Lootere Web Series 2024: సాధారణమైన రోజుల్లో ఏ విధంగా వెబ్ సిరీస్ మరియు సినిమాలు ఓటీటీలో వస్తాయో ఈ వారం కూడా అలానే రానున్నాయి. ఇక ఈ వారంలో విడుదల అయ్యే సిరీస్లో కొన్ని థ్రిల్లర్ సిరీస్ కూడా ఉన్నాయి. వాటిలో ఓ సిరీస్ మాత్రం ఎంతో ఆసక్తి రేపుతుంది. ఈ సిరీస్ పేరే ” లూటేరే “. ఈ సిరీస్ ను రూపొందించింది హన్సల్ మెహతా. ఈ వారం రాబోతున్న సిరీస్లో ప్రతి ఒక్కరి దృష్టి ఈ సిరీస్ పైనే మళ్ళింది.
స్టార్ హీరో మరియు హీరోయిన్స్ నటించిన సిరీస్ ఈవారం ఓటీటీలోకి వస్తున్నప్పటికీ ఈ సర్వైవల్ థ్రిల్లర్ పై ప్రతి ఒక్కరి చూపు మల్లింది. ఈ సిరీస్ తెలుగు ప్రముఖ సమస్త డిజిని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ శుక్రవారం అనగా మార్చి 22 నుంచి ప్రేక్షకుల ముందుకి రానున్నట్లు తెలుస్తుంది. ఇక ఇటీవలే ఈ సిరీస్ నుంచి ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు కూడా. ఇక ఈ మూవీ యొక్క కథాంశం విషయానికి వస్తే..” సోమాలియా దగ్గర సముద్రంలో పైరేట్స్ చేతికి చిక్కుతుంది మన దేశానికి చెందిన ఓ నౌక.
అందులో కోట్లు విలువైన వస్తువులతో పాటు ఓ సిబ్బంది కూడా ఉంటారు. ఈ సిబ్బందిని ప్రాణాలతో వదిలేయాలంటే భారీగా డబ్బు ఇవ్వాలని పైరేట్స్ డిమాండ్ చేస్తారు. ఇక వాళ్ల నుంచి ఆ సిబ్బందిని సురక్షితంగా ఎలా విడిపించుకోవాలి? చివరికి విడిపించుకోగలరా? అనే కథాంశం చుట్టూ ఈ సిరీస్ రూపొందాయి. జై మెహతా డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ నీ.. హన్సల్ మెహతా, షైలేష్ ఆర్ సింగ్ ప్రొడ్యూస్ చేశారు.
సముద్రంలో ప్రయాణించే ఓడలను హైజాక్ చేసి అందులోని డబ్బు సొంతం చేసుకోవడంలో సోమాలియా పైరేట్స్ ఆరితేరారు. ఇక అలాంటి పైలెట్ చేతికి ఒక భారతీయ ఓడ చిక్కడం. వాళ్లు అందులోని సిబ్బందిని బందీగా చేయడం. అనంతరం కొంత డబ్బు డిమాండ్ చేయడం వంటివి ఈ ట్రైలర్ లో స్పష్టంగా చూపించారు. ఇక సర్వైవల్ థ్రిల్లర్ నీ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ వెబ్ సిరీస్ అని తెలియజేయవచ్చు. ఇక ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈనెల 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మీరు ఈ సిరీస్ ను తప్పక చూడండి.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!