NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa January 16 2024 Episode 126: నాయుడుతో మాట్లాడి అభిషేక్ ఉద్యోగం ఇప్పించాలనుకుంటున్న స్వర..

Paluke Bangaramayenaa Today Episode  January 16 2024 Episode 126 Highlights

Paluke Bangaramayenaa January 16 2024 Episode 126: ఖాళీగా ఉండటం వల్ల అభి సార్ కి ఏం చేయాలో అర్థం కావడం లేదు పాపం అతని పోలీస్ జాబ్ పోయి ఇటు ప్రేమించిన అమ్మాయి దూరం అవ్వడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారు, గాయం మానాలన్నా గతం మర్చిపోవాలన్న ఆయనకు ఒక రిలీఫ్ కావాలి కేవలం తను దైవంల భావించే కాకి డ్రెస్ వేసుకోవడంతో ఆయనకి లభిస్తుంది ఆయనకి జాబ్ తిరిగి రావాలంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు, లాయర్స్ తో మాట్లాడితే సెక్షన్స్ అని తప్పించుకుంటున్నారు ఇంకా ఏం చేయాలి నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, వాళ్లని వీళ్ళని వెళ్లి అడగడం ఎందుకు నాన్నను వెళ్లి అడుగుదాం నాన్న ఇప్పుడు ఎలాగో మారిపోయారు కదా ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడి అభి సార్ కి జాబ్ వచ్చేలా చేద్దాం అని స్వర అనుకుంటుంది.కట్ చేస్తే,ఏమైంది బంగారం కాలు కాలిన పిల్లి లాగా అటు ఇటు తిరుగుతున్నావ్ అని చందన వాళ్ళ భర్త అడుగుతాడు. రేపు మా ఇంట్లో వాళ్ళని గుడికి తీసుకెళ్లాలి అని అంటుంది చందన.ఆదానికి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావ్ ప్రసాదం బాగుంది అని చెప్తే వాళ్లే వెళ్తారు కదా అని అంటాడు వాళ్ళ భర్త. గుళ్లో పెట్టే ప్రసాదం కోసం గుడి ముందు వదిలే చెప్పుల కోసం నువ్వు వెళ్తావేమో కానీ మా వాళ్ళు వెళ్ళరు అని చందన అంటుంది. నేను మీ ఇంటికి ఇల్లరికం వచ్చాను కదా నేను మా వల్ల లాగే అనుకున్నాను కానీ మీరు మాలా కాదు కదా అని అంటాడు వాళ్ళ భర్త.

Paluke Bangaramayenaa Today Episode  January 16 2024 Episode 126 Highlights
Paluke Bangaramayenaa Today Episode  January 16 2024 Episode 126 Highlights

ఒక దోషం ఉంది పూజ చేస్తే పోతుందని చెప్పు అప్పుడు వెళ్తారు కదా అని వాళ్ళ భర్త ఐడియా చెప్తాడు. నేను అరిష్టాలు దోషాలు అని చెప్తే వాళ్ళు ఎందుకు నమ్ముతారు అని అంటుంది చందన. నేను ఎప్పుడైనా పూజ చేశానా వ్రతం చేశానా నేను చెప్తే నమ్మడానికి అని అంటుంది చందన. వరలక్ష్మీ వ్రతం లో ఎప్పుడు పూడ్చలేదు అసలు నాకు నవగ్రహాల పేరే తెలియదు, నేను పూజలు చేశాను అంటే ఎవరు నమ్మరు అని చందన చెబుతుంది.అయితే ఒక ఫేక్ పంతులు పిలిపించి దోషముందని చెప్పిద్దాం పంతులు చెప్పిన నమ్మరా ఏంటి అని అంటాడు వాళ్ళ భర్త. చచ్చినట్టు నమ్ముతారు అని అంటుంది చందన. కానీ ఫేక్ పంతులు కాదు సుబ్రహ్మణ్యం స్వామి అని మాకు తెలిసిన పంతులు ఉన్నారు ఆయన అడ్రస్ చెప్తాను వెళ్లి పిలుచుకు రా ఎలా మేనేజ్ చేస్తావో చెయ్యి అని అంటుంది చందన.వాళ్ళ భర్త పంతులుని తీసుకురావడానికి వెళ్తాడు.

Paluke Bangaramayenaa Today Episode  January 16 2024 Episode 126 Highlights
Paluke Bangaramayenaa Today Episode  January 16 2024 Episode 126 Highlights

కట్ చేస్తే,రవీంద్ర పంతులు గారిని తీసుకొస్తాడు. ఏంటి పంతులుగారు ఇలా వచ్చారు అని అడుగుతుంది బామ్మ. అమ్మ ఈ మధ్య మన ఇంట్లో ఎవరికీ ఏమీ కలిసి రావడం లేదు కదా నాక్కూడా అసలు ఏం బాగా అనిపించడం లేదు నరదిష్టి ఏమైనా తగిలిందేమో అని నేనే పిలిపించాను అని చెప్తుంది చందన. కానీ పంతులుగారు ఏమంటున్నారంటే ఈ ఇంట్లో శని ఉంది ఆ శని పోవాలంటే నవగ్రహాలకు పూజ చేయాలి ఆ పూజ చేస్తే ఇంటికి పట్టిన శని వదిలిపోతుంది అని చెప్పారు,చెప్పండి పంతులుగారుమీరేం మాట్లాడరేంటి అని అంటుంది చందన. అవునండి తను చెప్పిందిఅక్షరాల నిజం, మీ ఇంటికి పట్టిన శని వదిలి పోవాలంటే రేపు పెద్దమ్మ గుడిలో ప్రచండ దీపం వెలిగించాలి అని పంతులు చెప్తాడు. అంటే పూజ జరిపిస్తే దోషాలన్నీ పోతాయా స్వామి అని అడుగుతుంది అభి వాళ్ళ అమ్మ. పూజ జరిపిస్తే దోషాలు పోవడం  కాకపోవడంతో మీకు అన్ని శుభలే జరుగుతాయి అని అంటాడు పంతులు. నవగ్రహాల పూజ జరిపిద్దామా అత్తయ్య గారు అని అడుగుతుంది యశోద. సరే పూజారి గారు మీరు పూజకు ఏర్పాట్లు చూడండి అని అంటుంది యశోద. సరే అని పంతులు వెళ్లిపోతాడు. కేవలం మన ఫ్యామిలీ మాత్రమే వెళ్లాలి అని చందన అంటుంది. ఇప్పుడు దేవుడికి దండం కూడా పెద్దది ఇప్పుడు ఏకంగా నవగ్రహాల పూజ చేయాలంటుంది ఇది అని డౌట్ వస్తుంది బామ్మకి. వీళ్ళిద్దరూ ఏదో చేస్తున్నారు ఏదో జరుగుతుంది అది ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటుంది బామ్మ.

Paluke Bangaramayenaa Today Episode  January 16 2024 Episode 126 Highlights
Paluke Bangaramayenaa Today Episode  January 16 2024 Episode 126 Highlights

కట్ చేస్తే, రంగరాజు గారు స్వర తీసుకురావడానికి మనం విశాల్ ని ఎందుకు పంపించాలి అని అడుగుతుంది వైజయంతి. సీతను వెతుకు రావడానికి రావణాసుడే ఎందుకు వెళ్ళాడు అంటే మనం ఏం సమాధానం చెప్తాము అమ్మ అని అంటాడు రంగరాజు. అంటే వీన్ని పది తలల రావణాసురినితో పోలుస్తున్నారా అని అంటుంది వైజయంతి. వీడిని నమ్ముకుని మనం చాలా రిస్క్ చేస్తున్నామేమో అనిపిస్తుంది అని చెప్తుంది వైజయంతి.  మనకి ఇంకో దారి లేదు కదా అమ్మ అని అంటాడు రంగరాజు. వాడు ఎన్నిసార్లు ఫెయిల్ అయిన వాణ్ని ఎందుకు నమ్ముతున్నాను తెలుసా అని అంటుంది వైజయంతి. స్వర జీవితాన్ని సర్వనాశనం చేయగల వీరుడు వీడొక్కడే అందుకే వాడు ఎంత ఎదవైనా నేను వాడే నమ్ముతున్నాను అని అంటుంది. చాలు వస్తున్నాడు అని రంగరాజ అంటాడు. దీని గురించి మాట్లాడుకుంటున్నాము స్వరని పట్టుకోలేకపోయానని బాధపడుతున్నావ్ కదా నీకు ఇంకో ఛాన్స్ ఇద్దామని పిలిపించాను అని అంటుంది వైజయంతి. ఈ ఛాన్స్ కోసమే ఎదురు చూస్తున్నాను అని అంటాడు విశాల్.నువ్వు దాన్ని అభి వాళ్ళ ఇంట్లో నుంచి వెత్తుకు రావాలి,ఆ తర్వాత ఏం చేసుకుంటావో నీ ఇష్టం, స్వర కనిపించకుండా పోయిందని అభీ తన ఉద్యోగం పోవడానికి కారణమైన స్వరని తనే ఏదో చేశాడని అందరూ నమ్ముతారు, ఇప్పటికే ఇద్దరు మధ్య అఫైర్ ఉందని బయట పుకారు ఇద్దరికీ చెడింది కాబట్టి స్వరని అడ్డు తొలగించుకోవడం కోసం అభి ఇదంతా చేశాడని నమ్మిద్దాం ప్రయోజనం మనకి నింద వాడికి అని అంటుంది వైజయంతి. ఎప్పుడు వెళ్లాలి వాళ్ళ ఇంటికి అని అడుగుతాడు విశాల్.

Paluke Bangaramayenaa Today Episode  January 16 2024 Episode 126 Highlights
Paluke Bangaramayenaa Today Episode  January 16 2024 Episode 126 Highlights

చందన నుంచి కన్ఫర్మేషన్ రాగానే వెళ్ళాలి అని చెప్తుంది వైజయంతి. ఈ దాగుడుమూతలు ఎందుకు కానీ తాళి తీసుకుని త్వరగా బలవంతంగా తాళి కట్టేసి తీసుకొచ్చేసేయ్ అని అంటాడు రంగరాజు. నేను కూడా అదే పనిలో ఉన్నానని తాళి తీసి చూపిస్తాడు విశాల్. ఇంతలో పక్కనుండి వెళుతున్న నాయుడు వాళ్ళ ముగ్గురుని గమనిస్తాడు. వీళ్లు ముగ్గురు కలిశారంటే ఎదో ప్లాన్ వేస్తున్నారని వీళ్ళనుండి నా కూతుర్ని కాపాడుకోవాలి అని అనుకుంటాడు నాయుడు. వాళ్ళేం ప్లాన్లు వేస్తున్నారు కనుక్కుంటాను సార్ అని కానిస్టేబుల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కట్ చేస్తే, అభి తన ఉద్యోగం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో స్వర అక్కడికి వస్తుంది.ఏమైంది సార్ అస్సలు బయటికి రావడం లేదు అని అడుగుతుంది స్వర. ప్రతిరోజు ఒకేలా ఉండడం మీకు బోర్ కొట్టడం లేదా, ఎందుకలా అంటున్నారు అని అడుగుతుంది.  ఏ నోరు మూసుకో అని అంటాడు అభి. నీ ప్రాబ్లమ్స్ నీకు ఉంటాయి సరేలెండి ఈ కాఫీ తాగండి అని అంటుంది స్వర. నన్ను ఇన్ని మాటలతోనే  ఇబ్బంది పెట్టడం నీకు సరదాగా ఉంది కదా అని అంటాడు అభి. అయ్యో సార్ మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనుకుంటాను మీకు నిజం చెప్పాలని నేను ఎన్ని ఆపసోపాలు పడుతున్నాను మీకు తెలుసా అని అంటుంది స్వర. ఎందుకు సార్ మీ మగవాళ్ళంతా ఇలా చిన్న చిన్న విషయాలకి కంగారు పడిపోతారు, ఏదో ఆకాశం తెగిపడిపోయి మీద పడిపోతున్నట్టు ఫీల్ అయిపోతారు ఎందుకు అని అంటుంది. నీ ప్రాబ్లం నాకు తెలుసు సార్ మీరు జాబ్ గురించి టెన్షన్ పడుతున్నారు, నేనున్నాను కదా నేను సెట్ చేస్తాను కదా, నా వల్ల మీరు కోల్పోయినవన్నీ మీకు తిరిగి ఇచ్చేదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని అందుకే మా నాన్నతో మీ జాబ్ గురించి మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను రేపు పనైపోతుంది అని అంటుంది స్వర.

Paluke Bangaramayenaa Today Episode  January 16 2024 Episode 126 Highlights
Paluke Bangaramayenaa Today Episode  January 16 2024 Episode 126 Highlights

ఏమనుకుంటున్నావే నా గురించి నువ్వు, మీ తండ్రి కూతుర్ల దయ దాక్షిన్యాలతో బతకాలా నేను, నువ్వే నా జీవితం నాశనం చేసి ఇప్పుడేదో ముష్టి వేస్తున్నట్టు నా మోహన పడేసి నా బతుకును ఉద్ధరించాలి అనుకుంటున్నావా అని అరుస్తాడు అభి. ఆపద వచ్చినప్పుడు ఒకరికొకరం సహాయం చేసుకోవడంలో తప్పేముంది, అలాగా అంటే మీరు నాకు ఎన్ని సార్లు సహాయం చేశారు ఇప్పుడంటే పరిస్థితులు ఇలా అయ్యాయి కానీ ఒకప్పుడు మీరు నేను ఎలా ఉండే వాళ్ళం అసలేం జరిగిందో తెలుసుకోకుండా నన్ను చెప్పనివ్వకుండా ఎందుకు సార్ ఇలా నా మీద ద్వేషంతో మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు అని అంటుంది స్వర. నీ పిచ్చివాగుడు ఆపేసి ఇక్కడి నుంచి వెళ్ళు నీ పిచ్చి కాకి నేను తాగను అని అంటాడు అభి. స్వర బయటికి వెళ్లిపోతుంది. మీరు నన్ను ఎంత ఇబ్బంది పెట్టిన పర్వాలేదు సార్ మీకు నేను జాబ్ సెట్ చేసే వెళ్తాను అని అనుకుంటుంది స్వర.

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri