Pawan Kalyan: `వినోదాయ సితం` రీమేక్ షురూ.. హాట్ టాపిక్‌గా ప‌వ‌న్ రెమ్యున‌రేష‌న్‌!

Share

Pawan Kalyan: ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో న‌టించిన చిత్రం `వినోదాయ సితం`. ఈ మూవీ గ‌త ఏడాది త‌మిళంలో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న‌ట్లు గ‌త కొద్ది రోజుల నుంచీ జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇందులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌లిసి న‌టించ‌బోతున్న‌ట్లు కూడా ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఇప్పుడు ఈ ప్ర‌చార‌మే నిజ‌మైంది. `వినోదాయ సితం` రీమేక్ అధికారికంగా ప్రారంభ‌మైంది. నేడు హైదరాబాద్ లో ఈ రీమేక్ మూవీ పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు.

త‌మిళంలో తెర‌కెక్కించిన సముద్రఖనినే తెలుగుతో ద‌ర్శ‌క‌త్వం బాధ్య‌త‌ల‌ను తీసుకున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. జులై నుండి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. అక్టోబర్ నుండి ప‌వ‌న్ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఈ నేప‌థ్యంలోనే ముందు పవన్ కాంబినేషన్ లో ఉన్న సన్నివేశాలు పూర్తి చేస్తార‌ట‌. ఆ త‌ర్వాత సాయి ధ‌ర‌మ్ తేజ్‌కి సంబంధించి పార్ట్‌ను ఫినిష్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.

ఇక‌పోతే ఈ మూవీకి ప‌వ‌న్ అందుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆయ‌న ఈ మూవీ కోసం ఇర‌వై రోజులే కాల్షీట్స్ ఇచ్చాడ‌ట‌. అయితే ఆ ఇర‌వై రోజుల‌కుగానూ ప‌వ‌న్ ఏకంగా రూ. 50 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా, రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తికి దేవుడు రెండు నెల‌లు బ‌త‌క‌డానికి మోక్షాన్ని క‌లిగిస్తాడు. ఆ తర్వాత అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడన్నదే ఈ మూవీ కథ. ఇందులో దేవుడిగా ప‌వ‌న్‌, మోక్షం పొందిన వ్య‌క్తిగా సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌నిపించ‌బోతున్నారు.


Share

Recent Posts

సముద్రతీరానికి కొట్టుకొచ్చిన అనుమానిత బోటు.. అందులో ఏకే 45 ఆయుధాలు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…

18 నిమిషాలు ago

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

43 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

2 గంటలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

2 గంటలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago