NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa November 27 2023 Episode 84: అభి ని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్న వైజయంతి, డి ఐ జి అభిషేక్ ని ట్రాన్స్ఫర్ చేస్తాడా లేదా…

Paluke Bangaramayenaa Today Episode November 27 2023 Episode 84 Highlights

Paluke Bangaramayenaa November 27 2023 Episode 84: ఆ రౌడీలను చిత్తక్కోటి కరుణ పోలీస్ స్టేషన్ కి పంపిస్తుంది. మమ్మల్ని కాపాడినందుకు నమస్కారం అమ్మ అని ఆ పెద్ద వాళ్ళిద్దరూ అంటారు. మీరు మా అమ్మ నాన్నల లాగా ఉన్నారు మీరు నాకు దండం పెట్టడం ఏంటి జాగ్రత్తగా వెళ్ళండి అని కరుణ అంటుంది. చల్లగా ఉండమ్మా అని వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. కట్ చేస్తే, మీరు వచ్చాక కూడా ఇంకా ఎంతసేపు అత్తయ్య అని విశాల్ అంటాడు. మనకు పని కావాలంటే వెయిట్ చేయాలి విశాల్ అని వైజయంతి అంటుంది. ఇంతలో డి ఐ జి వచ్చి సారీ  రంగరాజు గారు ఎప్పుడూ నాయుడు గారితో వచ్చే మీరు ఈరోజేంటి వాళ్ళ వైఫ్ తో వచ్చారు ఏదైనా ముఖ్యమైన విషయమా అని డిఐజి అంటాడు. అవును డిఐజి గారు చాలా ముఖ్యమైన విషయం అని వైజయంతి అంటుంది.ఎమ్మెల్యేగా మీరు నిలబడుతుంటే అపోజిషన్ వాళ్లు ఏమైనా అడ్డం పడుతున్నారా అని అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode November 27 2023 Episode 84 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 27 2023 Episode 84 Highlights

అపోజిషన్ వాళ్ళు కాదు మీ పోలీసు వాళ్ళు అడ్డుపడుతున్నారు, మా నాయుడు బావకి హౌస్ అరెస్ట్ కోరింది ఎవరు సార్ అని వైజయంతి అంటుంది. అభి మీ మర్యాద కోసం అలా చేశాడమ్మా అని డీఐజీ అంటాడు. కేసు సాల్వ్ చేయడానికి ప్రయత్నించకుండా మా అమ్మాయిని మాయమాటలు చెప్పి తన వెనుక తిప్పుకుంటున్నాడు అని వైజయంతి అంటుంది. సారీ మేడం మీరేదో పొరపాటు పడి ఉంటారు అభి చాలా సిన్సియర్ ఆఫీసర్ అని డిఐజి అంటాడు. అవును సార్ చాలా సిన్సియర్ పక్కవాడి భార్యతో సరసాలు ఆడే అంత సిన్సియర్ అని తన దగ్గర ఉన్న వీడియోని చూపెడతాడు విశాల్. అది చూసినా డిఐజి సరే మేడం మీరు అనుకున్నట్టుగానే అభి నీ పిలిచి మందలిస్తాను అని డిఐజి అంటాడు. తనని మందలించడం కాదు వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయండి అని వైజయంతి అంటుంది. అలాగే మేడం మీరు  ఇబ్బంది పడకుండా ఒక లేడీ ఎస్సై కి  మి కేసు అప్పజెప్తాను తన పేరు కరుణ తను పాతబస్తీలో పని చేస్తుంది అని డిఐజి అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode November 27 2023 Episode 84 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 27 2023 Episode 84 Highlights

తను ఏజ్ ఎక్కువ ఉంటుందా అని వైజయంతి అంటుంది.లేదమ్మా చిన్నమ్మాయి తనకి ఫుల్ పవర్సు ఇస్తాను అని డీఐజీ కరుణ కి ఫోన్ చేసి నాయుడు గారి కేసు ఇకపై నువ్వే డీల్ చేయాలి అని అంటాడు. ఓ పెద్దోళ్ల కథన మస్తు ఉంటది లే సార్ గంటలో అక్కడ ఉంటాను అని కరుణ అంటుంది. ఈరోజు నుండి అభికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం ఉండదు అని డి ఐ జి అంటాడు. థాంక్యూ సార్ మీ రుణం నేను ఎమ్మెల్యేగా గెలిచాక తీర్చుకుంటాను అని వైజయంతి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే అభి స్వర కి ఫోన్ చేస్తాడు. ఏం చేస్తున్నావ్ స్వర అని అడుగుతాడు. ఏమీ లేదు సార్ నాన్నకి టాబ్లెట్ వేస్తున్నాను అని స్వర అంటుంది. వాళ్ళిద్దరూ అలా ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో నాడు టాబ్లెట్ వేసుకొని నీళ్ల గ్లాసు అందుకోబోతూ గ్లాసు అందక కింద పడిపోతాడు నాయుడు. ఫోను సిగ్నల్ కట్ అవ్వగానే స్వర వాళ్ళ నాన్నని చూసేసరికి కింద పడిపోయి ఉంటాడు. నాన్న నీకేమైంది నాన్న లే నాన్న అని స్వర లేపుతుంది. ఇంతలో వైజయంతి వచ్చి నేను అనుకున్నట్టే జరిగింది ఈ సిచువేషన్ నాకు అనుకూలంగా మార్చుకోవాలి అని వైజయంతి అనుకుంటుంది.

