Paluke Bangaramayenaa november 13 2023 episode 72: బావ ఆ అబి చాలా ఎక్కువ చేస్తున్నాడు అసలు ఎందుకు బావ ఆ మన ఇంట్లో పెత్తనం చాలా ఇస్తున్నాడు స్వరకి బాగోలేదు స్వరకి రేపు స్నానం పొయ్యాలంట నాకేమో ఎలా చేయించాలో తెలియదు కళ్యాణిని వచ్చి చేపియమని అడుగుదామంటే అభిషేక్ వద్దంటున్నాడు అసలు ఏమనుకుంటున్నాడు బావ అని వైజయంతి నాయుడుతో అంటుంది. వైజయంతి అలా అంటూ ఉండగానే అభిషేక్ వాళ్ళ అమ్మని తీసుకొని లోపలికి వస్తాడు, సార్ ఈవిడ మా అమ్మ యశోద స్వరకి బాగోలేదు కదా స్నానం చేయించాలని మా అమ్మని తీసుకు వచ్చాను సార్ అని అభిషేక్ చెప్తాడు. చూడండి స్వరకి స్నానం చేయించాలని మా అబ్బాయి తీసుకువచ్చాడు మీరు ఒప్పుకుంటే చేయిస్తాను లేదంటే వెళ్ళిపోతాను అని యశోద అంటుంది.

మీరు చేస్తానంటున్నది సహాయము అమ్మ పిలవకుండానే ఎవరైనా సహాయం చేస్తానంటే వద్దంటానా అలాగే స్వరకి స్నానం చేయండి అని నాయుడు అంటాడు. స్వర ఎక్కడ ఉందండి అని యశోద అడుగుతుంది.పైన తన గదిలో ఉంది వెళ్ళండి అని నాయుడు అంటాడు. బావ ఈ సంఘటన అడ్డుపెట్టుకొని వాళ్ళు మనకు దగ్గరవుతున్నారు అనుకుంటా కొంపతీసి నువ్వు ఒప్పుకుంటావా ఏంటి ఆబి ఎవరిని రావద్దు అంటున్నాడు కానీ వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లెని తీసుకొని వస్తున్నాడు ఏంటి బావ నేను మాట్లాడుతుంటే ఏమీ మాట్లాడవు సమాధానం చెప్తేనే కదా నీ మనసులో ఏముందో నాకు తెలిసేది అని వైజయంతి అంటుంది. నాయుడు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. అంటే ఈ ఈయన వాళ్లకి దగ్గరవుతున్నాడన్నమాట అని వైజయంతి తన మనసులో అనుకుంటుంది. కట్ చేస్తే యశోద స్వరకి స్నానం చేయిస్తుంది,స్వర ఇంకో రెండు రోజులు అయితే మొత్తం తగ్గిపోతాయి ఏం పర్వాలేదు అమ్మ నేను చూసుకుంటాను కదా అని యశోద అంటుంది.రా అన్నయ్య స్వరను చూడు అని కీర్తి అంటుంది.

అబి ఇంకా రెండు రోజుల్లో తగ్గిపోతుంది రా నువ్వు తనతో మాట్లాడుతూ ఉండు మేము బయటకు వెళ్లి వస్తాము అని యశోద వెళ్ళిపోతుంది. స్వర ఎలా ఉన్నావు అని అభిషేక్ అడుగుతాడు. నాకేంటి సార్ బాగానే ఉన్నాను అని స్వర అంటుంది. కట్ చేస్తే,యశోద గుడికి వెళుతుంది.అదే గుడికి ఝాన్సీ కూడా వస్తుంది. వాళ్ళిద్దరూ గుడి దగ్గర కలుస్తారు. ఏంటి ఆంటీ మీరు ఇలా వచ్చారు అని ఝాన్సీ అడుగుతుంది. ఏమీ లేదమ్మా స్వరకి ఒంట్లో బాగోలేదు కదా అమ్మవారికి పూజ చేయిద్దామని వచ్చాను అని యశోద అంటుంది. అవునా ఆంటీ నేను కూడా గుడికి వచ్చాను రండి పూలు తీసుకుందాము అని ఝాన్సీ అంటుంది. యశోద పూలు కొబ్బరికాయలు తీసుకుందామని కొంచెం దూరం వెళుతుంది. ఇంతలో విశాల్ వచ్చి హాయ్ మేడం అని అంటాడు.హాయ్ రాము గారు ఎలా ఉన్నారు మీరు నాకు అదే పేరు తోటే కదా పరిచయమయ్యారు విశాల్ అని ఝాన్సీ అంటుంది.

ఓ తెలిసిపోయిందా అభి గాడికి చెప్పు నాతో పెట్టుకోవద్దని వాడు ఈమధ్య చాలా ఎక్కువ చేస్తున్నాడు అని విశాల్ అంటాడు. ఏం చేశాడు అందరూ ముందు గల్లా పట్టుకొని చంప దెబ్బ కొట్టాడంట కదా నీ చెంప వాపు ఇంకా కనపడుతూనే ఉంది అని ఝాన్సీ నవ్వుతుంది. చూడు ఝాన్సీ అభిషేక్ నన్ను ఎందుకు కొట్టాడు నీకు తెలుసు నాకు తెలుసు కానీ నేను అంత మంచి వాడిని కాదు నాతో పెట్టుకోవద్దు అని చెప్పు అని విశాల్ అంటాడు. ఏంటి బెదిరిస్తున్నావా నేను అభిషేక్ ఉన్నంతవరకు స్వరకి నీకు పెళ్లి జరగనివ్వము నీకు శిక్ష పడేలా చేస్తాము స్వరని కాపాడుతాను చూస్తూ ఉండు అని ఝాన్సీ అంటుంది. విశాల్ ఏమీ అనకుండా కోపంగా వెళ్ళిపోతాడు.

ఝాన్సీ గుడిలో పూజ చేయించి స్వామి స్వరకి తొందరగా నయమైపోవాలి ఆ విశాల్ గాడికి శిక్ష పడాలి అని కోరుకుంటుంది. అక్కడే యశోద కూడా అమ్మ జగన్మాత స్వరకి తొందరగా నయమైపోయేలా చూడమ్మా అసలే తల్లిని పోగొట్టుకుని బాధలో ఉంది ఇంకా బాధ పెట్టకు తల్లి త్వరగా తగ్గిపోతే నీకు పొర్లు దండాలు పెడతాను అని యశోద మొక్కుకుంటుంది. కీర్తి కూడా దుర్గమ్మ స్వరకి మా అన్నయ్యకి పెళ్లి జరిగేలా చూడు ఈ ఝాన్సీ ఎందుకో మా అన్నయ్యను ప్రేమిస్తున్నట్టుంది తనను దూరం చేయి అని కీర్తి మొక్కుకుంటుంది.

అమ్మ ఝాన్సీ అమ్మవారికి పొర్లు దండాలు పెడతానని మొక్కుకున్నాను ఏర్పాట్లు అయిపోయాయా అమ్మ అని అడుగుతుంది యశోద. ఆంటీ అన్ని ఏర్పాట్లు అయిపోయాయి కానీ ఒక్కసారి ఆలోచించుకోండి మీరు వయసులో పెద్దవారు స్వర నాకు చెల్లెలు లాంటిది నేను తనకోసం పొర్లు దండాలు పెడతాను అని ఝాన్సీ అంటుంది ఏం పర్వాలేదులే అమ్మ అని యశోద అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్