Ram Charan: “RRR” తో చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. 2022వ సంవత్సరంలో విడుదలైన RRR అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్, చరణ్ లకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రధానంగా దర్శకుడు రాజమౌళికి RRR మంచి మార్కెట్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో చాలామంది హాలీవుడ్ ఇతర దేశాలకు చెందిన నిర్మాతలు జక్కన్నతో సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. కాగా RRR లాంటి అంతర్జాతీయ హిట్ పడిన తర్వాత రామ్ చరణ్ పాన్ ఇండియా నేపథ్యంలో శంకర్ దర్శకత్వంలో “గేమ్ చేంజర్” అనే ప్రాజెక్టు ప్రకటించడం జరిగింది.
దాదాపు రెండు సంవత్సరాల నుండి ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే మార్చి 27వ తారీకు చరణ్ పుట్టినరోజు. దీంతో “గేమ్ చేంజర్” విడుదల తేదీ ప్రకటిస్తారేమో అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఒకరోజు ముందుగానే మార్చి 27 ఉదయం 9 గంటలకు ఈ సినిమా నుండి జరగండి అనే పాటను విడుదల చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రత్యేకంగా ఈ సాంగ్ 150 థియేటర్స్ లో ప్రదర్శించబోతున్నట్లు సమాచారం. అయితే పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని ముందు అనుకోగా ఈ సాంగ్ కేవలం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మాత్రమే విడుదల చేస్తూ ఉండటంతో ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు.
రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తిరుణ్ణావుకరుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ అసోసియేషన్‌లో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని అన్కాంప్రమైజ్డ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చరణ్ కెరియర్ లో 15వ సినిమాగా “గేమ్ చేంజర్” తెరకెక్కింది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!