Pooja Hegde: మన టాలీవుడ్ లో ఎంతమంది సెలబ్రిటీలు ఉన్నప్పటికీ కొందరు మాత్రమే ఎక్కువ పాపులారిటీ దక్కించుకోగలరు. కొందరు వరస హ్యాట్రిక్ హిట్లు కొడుతూ సక్సెస్ సంపాదించుకుంటే మరికొందరు మాత్రం వరుస ఫ్లాప్స్ తో కూడా మంచి గుర్తింపును సంపాదిస్తున్నారు. అలా టాలీవుడ్ లో అడుగుపెట్టిన కొత్తలో స్టార్ హీరోయిన్గా కొనసాగినప్పటికీ అనంతరం వరస అపజయాలను వెలుగు చూసి ఐరన్ లెగ్ గా పేరు సంపాదించుకున్న హీరోయిన్ పూజా హెగ్డే. గతంలో స్టార్ హీరోల సినిమాలలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ కి ప్రస్తుత కాలంలో ఏ డైరెక్టర్ కూడా అవకాశం ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు.
ఈమె స్థితి అలా ఉంది మరి. అల్లు అర్జున్, ప్రభాస్, అఖిల్, మహేష్ బాబు, విజయ్ దళపతి, వరుణ్ తేజ్ వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మాత్రం ఏ ఒక్క సినిమాలోనూ కనిపించడం లేదు. టాలీవుడ్ లో వరస్ట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది పూజ హెగ్డే. అంతేకాకుండా ఈమెకి ఐరన్ లెగ్ అనే ఓ బిరుదు కూడా దక్కింది. గతంలో ఏ హీరోయిన్ కి లేని బిరుదు ఈమెకు దక్కిందని చెప్పుకోవచ్చు. హీరోయిన్ ఖాతాలో ఎన్ని ఫ్లాప్స్ పడినప్పటికీ ఆ హీరోయిన్ ని డైరెక్టర్ తమ సినిమాల్లో తీసుకోరు కానీ ఇటువంటి బిరుదులు ఎప్పుడూ ఇవ్వలేదు. కానీ పూజా హెడే విషయంలో మాత్రం ఇది జరిగింది. ఈమె తెలిసి చేసిన తప్పులు కాకపోయినా ప్రతిదీ పూజ హెడే మెడకే చుట్టుకుంటున్నాయి.
ఇండస్ట్రీలో ఉన్న ఫ్లాప్ సినిమాలు అన్నీ ఏరుకుని సెలెక్ట్ చేసుకున్నట్లు ఒక్కో సినిమా ఒక్కో రాడ్ గా నిలుస్తుంది. ఇక అలాంటి పూజా హెడేక్ ఈ ప్రస్తుత కాలంలో మాత్రం ఏ హీరో కూడా అవకాశం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అందాలు ఆరబోసుకుంటూ తన ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంది. సినిమాలు ఎలాగో లేవు కనీసం సోషల్ మీడియాలో అయినా యాక్టివ్‌గా ఉంటూ దాని ద్వారా అయినాకాస్తో కూస్తో సంపాదించుకుందాం అనుకుంటుంది. ఇదే క్రమంలో తాజాగా మిర్రర్ ఇమేజెస్ షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. మిర్రర్ లో తన ఫేస్‌ను చూపిస్తూ వెరైటీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ మంచి కిక్ ఇచ్చింది.
ఇక ప్రస్తుత కాలంలో మిర్రర్ లో చూస్తూ ఫొటోస్ దిగడం ట్రెండింగ్ అవుతున్నాయి. ఇటీవల మెగా కోడలు లావణ్య త్రిపాఠి సైతం ఇటువంటి ఫోటోలనే షేర్ చేసింది. ఇక ప్రస్తుతం లావణ్య ఫోటోలను తలదన్నే విధంగా ఉన్నాయి పూజా హెడే ఫొటోస్. లావణ్య ఫుల్ కలర్ ఫొటోస్ షేర్ చేస్తే పూజ హెడే మాత్రం బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను షేర్ చేసింది. దీంతో పాత రోజులను గుర్తు చేసిందంటూ ఈమెని తెగ పొగిడేస్తున్నారు. మరి ఈ అమ్మడు అందాలకి కరిగి ఏ డైరెక్టర్ అయినా అవకాశం ఇస్తాడేమో చూడాలి. ఒకవేళ ఇదే కనుక నిజం అయ్యి పూజా హెడే కి ఒకే ఒక బ్లాక్ బస్టర్ కొట్టే సినిమా అవకాశం వస్తే ఈమె కెరీర్ పూర్తిగా మారిపోతుందని చెప్పుకోవచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి..!
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!