మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా నటించిన తాజా చిత్రం `రంగరంగ వైభవంగా`. గిరీశాయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు. ప్రభు, నరేష్, నవీన్ చంద్ర, సుబ్బరాజు తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు.
అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 2న రిలీజ్ అయింది. అయితే తొలి షో నుంచి ఈ చిత్రానికి నెగటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మెగా అభిమానులను కూడా ఈ సినిమా ఆకట్టుకోలేకపోవడంతో.. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.
ఫస్ట్ వీకెండ్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే రూ. 96 లక్షల షేర్, 2వ రోజు రూ. 56 లక్షల షేర్ ను రాబట్టింది. అయితే 3వ రోజు సండే హాలిడే కలిసిరావడంతో కాస్త బెటర్‌గా పర్ఫామ్ చేసి రూ. 68 లక్షల షేర్‌ను దక్కించుకుంది. ఇక ఏరియాల వారీగా `రంగరంగ వైభవంగా` ఫస్ట్ వీకెండ్ టోటల్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే..
నైజాం: 78 లక్షలు
సీడెడ్: 22 లక్షలు
ఉత్తరాంధ్ర: 29 లక్షలు
తూర్పు: 20లక్షలు
పశ్చిమ: 14 లక్షలు
గుంటూరు: 26 లక్షలు
కృష్ణ: 19లక్షలు
నెల్లూరు: 12 లక్షలు
———————————
ఏపీ+తెలంగాణ మొత్తం= 2.20 కోట్లు(3.80 కోట్లు~ గ్రాస్)
——————————–
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 15 లక్షలు
ఓవర్సీస్- 40 లక్షలు
—————————————
వరల్డ్ వైడ్ కలెక్షన్= 2.75 కోట్లు(5.00 కోట్లు~ గ్రాస్)
—————————————
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 8.50 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అవ్వాలంటే.. ఫస్ట్ వీకెండ్ వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 6.25 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. కానీ, ఆ రేంజ్ కలెక్షన్స్‌ను రాబట్టడం కష్టమే అని.. బయ్యర్లకు భారీ నష్టాలు తప్పవని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!