NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram December 19 2023 Episode 1129: ఛాయా కి ల్యాండ్ పేపర్లు ఇచ్చిన సుగుణ.

Prema Entha Madhuram Today Episode December 19 2023 Episode 1129 Highlights

Prema Entha Madhuram December 19 2023 Episode 1129: ఇన్నాల నా నిరీక్షణ ఫలించి నా అను నాకు దగ్గరవుతుంది అనుకుంటే మీ అన్న చేసిన పని వాళ్ళ నాకు దూరమైపోయింది అను వాడిని జైల్లోనే చంపొచ్చు కానీ ఎందుకు చంపలేదు తెలుసా నేను  కుటుంబాన్ని బాధ్యతగా తీసుకొని నా చెల్లెలు పెళ్లి చేద్దామనుకుంటుంటే దానికి నువ్వు అడ్డుపడుతున్నావ్ నీకు అంత మంచిది కాదు ఇదే లాస్ట్ వార్నింగ్ నేనింత చెప్పినాక కూడా నువ్వే మళ్లీ పెళ్లికి అడ్డుపడ్డావ్ అనుకో ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ వెళ్ళిపోతాడు ఆర్య. కట్ చేస్తే, ఆర్య పెళ్లికి డబ్బులు ఎలా రెడీ చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో దివ్య వచ్చి అమ్మ బట్టలు ఒకటి కొంటే సరిపోదు బంగారం కూడా తీసుకోవాలి అని అంటుంది. ఎక్కువగా అరవకే షాపింగ్ అని నాలుగు లక్షల ఖర్చు పెట్టించావు మన ఇంట్లో పరిస్థితి తెలిసి కూడా నువ్వు అలా మాట్లాడతావేంటి అని సుగుణ అంటుంది. ఏంటి నీ కొడుకు గొప్పగా పెళ్లి చేస్తానని చెప్పాడు కదా బంగారం కూడా కొనివ్వలేడా అలాంటప్పుడు ఆ ల్యాండ్ అమ్మేస్తే బాగుంటుంది కదా అని దివ్య అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 19 2023 Episode 1129 Highlights
Prema Entha Madhuram Today Episode December 19 2023 Episode 1129 Highlights

ఎందుకే అలా మాట్లాడుతున్నావ్ ఇప్పటికే నా కొడుకు బాధపడుతున్నాడు నువ్వు ఇంకా మాటలతో వాడిని బాధించకు అని సుగుణ అంటుంది. దివ్య మాటలు గమనించిన అను అక్కడికి వచ్చి చూడు దివ్య నువ్వే ఇలా మాట్లాడితే నీ అత్తగారి వాళ్ళ ముందు నీ పుట్టినిల్లు తక్కువైపోదా మీ అన్నయ్య చేస్తానని మాట ఇచ్చాడు కదా ఎందుకు తొందర పడుతున్నావ్ అని అను అంటుంది. అంత తిప్పలు పడేది ఎందుకు రాధ గారు హరీష్ అడిగినప్పుడు ల్యాండ్ ఇచ్చేస్తే ఇంత బాధ ఉండదు కదా అని జ్యోతి అంటుంది. చూసావా అమ్మ నేను ఇంతలా మాట్లాడుతున్న నీ కొడుకు నుంచి ఏమి సమాధానం రావట్లేదు అని దివ్య అంటుంది.ఏంటి మీ లొల్లి పంచాయతీలు చేస్తర కూరగాయలు కోవస్తారా ఆయన బాధ్యతగా పెళ్లి చేస్తానన్నాడు కదా మీరు గమ్మున ఉండండి అన్ని ఆయనే చూసుకుంటాడు మోన బట్టలు కొనిచ్చాడు రేపు బంగారం కూడా కొనిస్తాడు లే అని యాదగిరి అంటాడు. చూడమ్మా నువ్వు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే నా పెళ్లి పేటాకులు అవుతుంది అని దివ్య కోపంగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,ఛాయా మా బ్రో ఇలా ఇచ్చిన వార్నింగ్ కి భయపడిపోయి పెళ్లి ఆపడం మానేస్తావా ఏంటి అని మానస అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 19 2023 Episode 1129 Highlights
Prema Entha Madhuram Today Episode December 19 2023 Episode 1129 Highlights

ఆర్య ఇచ్చిన వార్నింగ్ కి భయపడ్డ మాట నిజమే కానీ ఎప్పటికీ వెనకడుగు ఏది ఛాయా చూద్దాం ఏం చేస్తాడు అని అంటుంది ఛాయా. ఇంతలో సుగుణ పేపర్లు పట్టుకొని ఛాయ వాళ్ళ ఇంటికి వస్తుంది. నువ్వేంటి ఇలా వచ్చావ్ అని ఛాయా అంటుంది. ఏమీ లేదమ్మా నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను పెళ్లి వాళ్ళు 50 లక్షలు కట్నం దాకా అడుగుతున్నారు ఎలాగూ మీరు మా సైట్ కావాలనే కొన్ని రోజులు అడుగుతున్నారు కదా ల్యాండ్ పేపర్లు మీ దగ్గర తాకట్టు పెట్టుకొని 50 లక్షలు ఇవ్వండి అని సుగుణ అంటుంది. తాకట్టు పెట్టుకోవడం ఎందుకు ఆ ల్యాండ్ మాకు అమ్మొచ్చు కదా అని మానస అంటుంది. లేదమ్మా మాకు ఉన్న ఒకే ఒక ఆస్తి ఇది మాత్రమే మాకు డబ్బులు సర్దుబాటు కాగానే మీ డబ్బులు మీకు ఇచ్చేసి మా ల్యాండ్ పేపర్ తీసుకెళ్తాము మీకు పుణ్యం ఉంటుంది కాస్త సహాయం చేయండి అమ్మ అని సుగుణ అంటుంది. సరే మేము ఆలోచించుకొని చెప్తాము నువ్వు ఇక్కడే ఉండు అని ఛాయా మానస ని తీసుకొని రూమ్ లోకి వెళ్లి మాట్లాడుతుంది. అదేంటి ఛాయా ఆవిడకు డబ్బులు ఇస్తే పెళ్లి సాఫీగా సాగిపోతుంది కదా ఎలా ఆటంకాలు సృష్టిస్తావు అని మానస అంటుంది. మనకు దక్కదు అనుకున్నా ల్యాండ్ మన చేతికే వచ్చింది అలాంటప్పుడు మనం చేయి చార్చుకోవడం ఎందుకు ల్యాండ్ పేపర్లు మనకి ఇస్తుంది కదా బాండ్ పేపర్ మీద రాయించుకుందాం.

Prema Entha Madhuram Today Episode December 19 2023 Episode 1129 Highlights
Prema Entha Madhuram Today Episode December 19 2023 Episode 1129 Highlights

దాన్నే మనం రిజిస్ట్రేషన్ చేయించుకుందాం అని ఛాయా అంటుంది. కానీ ఆవిడ డబ్బులు కావాలంటుంది కదా అని మానస అంటుంది. నేను చెప్పినట్టు చెయ్యి ఆవిడే ఒప్పుకుంటుంది అని ఛాయా అంటుంది.సరే నేను ముందు వెళ్తాను నువ్వు వెనకాల పేపర్లు తీసుకొని రా అని ఛాయా సుగుణ దగ్గరికి వెళ్లి చూడండి మేము బాగా ఆలోచించాము మానస బ్యాంక్ వాళ్లతో మాట్లాడుతుంది కొద్దిసేపు ఉండండి అని అంటుంది ఛాయా. ఇంతలో మానస వచ్చి చూడండి సుగుణమ్మ గారు నేను బ్యాంక్ వాళ్లతో మాట్లాడాను కానీ వాళ్ళు 50 లక్షలు పెద్ద అమౌంట్ కదా ఇప్పటికిప్పుడు ఇవ్వడం కుదరదు అంటున్నారు బాండ్ పేపర్ మీద మీరు సంతకం పెడితే అది బ్యాంకు వాళ్ళకి ఇచ్చేశాక రేపు డబ్బులు పంపిస్తాం అంటున్నారు మీరు ఒప్పుకుంటారా మా మీద నమ్మకం ఉందా మీకు అని మానస అంటుంది.మీ ఇష్టం సూగునమ్మ గారు మీకు నమ్మకం ఉంటే సంతకం పెట్టి వెళ్ళండి రేపు వచ్చి డబ్బులు తీసుకోండి లేదంటే రేపే రండి అని ఛాయా అంటుంది. ఇప్పటికే మా అబ్బాయికి తెలియకుండా ఈ పేపర్లు తీసుకొచ్చానమ్మా రేపు అంటే మా వాడికి తెలిస్తే అసలు ఒప్పుకోడు నా మనసు కూడా మారొచ్చు అందుకని ఇప్పుడే సంతకం పెడతాను అని సుగుణ అంటుంది. సరే అని ఛాయా బాండ్ పేపర్ ఇస్తే సుగుణ సంతకం పెట్టి ఇస్తుంది.ఓకే సుగుణ అమ్మగారు రేపు మీకు డబ్బు అందక మాకు ఫోన్ చేయండి అని మానస అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 19 2023 Episode 1129 Highlights
Prema Entha Madhuram Today Episode December 19 2023 Episode 1129 Highlights

అమ్మ  పెళ్లి ఎన్నో రోజులు లేదు వారం రోజులే ఉంది డబ్బు రేపు ఎలాగైనా సర్దుబాటు చేయండి అని సుగుణ వెళ్ళిపోతుంది. చూసావా మానస పరిస్థితులు ఎదుటి వ్యక్తిని నమ్మేలా చేస్తుంది అని ఛాయా అంటుంది. ఇంత సులువుగా మన చేతికి ల్యాండ్ పేపర్లు వస్తాయని నేను అసలు ఊహించలేదు అని మానస అంటుంది. కట్ చేస్తే,ఆర్య దివ్య అన్నమాటలు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో యాదగిరి వచ్చి సార్ ఏం ఆలోచిస్తున్నారు ఆ దివ్య అన్నమాటలు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతున్నారా అదేదో తెలియక మాట్లాడింది సార్ ఆ ల్యాండ్ ఎప్పుడో డెవలప్మెంట్ అవుతుందని నాకు తెలుసు సార్ అందుకే దాన్ని జాగ్రత్తగా ఉంచమని చెప్పాను దానిమీద ఎవరెవరి కల్లో ఉన్నాయి సార్ అని యాదగిరి అంటాడు.

Prema Entha Madhuram Today Episode December 19 2023 Episode 1129 Highlights
Prema Entha Madhuram Today Episode December 19 2023 Episode 1129 Highlights

యాదగిరి మన ల్యాండ్ డెవలప్మెంట్ కోసం బిల్డర్లకి ఇస్తే మనకు డబ్బు వస్తుంది కదా అని ఆర్య అంటాడు. అవును సార్ అని యాదగిరి అంటాడు. యాదగిరి నేను ఈ పని ఒక ఆర్య వర్ధన్ గా చేయకూడదు కాబట్టి నీకు తెలిసి న బ్రోకర్ ఎవరైనా ఉంటే మాట్లాడి సెటిల్మెంట్ చేయి వాళ్ళతో మాట్లాడదాం అని ఆర్య అంటాడు. యాదగిరి అతనికి తెలిసిన అతనితో మాట్లాడుతాడు. కట్ చేస్తే, యాదగిరి తో మాట్లాడిన అతను ఛాయా కి ఫోన్ చేసి చెప్తాడు. ఏంటి ఛాయా ఎవరు ఫోన్లు అని మానస అంటుంది. ఏమీ లేదు ఛాయా నాకు ఒక పాట గుర్తుకు వచ్చింది మీ బ్రో ఇలా బిజినెస్ కాంట్రాక్టర్ కి ల్యాండ్ లీజుకు ఇచ్చి డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నాడు అని ఛాయా అంటుంది. అదెలా కుదురుతుంది ల్యాండ్ పేపర్లు మన దగ్గర ఉన్నాయి కదా అని మనసా అంటుంది. ఆ విషయం మీ బ్రో ఇల్లాకి తెలవదు కదా మనమే వెళ్లి చెబుదాం పద అని ఛాయా అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella