్యా సిమెంట్ బస్తాల లోడ్ వచ్చిందా అని అడుగుతాడు కాంట్రాక్టర్. వచ్చింది సార్ లెక్కపెట్టి రాసాను కూడా అని ధనంజయ్ చెబుతాడు. వాచ్మెన్ నాకు దాహం వేస్తుంది వెళ్లి మంచి నీళ్లు  తీసుకురా అని పిలుస్తాడు కాంట్రాక్టర్. అలాగే సార్ తెస్తాను అంటూ ధనంజయ వెళ్ళిపోతాడు. మధుర ఇటుకలు మోస్తూ పనిచేస్తుంది.

Madhuranagarilo Today Episode March 27 2024 Episode 323 highlights
Madhuranagarilo Today Episode March 27 2024 Episode 323 highlights

అలసిపోయి దాహం వేసిన మధుర మంచినీళ్లు తాగడానికి కుండ దగ్గరికి వెళ్తుంది. మంచినీళ్లు తాగుతూ ఉండగా ధనంజయ్ అక్కడికి వస్తాడు. ధనంజయ వచ్చేలోపే మధుర మంచినీళ్లు తాగేసి వెళ్ళిపోతుంది. ధనంజయ్ అక్కడ నుంచి మంచినీళ్లు తీసుకువెళ్లి వాళ్ళ సార్ కి ఇస్తాడు. మధుర ఒకచోట సిమెంటు ఎత్తుతూ ఉంటుంది. మళ్లీ కాంట్రాక్టర్ వాచ్మెన్ ఎక్కడ చచ్చావయ్యా కూలీలందరూ చాలా కష్టపడుతున్నారు వాళ్లకు వెళ్లి టీ ఇచ్చిరా అని చెబుతాడు. అలాగే సార్ అని ధనుంజయ్ వెళ్లి అందరికీ టీ పోసి ఇస్తూ ఉంటాడు. ఆడవాళ్ళందరికీ ఇస్తూ ఉండగా ఒకచోట సిమెంటు ఎత్తుతూ మధుర కనిపిస్తుంది. తనుని చూసి షాక్ అవుతాడు ధన0జయ్ . పనికి వెళ్లొద్దు అంటే నాకు చెప్పకుండా పనికి వచ్చిందా నేను ఇప్పుడు టీ తీసుకెళ్లి ఇస్తే నేను ఇక్కడ వాచ్మెన్ పనిచేస్తున్నానని నన్ను చూసి బాధపడుతుంది నేను వెళ్లకూడదు అని ధనంజయ్ అక్కడే ఆగిపోతాడు. మధుర కష్టాన్ని చూసి బాధపడతాడు ధన0జయ్.

Madhuranagarilo Today Episode March 27 2024 Episode 323 highlights
Madhuranagarilo Today Episode March 27 2024 Episode 323 highlights

అక్కడ ఒక ఆవిడ టీ తాగుతూ ఉండగా టీ పోసి అక్కడ ఒక కూలి ఉన్నట్టుంది ఆవిడకు ఇచ్చి రా ఈ టీ అని ధనంజయ్ అంటాడు. ఆవిడ తీసుకువెళ్లి మధుర కి టీ తాగమని ఇస్తుంది. మధుర ఒకచోట కూర్చొని టీ తాగుతూ ఉంటుంది. కట్ చేస్తే, రాధా పండుని షాపుకి తీసుకువెళ్లి తను అడిగిన బొమ్మ వెయ్యి రూపాయలు పెట్టి కొనిస్తుంది. మమ్మీ ఆ బొమ్మ వెయ్యి రూపాయలు నాకు వద్దు అని పండు అంటాడు. పండు నువ్వు ఆ బొమ్మ కావాలని అడిగావు కదా అబొమ్మ కొనిస్తే నువ్వు సంతోషిస్తావు కదా అందుకే మీ అమ్మ కొనిచ్చింది రా నీ సంతోషం కోసం ఏమైనా చేస్తాను తీసుకో అని రాదా ఇస్తుంది. పండు ఆ బొమ్మ తీసుకొని సంతోషిస్తాడు. కట్ చేస్తే, చలపతి రుక్మికి జ్యూస్ తాగమని ఇస్తాడు.

Madhuranagarilo Today Episode March 27 2024 Episode 323 highlights
Madhuranagarilo Today Episode March 27 2024 Episode 323 highlights

కోపంతో జ్యూస్ గ్లాస్ కింద పడేసి ఆ రాధ కి ఎంత పొగరు ఏం  చూసుకొని అంత పొగరు అని రుక్మిణి అంటుంది. పండు తన దగ్గర ఉన్నాడు కదా అమ్మ అందుకే రాధకి అంత పొగరు అని చలపతి అంటాడు. కడుపునిండా తిండి లేదు కట్టుకోవడానికి బట్ట లేదు అయినా దానికి ఎందుకు అంత పొగరు అని రుక్మిణి అంటుంది. రుక్మిణి అవేవీ లేకపోయినా తన దగ్గర పండు ఉన్నాడు ప్రేమగా చూసుకునే అత్తమామలు ఉన్నారు ప్రాణం కన్నా ఎక్కువ చూసుకునే భర్త ఉన్నాడు అవి చూసుకునేనమ్మ రాధకి అంత పొగరు అని దాక్షాయిని అంటుంది. చేస్తా పండుని రాద నుంచి దూరం చేస్తా  పెంచిన తల్లి ప్రేమ కన్నా కన్నతల్లి ప్రేమ గొప్పదని పండుకి తెలిసేలా చేసి పండుని నా దగ్గరికి రప్పించుకుంటాను అని రుక్మిణి వెళ్ళిపోతుంది.

Madhuranagarilo Today Episode March 27 2024 Episode 323 highlights
Madhuranagarilo Today Episode March 27 2024 Episode 323 highlights

కట్ చేస్తే పండు బొమ్మతో ఆడుకుంటూ ఉంటాడు. ఇంతలో శ్యామ్ అక్కడికి వస్తాడు.డాడీ ఈ బొమ్మ ఎలా ఉంది దీని రేటెంతో తెలుసా డాడీ 1000 రుపీస్ అని పండు అంటాడు. ఏంటి వెయ్యి రూపాయల అని శ్యామ్ అంటాడు.నమ్మట్లేదా డాడీ కావాలంటే అమ్మను వెళ్లి అడుగు అమ్మా కొనిచ్చింది అని పండు చెబుతాడు.నీ మాట నమ్మక కాదు పండు అమ్మకి ఆ ₹1000 ఎక్కడినుంచి వచ్చాయి అని శ్యామ్ వెళ్తాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu