Anand Devarakonda: రౌడీ హీరో అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ తనతో పాటు తన తమ్ముడిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసి ప్రస్తుతం స్టార్ హీరోగా నిలబెట్టారు. బేబీ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు ఆనంద్ దేవరకొండ. ఈ సినిమాకి ముందు అనేక సినిమాల్లో ఆనంద్ దేవరకొండ నటించినప్పటికీ పెద్దగా ప్రేక్షకుల్లో పేరును సంపాదించుకోలేకపోయాడు. కానీ ఎప్పుడైతే బేబీ సినిమాలో తన నటనతో విధ్వంసం పుట్టించాడు అప్పటినుంచి స్టార్ హీరోగా బిరుదు అందుకున్నాడు. ఇక ఈ సినిమాతోనే యూట్యూబ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా వెండితెరకి పరిచయమైంది. ప్రస్తుతం బేబీ సక్సెస్ లో ఉన్న ఆనంద్ దేవరకొండ తాజాగా తన నెక్స్ట్ మూవీ గురించి హిట్ ఇచ్చాడు.
ఆనంద్ దేవరకొండ తాజా చిత్రం.. గమ్.. గమ్.. గణేష్ ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ పోస్టర్ వైరల్ అవుతుంది. చాలా రోజుల తరువాత ఆనంద్ దేవరకొండ ఈ చిత్రం గురించి ఒక క్రేజీ వార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. త్వరలోనే మూవీ విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన ట్వీట్లో పేర్కొన్నాడు. మేము చాలా సంవత్సరాలుగా క్రైమ్, కామెడీ కోసం పనిచేస్తున్నాం. కాకపోతే ఈ సినిమా మేకింగ్ లో కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ వారు చెప్పినట్లు అంతా బాగానే ముగుస్తుంది. మీరందరూ సినిమా అని ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నా.
కామెడీ, డ్రామా ఆధారంగా ఈ మూవీ రూపొందుతుంది.. అంటూ ట్వీట్లో రాసుకు వచ్చాడు ఆనంద్ దేవరకొండ. మొదటి సింగిల్ గా బృందావానివే పాట ప్రమోషన్‌ను ప్రారంభించినప్పటి నుంచి హీరో హీరోయిన్ల మధ్య సూపర్ ట్రాక్ సంగీత ప్రియులను ఆకట్టుకుంది. ఇక మరోవైపు సినిమాలోని పాత్రలు ఎలా ఉంటాయో హిట్ ఇచ్చే విధంగా, థ్రిల్ ఇచ్చే సరదా ట్విస్ట్ గా డిజైన్ చేసిన యానిమేషన్ పోస్టర్ వైరల్ అవుతుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం హై.. లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగం శెట్టి, వంశీ నిర్మించారు.
ఉదయ్ శెట్టి ఈ మూవీతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం కానున్నాడు. ఇక ఈ సినిమా కూడా ఆనంద్ దేవరకొండ కి మంచి సక్సెస్ ని ఇస్తే రానున్న రోజుల్లో ఈ హీరో పాన్ ఇండియా హీరో అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పుకోవచ్చు . నిజానికి బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ప్రతి సీన్లో లేనమైపోయి తన యాక్టింగ్ నిరూపించాడు ఆనంద్ దేవరకొండ. అటువంటి యాక్టర్ ని టాలీవుడ్ లో మరికొన్ని రోజులు చూడాలని తన ఫాన్స్ ఎంతగానో భావిస్తున్నారు. అది కూడా మన రౌడీ హీరో తమ్ముడు అయితే ఫ్యాన్స్ ఫుల్ గా సపోర్ట్ చేస్తారు. అలా వారి అంచనాలను అందుకుంటు సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు ఆనంద్ దేవరకొండ.