Top Rated Indian Web Series: ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో సాధారణ ప్రేక్షకులు థియేటర్లో మరియు ఓటీడీలలో వచ్చే వెబ్ సిరీస్ లకి అదేవిధంగా సినిమాలకి రేటింగ్ ఇస్తూ ఉంటారు. అత్యధికంగా ఐదు కి గాను పైగా రేటింగ్స్ సాధించిన వెబ్ సిరీస్ టాప్ 5 లో ఉంటాయి. అలా ఆ వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, సోనీ లీవ్ లాంటి ఓటిటిలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతాయి. ఇక వీటి రేటింగ్స్ ను తెలుసుకుని కొందరు వీక్షించేందుకు మగ్గు చూపుతారు. అలా అనేకమంది వెబ్ సిరీస్ ను వీక్షిస్తున్నారు. ఇక రేటింగ్ ఇచ్చే వారు కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఇస్తున్నారు. అలా ప్రేక్షకుల రేటింగ్ ప్రకారం ఇండియన్ టాప్ 5 గా నిలిచిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. స్కామ్ 1992 (సోనీ లీవ్):
సోనీ లీవ్ ఓటిటిలో 2020లో వచ్చిన ఈ సిరీస్ ఇప్పటికే ఇండియాలో అత్యధిక రేటింగ్‌ను దక్కించుకున్నాయి. 1992లో హర్షద్ మెహతా చేసిన స్టాక్ మార్కెట్ కుంభకోణం చుట్టూ తిరిగే ఈ క్రైమ్ థ్రిల్లర్ కు ఐఎండిబి లో అత్యధికంగా 9.3 రేటింగ్ దక్కడం విశేషం.
2. ఆస్పిరెంట్స్ (ప్రైమ్ వీడియో):
అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన వెబ్ సిరీసే ఆస్పిరెంట్స్. సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసి ఐఏఎస్ కావాలని కలలు కనే ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే సిరీస్ అస్సిరెంట్స్. ఇక ఈ సిరీస్ కు ఐ ఎమ్ డి బి లో 9.2 రేటింగ్ దక్కింది.
3. గుల్లక్ (సోనీ లీవ్):
ఇండియా అంటేనే మిడిల్ క్లాస్ తో నడిచే దేశం. అలాంటి దేశంలో ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఓ పిగ్గీ బ్రాండ్ ఉంటుంది. దాని చుట్టూ తిరిగే కదే ఈ గుల్లక్. ఇక ఈ సిరీస్ ఇండియాలో టాప్ మూడవ స్థానాన్ని దక్కించుకుంది.
4. పంచాయత్ (ప్రైమ్ వీడియో):
అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెండు సీజన్లు పూర్తి చేసుకుని మూడవ సీజన్ కోసం సిద్ధమవుతున్న ఈ వెబ్ సిరీస్ మంచి ప్రేక్షకు ఆదరణ పొందాయి. ఇంజనీరింగ్ చదివి పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలలో ఉద్యోగం చేయాలని ఆశపడిన ఓ యువకుడి కలే ఈ సిరీస్. ఇక ఈ సిరీస్ కి 8.9 రేటింగ్ దక్కింది.
5. ది ఫ్యామిలీ మ్యాన్ (ప్రైమ్ వీడియో):
మనోజ్ బజ్ సాయి, ప్రియమణి నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ సిరీస్ కు 8.7 ఐఎండిబి రేటింగ్ దక్కింది.
ఇలా తమ సత్తా నిరూపించుకుంటూ కొత్త కొత్త కాన్సెప్ట్‌లను ప్రేక్షకులకు అందిస్తూ ఇండియన్ టాప్ 5 సినిమాలను రూపొందించారు ఈ మూవీ డైరెక్టర్స్. ఇక కేవలం ఈ సిరీస్ మాత్రమే కాకుండా మరికొన్ని సిరీస్ మరియు సినిమాలు కూడా మన ఇండియన్ ఓటిటి ఫ్లాట్ ఫారంస్ లో టాప్ లో నిలిచాయి. మరి రానున్న రోజుల్లో ఓటిటి హవా మరింత పెరిగేలా కనిపిస్తుంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!