Prema Entha Madhuram november 14 2023 episode 1099: ఓకే సార్ బ్లడ్ సాంపిల్ టెస్ట్ అయిపోగానే నీకు ఫోన్ చేస్తాను అని డాక్టర్ అంటాడు. సార్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ పని పూర్తి చేయండి అని నీరజ్ అంటాడు. సరేనండి అని డాక్టర్ అంటాడు. నీరజ్ డాక్టర్ దగ్గర నుంచి బయటకు వస్తూ ఉండగా, మానస చూసి హలో మాజీ మొగుడు గారు నేను నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయాక దగ్గు జలుబు అనే జబ్బులు ఏమైనా పట్టుకున్నాయా హాస్పిటల్ కి వచ్చావు అని అంటుంది. నువ్వు నా జీవితం నుంచి వెళ్లిపోయాక చాలా హ్యాపీగా ఉన్నాను నాకు జబ్బులు ఎందుకు వస్తాయి చెప్పు నీకేమన్నా వచ్చాయా ఇలా హాస్పిటల్ కి వచ్చావ్ ఏంటి అని నీరజ్ అడుగుతాడు. నన్ను అంత మాట అంటావా అని మానస అంటుంది. అది విని జెండి చప్పట్లు కొడుతూ ఏంటి మానస ఎలా ఉన్నావు శత్రుల టీం వైపు వెళ్ళిపోయావు కదా బాగానే ఉండుంటావులే అని జెండి అంటాడు. మీరు కూడా ఇక్కడే ఉన్నారా ఇద్దరు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు అన్నమాట చెప్తా మీ సంగతి అని మానస అంటుంది. చూసుకుందాం నీకు తోడుగా ఉన్న ఆ నమ్మకద్రోహులు ఎన్నాళ్ళు ఉంటారు అని జెండి అంటాడు.

మానస కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నీరజ్ దాదా కి ఫోన్ చేసి చెప్పు అని జెండి అంటాడు.నిరజ్ ఆర్య కి ఫోన్ చేసి దాదా బ్లడ్ సాంపిల్స్ ఇచ్చాను త్వరలోనే వాళ్ళ పిల్లల డాడీ ఎవరో తెలిసిపోతుంది అని అంటాడు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు తొందరగా టెస్ట్ చేయమని చెప్పు అని అంటాడు. నేను చూసుకుంటాను దాదా నీకు అక్కడ ఏ ప్రాబ్లం లేదు కదా అని నీరజ్ అంటాడు. ఓకే ఏం పర్వాలేదు నేను చూసుకుంటానులే అని ఆర్య ఫోన్ కట్ చేస్తాడు. కట్ చేస్తే, ఆంటీ ఎంత చెప్పినా వినకుండా ఇక్కడకి తీసుకువచ్చింది పొరపాటున ఆర్య సార్ ఎదురుపడితే నా పరిస్థితి ఏంటి అని అనుకుంటూ బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆర్య ఎప్పుడు వచ్చినట్టే తన రూమ్ లోకి వచ్చి కూర్చుంటాడు. ఇంతలో తన కంట్లో ఏదో నలక పడుతుంది. ఆ నలక తీసుకుంటూ ఎవరో రూమ్ లో ఉన్నది గమనించి ఎవరది ఇక్కడ ఎవరు ఉన్నారు జ్యోతి టవాలా తీసుకురామ్మా ఫ్రెష్ అయ్యి వస్తాను అని ఆర్య అంటాడు.

ఆర్య మాట విన్న అను అక్కడే నిలబడిపోతుంది అయ్యో ఇప్పుడు సార్ చూస్తే ఎలా అని టెన్షన్ పడుతూ కబోర్డ్ లోనే నిలబడుతుంది. త్వరగా తీసుకురామ్మ నేను ఫ్రెష్ అవ్వాలి అని ఆర్య అంటాడు. అను టవల్ మొహం మీద కప్పుకొని ఆరు కళ్ళు నలుచుకుంటూ ఉండగా టవల్ ఆర్య కి ఇస్తుంది.ఇచ్చినవారు ఎవరు అని చూసుకోకుండా ఆర్య వెళ్ళిపోతాడు. అను చూసుకోకుండా అక్కడే ఉన్న ఒక సామానికి తగిలితే అవి కిందపడి శబ్దం వినపడుతుంది. అమ్మ జ్యోతి నీకేం దెబ్బలు తగల్లేదు కదా అని ఆర్య అంటాడు. ఏమి మాట్లాడకుండా అను కిందనే కూర్చొని సైలెంట్ గా ఉంటుంది. ఇంతలో సుగుణ వచ్చి ఏంటమ్మా ఏమైనా దెబ్బ తగిలిందా అని అడుగుతుంది. ఏం పర్వాలేదండి అని అను అంటుంది.సూర్య నీకు చెప్పడం మర్చిపోయాను రాధ ఈ రూమ్ లో ఉంటుంది, కొన్నాళ్ళు నువ్వు హోటల్ దగ్గర రూమ్ లో ఉండు ఎందుకంటే మన కోసమని పిల్లల్ని బెదిరించి కిడ్నాప్ చేసి ల్యాండ్ రాయించుకోవాలని రౌడీలు అనుకున్నారంట అందుకే అక్కడ ఒంటరిగా ఉంటే ప్రమాదం అని మన ఇంటికి తీసుకువచ్చాను అని సుగుణ అంటుంది.

వాళ్లని ఇక్కడికి తీసుకొచ్చి మంచి పని చేసావు అమ్మ అని ఆర్య అంటాడు. సుగుణ వెళ్ళిపోతుంది. రూమ్ లో ఉన్నది ఎవరు అని ఆర్య తొంగిచూసిన అను కనిపించదు సారీ అండి నా రూమ్ అనుకోని వచ్చాను,ఇంకెప్పుడూ ఇక్కడికి రాను మీరు నిర్భయంగా ఉండొచ్చు మీకే భయము లేదు అని అంటాడు. అయ్యో పర్వాలేదండి అని అను అంటుంది. కట్ చేస్తే, పిల్లలు చిక్ చిక్ రైలు అంటూ ఉషా తో ఆడుకుంటూ ఉంటారు. పిల్లల్ని చూసిన ఆర్య పిల్లలు ఎక్కడ గుర్తుపట్టేస్తారో అని టవల్ మొహం మీద కప్పుకొని వెళ్ళిపోతాడు. పిల్లలు ఆడుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మ మన ఇల్లు కంటే నాయనమ్మ వాళ్ళు ఇల్లు చాలా బాగుంది ఇక్కడే ఉందాము అని పిల్లలు అంటారు. అను గారు మా అన్నయ్య బట్టలు ఇక్కడే ఉన్నాయి నేను తీసుకువెళ్తానండి అని ఉష వాళ్ళ అన్నయ్య బట్టలు తీసుకొని వెళుతుంది. బట్టలు తీసుకెళ్లేటప్పుడు ఒక రెడ్ షర్ట్ అక్కడ పడి ఉంటే అను తీసుకొని దాన్ని పట్టుకొని నీకు ఇంత దగ్గరగా ఉన్నా మిమ్మల్ని కలవలేక పోతున్నాను నన్ను క్షమించండి అని అను అంటుంది.కట్ చేస్తే, చూడండి ఇంకొక నాలుగైదు రోజుల్లో మీకు ఆ ల్యాండ్ సొంతం చేసుకొని కబురు పెడతాను అప్పుడు వచ్చి ప్రాజెక్టు స్టార్ట్ చేయండి అని జలంధర్ అంటాడు .

ఐదు ఎకరాల ల్యాండ్ ను కబ్జా చేయలేకపోయారు అది కూడా ఒక పేదవాడి భూమి ఇంకా మీరు ఏం బిజినెస్ చేస్తారండి వారం రోజుల్లో ఆ స్థలాన్ని కబ్జా చేయకపోతే ఈ ప్రాజెక్టు మీతో కాంట్రాక్టు చేసుకోలేను అని ఆఫీసర్ అంటాడు. ఏంటి అన్నయ్య పిల్లల్ని కిడ్నాప్ చేసి మళ్లీ ల్యాండ్ రాయించుకునే ప్రయత్నం చేద్దాము అని ఛాయా అంటుంది. కిడ్నాప్ విషయం ఫెయిల్ అయితే ఎలాగో దివ్యని చేసుకోబోయే వాడు మన చేతుల్లోనే ఉన్నాడు కదా అతన్ని ఏమైనా చేస్తాడేమో అని మానస అంటుంది.అతన్ని నమ్ముకుంటే పని అయ్యేలా లేదు అని జలంధర్ రౌడీలను పిలిచి పిల్లలని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ వేయండి అని అంటాడు. సార్ ఇప్పుడు పిల్లలు ఆ ఇంట్లో లేరు ఆ సుగుణ వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు అని రౌడీలు చెప్తారు. అదెలా సాధ్యం అను బ్రో ఉన్న దగ్గరికి వెళ్ళదు అని మానస అంటుంది. అంటే మనం బెదిరించామని అను జాగ్రత్త పడి తెలివిగా సుగుణ వాళ్ళ ఇంటికి వెళ్లింది అన్నమాట ఇక ఉపేక్షించి లాభం లేదు అన్నయ్య ఏదో ఒక పథకం వేసి ఆ ల్యాండ్ రాయించుకోవాలి లేదంటే మన చేయి జారిపోతుంది అని ఛాయ అంటుంది.మనం వేసే ప్లాను ప్రతిదానికి ఆర్య అడ్డు తగులుతున్నాడు ఏం చేయాలి అనుకున్న చేయలేకపోతున్నాము అని జలంధర్ అంటాడు.

చూడు అన్నయ్య ఈసారి ప్లాన్ నేను వేస్తాను పిల్లలని రేపు కిడ్నాప్ చేద్దాము మీరు రెడీగా ఉండండి అని ఛాయా అంటుంది.. కట్ చేస్తే అమ్మ ఈరోజు అంతా నువ్వు అన్నం తినవు అంట దేనికి డాడీ కోసమేనా నువ్వు ఇన్ని చేసినా డాడీ తిరిగి రావట్లేదు డాడీ మంచోడు కాదా అమ్మ అని ఆకాంక్ష అంటుంది. అదేమీ లేదు అక్కి మీ నాన్న చాలా మంచివారు ఆఫీస్ పనిలో పడి మన దగ్గరికి రావట్లేదు అని అను అంటుంది. మంచివాడు అయితే మనతో ఉండాలి కదా అమ్మ మరి ఎందుకు దూరంగా ఉన్నాడు అని అడుగుతుంది. సార్ మీకు ఇంత దగ్గరగా ఉన్న నీకు ఎదురు పడలేక ఇబ్బంది పడుతున్నాను నీ భుజం మీద తలవాల్చినా బాధని అంతా చెప్పుకొని భారం దించుకోవాలనిపిస్తుంది అని అను గుమ్మం దగ్గర నిలబడి అనుకుంటుంది. ఆర్య అను ఎక్కడ ఉంది ఏం చేస్తుందని ఆలోచిస్తూ ఉంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది