Trinayani november 14 2023 episode 1084: ఏంటి చెల్లి డబ్బు తెచ్చావు ఎక్కడిది ఇంత డబ్బు అని హాసిని అడుగుతుంది. ఏదైనా బ్యాంకు కొల్లగొట్టావా చిన్న మరదలా అని వల్లబ్బా అంటాడు. లేదు బావగారు ఇది నా డబ్బే అని సుమన అంటుంది. ఇంత డబ్బు నీకు ఎక్కడిది అని తిలోత్తము అంటుంది. మూడు కోట్లు పెట్టి కొన్న నగలు అమ్మవారి దగ్గర పెట్టాను ఇంక మిగతా ఏడు కోట్లు బ్యాంకులో ఉంటే ఏమొస్తుందని డ్రా చేసుకోవచ్చాను అని సుమన అంటుంది. ఎందుకిలాంటి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటావు తిన్నగా ఉండలేవా అని విక్రాంత్ కోప్పడతాడు. విక్రాంత్ కోప్పడతావ్ ఎందుకురా మెల్లగా కూడా చెప్పొచ్చు అని విశాల్ అంటాడు.బ్రో అది ఒక్క రూపాయి రెండు రూపాయలు కాదు 7 కోట్లు బ్రో, ఇంట్లో ఉంటే బాగోదు ఎవరైనా చూస్తే దొంగతనం చేస్తారు అని విక్రాంత్ అంటాడు. ఏంటి సుమన డబ్బు ఉందని పొగరు చూపించుకుంటున్నావా అని లలిత అంటుంది. మీరేమైనా అనుకోండి పెద్ద అత్తయ్య గారు నా డబ్బు అమ్మవారు ముందు పెట్టాను అని సుమన అంటుంది.

చూడు సుమన ఇప్పటికే మూడు కోట్లు పెట్టి నగలు తెచ్చావు 7 కోట్లు డ్రా చేసుకొని ఇంట్లో పెడితే ఇంకేమైనా ఉందా ఎందుకు ఇలాంటి తెలివి లేని పనులు చేస్తూ ఉంటావు చేసేటప్పుడు నన్ను అడగొచ్చు కదా అంటుంది. పెద్ద అత్తయ్య చీపిరి కట్ట ఉప్పు తీసుకువచ్చి చీప్ గా పూజ చేసినట్టు నేను చేతులు దులిపేసుకోలేను అని సుమన అంటుంది. మన రంగు కాగితాలతో అమ్మవారికి పూజ చేసి మెప్పించలేవు నీ మనసు అని ఫోను అక్కడ పెట్టు అమ్మ సంతోషిస్తుంది అని స్వామీజీ అంటాడు. ఏంటి స్వామి బూడిద పూసుకునే మీకు ఏం తెలుస్తుంది ఆ డబ్బుల గురించి అని సుమన అంటుంది. చూడు సుమన చిన్న పెద్ద తేడా లేకుండా స్వామీజీని మాటలు అంటే చెంప పగులుతుంది జాగ్రత్త అని నైని అంటుంది. అమ్మ మాట మాట పెంచుకుంటే గొడవవుతుంది ఏది ఏమైనా సుమనమ్మ తెలివిగా ప్రవర్తించింది అని ఎద్దులయ్య అంటాడు. అమ్మవారికి హారతి ఇవ్వు అని విశాల్ అంటాడు. బావగారు డబ్బు నగలు అమ్మవారికి నేనే ఎక్కువగా పెట్టాను కాబట్టి ఈసారి హారతి నేనే ఇస్తాను నాకు అమ్మవారికి హారతి ఇచ్చి అర్హత ఉంది అని సుమన అంటుంది.

కాలుతుందేమో అని ఎద్దులయ్య అంటాడు.చేతిలో కర్పూరం పెట్టుకొని వెలిగిస్తాను ఎద్దులయ్య నీ పిచ్చిగాని అని సుమన అంటుంది. ఎందుకు ఎద్దులయ్యా చెప్పినా వినని ఆవిడకి ఎందుకు చెప్తావు అని డమ్మకం అంటుంది. ఎవరు ఇస్తే ఏముంది నైని హారతి అమ్మవారికి ఇవ్వడం ముఖ్యం అని స్వామీజీ అంటాడు.సరే అనే హాసిని అమ్మవారికి హారతి ఇస్తూ ఉండగా అందులో నుంచి ఒక కర్పూరం డబ్బుల పెట్టెలో పడుతుంది ఇంకొకటి తన చీర మీద పడుతుంది. అది చూసి అందరూ సుమన నీ చీర కాలుతుంది అయ్యో డబ్బులని కాలిపోతున్నాయి అని అంటారు. అయ్యో నా డబ్బు నా డబ్బు ఏడు కోట్ల డబ్బు అంత కాలి బూడిద అయిపోతుంది అని గుండెలు బాదుకుని సుమన ఏడుస్తుంది. సుమన ఏడవకు ఏడిస్తే మాత్రం డబ్బులు తిరిగి వస్తాయా చెల్లి ఏడవకు అని నైని అంటుంది. నా డబ్బు నా డబ్బు అని సుమాన ఏడుస్తుంది. నీ డబ్బు మీద మా చెయ్యి కూడా పడొద్దు అని అన్నావని నీళ్లు పోయలేదు సుమన లేదంటే డబ్బు కాపాడే వాళ్ళం అని లలితమ్మ అంటుంది.

కాలిపోయే డబ్బులు చెయ్యి పెడితే చేతులు కాలితే అందుకని నిన్ను వాళ్ళు ఆగబట్టారు అని తిలోత్తమ అంటుంది. చూసావా సుమన ఈ బూడిద పూసుకున్న నా ముందే నీ డబ్బు కాలి బూడిద అయిపోయింది అని స్వామీజీ అంటాడు. జ్ఞానం అనే సంపద ముందు ఆ తెల్ల కాగితం ఎంత అని తెలుసుకోలేక మాట్లాడింది గురువుగారు అని లలితమ్మ అంటుంది. కట్ చేస్తే, సుమన డబ్బు పోయిందని కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. ఇంతలో విక్రాంత్ వచ్చి సోపాలకు కూర్చొని ఏంటి సంగతులు అని అంటాడు. ఏముందండి నా ఏడు కోట్ల డబ్బు అంత కాలి బూడిద అయిపోయింది నా డబ్బు నాకు ఇప్పించండి అని అంటుంది. ఏంటి ఇప్పించేది దేనికైనా ఇన్సూరెన్స్ ఉంది కానీ డబ్బు కాలిపోతే ఇన్సూరెన్స్ లేదు మనిషి చనిపోతే ఇన్సూరెన్స్ ఉంది షాపులు కూలిపోతే ఇన్సూరెన్స్ ఉంది కానీ అదే డబ్బుకి మాత్రం ఇన్సూరెన్స్ లేదు అని విక్రాంత్ అంటాడు. ఇప్పుడు ఎలాగండి నా ఏడు కోట్లు పోయాయి అని సుమన బాధపడుతుంది. చూడు సుమన దాని గురించే ఆలోచించి ఇంకా బాధపడే కంటే ఆ డబ్బు పోతే పోయింది అని ఊరుకో అని విక్రాంత్ అంటాడు. ఎప్పుడు నన్ను ఊరుకో అని అంటావే కానీ నా బాధ అర్థం చేసుకోవేంటి అని సుమన అంటుంది.

నువ్వు ఏడ్చే దాంట్లో అర్థం ఉంటే ఓదార్చొచ్చు అర్థమే లేదు ఏడుస్తున్నప్పుడు ఏమని సమాధానం చెప్తాము అని విక్రాంత్ అంటాడు. కట్ చేస్తే, వదిన నిలువ వత్తులు సరిపోతాయా అని విక్రాoత్ అంటాడు. ఎద్దులయ్య ఒక ఎర్రటి క్లాత్ కింద పరిచి దానిమీద మూడు ఒత్తులు వేసి దీపం వెలిగించు అని స్వామీజీ అంటాడు. వినిపించిందా డమ్మక్క ఏర్పాటు చెయ్యి అని ఎద్దులయ్య అంటాడు. అందరూ ఆనందంగా ఉన్నారు కానీ సుమనమ్మ ఏడుస్తుంది అని డమ్మక్క అంటుంది. ఏముంది ఉన్నది ఉన్నదని గర్వపడింది అంతా పోయేసరికి మూలన కూర్చుంది అని హాసిని అంటుంది. హాసిని మీ అత్తయ్య ఇంకా రాలేదేంటి అని లలిత అంటుంది. అదిగో మాటల్లోనే వచ్చింది లడ్డు అత్తయ్య అని హాసిని అంటుంది. ఏ ఏంటే నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు లడ్డు గిడ్డు అంటున్నావ్ ఏంటి అని తిలోత్తమా అంటుంది. అంటే లడ్డు అంటే స్వీట్ గా ఉంటావని అంటుందమ్మా అని వల్లభ అంటాడు. ఇన్ని సంవత్సరాలలో మామయ్య టేస్ట్ చూడలేదు మీరు ఎలా చెప్తున్నారు అండి స్వీట్ గా ఉందని హాసిని అంటుంది. ఏయ్ ఏం మాట్లాడుతున్నావే నోరు అదుపులో పెట్టుకో బాగోదు మమ్మీ అయినా పెద్ద పెద్దమ్మ వచ్చిందని దీని నోరు లెగుస్తుంది అని వల్లభ అంటాడు. అంటే ఏంటి తిలోత్తమా నేను ఉన్నంత సేపైనా మీ భయం అని లలిత అంటుంది. అంటే గాయత్రి అక్క కాలధర్మం చేశాక ఇంటి బాధ్యత తీసుకోవాలి కదా అక్క అని తిలోత్తమా అంటుంది.

కాలధర్మం అంటే 60 సంవత్సరాలైనా బ్రతకాలి 30 సంవత్సరాలకే ఎందుకు చంపేశారు తిలోత్తమ అని స్వామీజీ అంటాడు. అంటే ఏంటి స్వామీజీ తిలోత్తమ అత్తయ్యని చంపేసింది అని అంటున్నారా అని హాసిని అంటుంది.ఆ మాట వినగానే అందరూ షాక్ అయిపోతారు. సారీ ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది అని హాసిని అంటుంది. ఈవిడ నా కన్నతల్లిని చంపేసింది నన్ను కొట్టింది తిట్టిందో తెలియదు కానీ పెంచి పెద్ద చేసింది అందుకే ఏమీ అనకుండా ఊరుకుంటున్నాను అని విశాల్ తన మనసులో అనుకుంటాడు. అందరూ మాట్లాడుతున్నారు సుమనమ్మ మాత్రం బాధపడుతూ కూర్చుంది అని డమ్మకం అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగిస్తుంది