హీరోయిన్ ప్రణీత గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. బెంగుళూరులో వైద్యుల కుటుంబంలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగు సూపర్ హిట్ `పోకిరి` కన్నడ రీమేక్ అయిన `పోర్కి సినిమాతో కన్నడలోకి సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత `ఏం పిల్లో ఏం పిల్లడో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది.
ఇక్కడ ఈమె చేసింది తక్కువ సినిమాలే అయినా.. అందం, అభినయంతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. మరోవైపు తమిళంలోనూ నటించిన ఈ బ్యూటీ.. 2021 వేసవిలో ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజును సైలెంట్ గా వివాహం చేసుకుంది. వీరిది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఇక పెళ్లైన కొద్ద నెలలకే తల్లైన ప్రణీత.. జూన్ నెలలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. పలు ఫొటోలను సైతం షేర్ చేసింది. కానీ, కూతురు ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంది. దాంతో అప్పటి నుండి అభిమానులు కూతురును చూపించమని ప్రణీతను కోరుతూనే ఉన్నారు. అయితే ఎట్టకేలకు ఆమె తన గారాల కూతురిని అందరికీ చూపించింది.
ఈ మేరకు కూతురికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఆమె తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా తన కుమార్తె పేరు `ఆర్నా` అని కూడా పేర్కొంది. దీంతో ప్రణీత కూతురు ఫొటోలు చూసి ఎంత ముద్దుగుందో అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. మరోవైపు నెటిజన్లు సైతం ఆర్నా పిక్స్‌పై లైకుల వర్షం కురిపిస్తున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!