Paluke Bangaramayenaa Today Episode November 27 2023 Episode 84 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 27 2023 Episode 84 Highlights

ఏమి తెలియని అట్టు వైజయంతి గబగబా పరిగెత్తుకొచ్చి బావ ఏమైంది బావ లే అని లేపి కుర్చీలో కూర్చోబెడుతుంది. ఆ తరువాత స్వర వైపు తిరిగి ఏంటి స్వర జాగ్రత్తగా చూసుకోమన్నాను కదా అలా ఎలా కింద పడిపోయాడు అని అంటుంది. నేను ఇప్పుడే ఫోన్ వస్తే మాట్లాడుతున్నాను ఈ లోపు ఇలా జరిగిపోయింది పిన్ని అని స్వర అంటుంది. మీ నాన్న దగ్గరే ఉండి ఫోన్ మాట్లాడుకోవచ్చు కదా అని వైజయంతి అంటుంది. సిగ్నల్  సిగ్నల్ లేదని కొంచెం అటు వెళ్లి మాట్లాడాను పిన్ని అని స్వర అంటుంది. నిజం చెప్పు ఎవరు ఫోన్ చేశారు ఆ అభినేనా అని వైజయంతి అంటుంది. స్వర మౌనంగా ఉంటుంది. నీకు మీ నాన్న కంటే అభినే ఎక్కువైపోయాడా నోరు ముయ్, ఇంకెప్పుడూ బుద్ధి ఉంటే మీ నాన్నని చూసుకోమని చెప్పను అని వైజయంతి కోపడుతుంది. బావ ఇదంతా నా తప్పే బావ ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళను అని దొంగ చూపులు చూస్తూ బావ నీకేం కాలేదు కదా అని బాధపడినట్టు యాక్ట్ చేస్తుంది. కట్ చేస్తే, అమ్మ నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను ఎందుకు అంటే అభి గాడికి ఆ కేసుకి ఎటువంటి సంబంధం లేదు అని విశాల్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode November 27 2023 Episode 84 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 27 2023 Episode 84 Highlights

చూసావా రా నువ్వు కొంచెం కోపం తగ్గించుకుంటే అంత మంచే జరిగింది అని వాళ్ళ అమ్మ అంటుంది. అవునమ్మా నాకు కోపం తగ్గించుకోవడం వల్ల వైజయంతి గారు వచ్చే ఆ ఎస్సైని డబ్బుతో కొనేస్తాను నాలుగైదు రోజుల్లో మీ మామయ్యతో మాట్లాడి నీకు త్వరగా ఎంగేజ్మెంట్ చేస్తాను, అని చెప్పింది ఇకమీదట స్వరని పెళ్లి చేసుకుని దాని టార్చర్ పెట్టడమే మిగిలి ఉందమ్మా అని విశాల్ అంటాడు. నువ్వు చెప్తుంటే నాకు ఆనందంగానే ఉంది కానీ ఇంత జరిగిన తరువాత స్వర నీతో పెళ్లికి అంత సులువుగా ఒప్పుకుంటుందంటావా అని కళ్యాణి అంటుంది. ఒప్పుకోదు కరెక్టే కాని ఆ వైజయంతి ఒప్పిస్తుంది ఎందుకంటే తన అవసరం అలాంటిది అని విశాల్ అంటాడు. అవున్రా వైజయంతి ఏది అనుకుంటే అది చేసి తీరుతుంది అని కళ్యాణి అంటుంది ఇంకో గంట సేపట్లో వాడు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతాడు కొత్త ఆఫీసర్ ఛార్జ్ తీసుకుంటుంది అని విశాల్ అంటాడు. అయితే పదరా వెళ్దాం నీ శత్రువు ఓటమిని అంగీకరించి వెళ్లిపోతుంటే మనం అక్కడ ఉండి ఎంజాయ్ చేయొద్దా అని కళ్యాణి అంటుంది. అలాగే అమ్మ ఆప్పుడు  అభి గాడి మొహం ఎలా ఉంటుందో ఒక్కసారి చూడాలి అని విశాల్ వాళ్ళ అమ్మాని తీసుకొని నాయుడు వాళ్ళ ఇంటికి వెళ్లిపోతాడు.

Paluke Bangaramayenaa Today Episode November 27 2023 Episode 84 Highlights
Paluke Bangaramayenaa Today Episode November 27 2023 Episode 84 Highlights

కట్ చేస్తే, ఇంతలో అభిషేక్ వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని సోఫాలో కూర్చుంటాడు. తరువాత స్వర వచ్చి గుడ్ మార్నింగ్ సార్ కాఫీ తీసుకు రమ్మంటారా అని అంటుంది. తీసుకురమ్మంటారా అని అంటావేంటకా తీసుకురా వెళ్లి అని ఆర్య అంటాడు. తన పక్కనే ఉన్న విశాల్ కళ్యాణి కోపంగా స్వర వైపు చూస్తూ ఉంటారు.నమస్కారం నాయుడు గారు ఇంకా వైజయంతి గారు రాలేదేంటి తన కోసం  ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం అని ఒక ఇద్దరు వ్యక్తులు అంటారు. ఆయన మాట్లాడలేడని మీకు తెలుసు కదా అలా ఎలా అడుగుతున్నారు అని అభిషేక్ అంటాడు. ఇంతలో స్వర కాపీ తెచ్చి ఆక్కడున్నా నలుగురికి ఇస్తుంది.ఇంతలో బైజయంతి కూడా హాల్లోకి వస్తుంది. ఇంతలో డి ఐ జి నాయుడు వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇదేంటి డీ ఐ జీ సార్ ఇక్కడికి వస్తున్నారు అని అభిషేక్ లేసి తన తల మీద టోపీ పెట్టుకుని నిలబడతాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri