NewsOrbit
Entertainment News Telugu TV Serials

Satyabhama February 8 2024 Episode 39: సత్య ఫ్యామిలీ పై దెబ్బ కొట్టిన కాళీ.. హర్ష నిర్ణయం.. పోలీస్ స్టేషన్లో పంచాయతీ..

Satyabhama Today Episode February 8 2024 Episode 39 Highlights

Satyabhama February 8 2024 Episode 39:  సత్య ఇంట్లో ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు సత్య మాధవ్ వచ్చి ధైర్యం చెప్పి వెళ్లిన తరువాత చాలా సంతోషంగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ పెళ్లి ఎలాగైనా జరుగుతుంది అని మాధవ్ చెప్పిన మాటలకు చాలా సంతోషించి వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ల పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు సత్య నేనే వంట చేస్తానమ్మా నువ్వు వెళ్లి నాన్న గారితో ముచ్చట్లు చెప్పు అని చెప్పి పంపిస్తుంది. సత్య వంటింట్లో వంట చేస్తూ ఉండగా కిటికీలోనుంచి చాలామంది జనాలు వాళ్ళింటి వైపు చూస్తూ ఉండడం గమనిస్తుంది. ఇదేంటి అందరూ పనికట్టుకొని మా ఇంటి ముందు నించుకొని ఏం చూస్తున్నారు అని అనుకొని బయటికి వెళ్లి అసలు విషయం ఏంటో కనుక్కుందాం అనుకుంటుంది. సత్య వంటింట్లో పని అంతా ఆపేసి హాల్లో నుంచి బయటికి వెళ్తూ ఉండగా సత్యనారాయణమ్మ ఎక్కడికి అని అడుగుతుంది ఏం లేదు నానమ్మ బయట బట్టలు ఆరేసాను తీసుకొద్దామని వెళ్తున్నాను అని అంటుంది. ఈ పిల్లల్ని ఒక గంట కనిపెట్టి ఉండాలి రా విశ్వనాథం అని అంటుంది సత్య నానమ్మ. అది ఎక్కడికి వెళుతుంది లేమ్మా అని అంటాడు విశ్వనాథం ఇందులో సత్య గబగబా బయటికి వెళ్లి అందరి జనాలతో పాటు తన ఇంటి గోడల మీద ఉన్న రాతలు చూసి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది సత్య నానమ్మకి అనుమానం వస్తుంది సత్య బట్టలు తీసుకొస్తానని బయటికి వెళ్లి ఇంకా రాలేదేంటని వాకిట్లోకి వెళ్లి చూస్తుంది.

Satyabhama Today Episode February 8 2024 Episode 39 Highlights
Satyabhama Today Episode February 8 2024 Episode 39 Highlights

ఇక సత్యనారాయణమ్మ అందరూ వాక్యం ముందు ఉండడం గమనించి సత్య కూడా బాధపడుతూ ఉండడం చూసి ఏదో జరిగిందనుకొని విశ్వనాథం ఇటురా ఒకసారి బయట చాలా మంది జనాలు వచ్చి మన ఇంటి వైపే చూస్తున్నారు సత్య కూడా ఏదో బాధ వేసి ఉంటారు బొమ్మల రూపంలో సత్య ప్రేమాయణం మొత్తం గోడల మీద దర్శనమిస్తుంది ఇక అంతే ఎంతో పరువుగా బతికే విశ్వనాథంకు ఒకసారిగా ఏమీ అర్థం కాదు నలుగురిలో పరువు పోయినందుకు చాలా బాధపడతాడు. సత్య ఫ్యామిలీ మొత్తం అవన్నీ చూసి బాధపడుతూ ఉంటుంది దూరం నుంచి ఖాళీ చూసి సత్య చూసావు కదా నువ్వు నా చంప మీద దెబ్బ కొడితే నేను బతుకు మీద నేను దెబ్బ కొట్టాను ఇది కదా నాకు కావాల్సింది ఇంకా ముందు ముందు నీకు అన్ని దెబ్బలే ఫేస్ చేయడానికి రెడీగా ఉండు అని మనసులో అనుకుంటూ ఉంటాడు.

Satyabhama Today Episode February 8 2024 Episode 39 Highlights
Satyabhama Today Episode February 8 2024 Episode 39 Highlights

ఇక సత్తి తండ్రి ఆ గోడ మీద ఉన్న సత్య ప్రేమాయణం అని రాసిన మాటల్ని తుడిపేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు అక్కడ వాళ్ళందరూ ఇప్పుడు అనుకొని ఇప్పుడు బాధపడి ఏం లాభం కూతుర్లని స్వేచ్ఛగా వదిలేస్తే ఇలానే ఏంటి ప్రాబ్లమ్స్ ఇంటి మీదకు వస్తాయి అయినా ఎవరితో తిరిగితే తప్పులేదు కానీ ఇలా గోడ మీద రాతలు రాస్తే తప్పొచ్చిందా ఏంటి అని నానా మాటలు మాట్లాడుతూ ఉంటారు. విశ్వనాథం చాలా ఫీల్ అవుతూ ఉంటాడు పరువు పోయిందని బాధపడుతూ ఆ గోడల మీద ఉన్న బొమ్మల్ని తుడపాలని చూస్తూ ఉంటాడు కానీ అవి అంత తుడిపినా కానీ లోపలికి వెళ్లి బకెట్ తో నీళ్లు తీసుకువచ్చి ఆ గోడల మీద పోస్తే తుడుపుతూ ఉంటాడు. అయినా కూడా అవన్నీ చెరిగిపోకుండా అలానే ఉంటాయి. ఎంత తుడిపినా పోవట్లేదు ఏంటి సత్య ఇవి అని అంటాడు నాన్న ఊరుకోండి మీరు ఏడవద్దు లోపలికి వెళ్దాం పదండి అంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకరితో ప్రేమాయణం ఇంకొకరితో పెళ్లి భలే ఉంది వీళ్ళ వ్యవహారం అని మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలకు సర్దికి కోపం వస్తుంది వెంటనే సత్య లేచి అసలు మీరు ఏమనుకుంటున్నారు ఇట్లాగా ఒక ఆడపిల్లకి జరిగితే మీరు ఇలాగ సూటిపాటి మాటలు మాట్లాడతారా మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు లేరా అయినా ఇలాంటి మాటలు మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మాట్లాడాలి అసలు అవతలి వాళ్ళు తప్పు ఉందా లేదా ఆ అమ్మాయి ఎలాంటిదో కాదా అని ఆలోచించకుండా ఇలా మాట్లాడడమేనా అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ బుద్ధి చెబుతుంది సత్య. ఇక వాళ్ళ నాన్నని తీసుకొని లోపలికి వెళ్తుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్లి పోతారు అప్పటికీ సత్య వాళ్ళ నాన్న ఆ గోడల మీద నల్లటి రంగుతో మొత్తం పూసేస్తాడు. అవి ఎవరికి కనిపించకుండా చేశానమ్మ అని అంటాడు ముందు మీరు పదండి నాన్న లోపలికి వెళ్దాము అని సత్య లోపలికి తీసుకెళ్లి విశ్వనాథం కూర్చోబెట్టి మంచినీళ్లు తీసుకొచ్చి ఇస్తుంది మంచినీళ్లు కాదు మన కావాల్సింది ఇంత విషమ్ ఇవ్వు అని అంటాడు.

Satyabhama Today Episode February 8 2024 Episode 39 Highlights
Satyabhama Today Episode February 8 2024 Episode 39 Highlights

ఇక సత్య తండ్రి అంత కోపంగా విషమ్ ఇవ్వు అనేసరికి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు అదేంటి నాన్న అలా అంటావు అని అంటే మరేం చేయమంటావ్ అమ్మ పరువుగా వదిలి బతికిన కుటుంబం మనది నేను పరువు కోసం ప్రాణమిచ్చే వాడిని అలాంటి నా పరువు ఇవాళ నలుగురిలో పడింది ఇక కొన్ని రోజులు లో రోడ్డు మీద కూడా పడుతుంది అని అంటాడు. అదేంటి నాన్న నువ్వే అంత అదే పెడితే ఎలాగు అని అంటుంది సత్య మరి ఏం చేయమంటావ్ అమ్మ అని అంటాడు విశ్వనాథం కోపంగా అక్కడే ఉన్న వాళ్ళ నాన్నమ్మ ఇలాంటివి జరుగుతాయని నేను కూతుర్లకు ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వద్దు అని చెప్పాను నా మాట అప్పుడు వినలేదు ఇప్పుడు చూడు ఏమైందో అని అంటుంది వెంటనే హర్ష అదేంటి నాన్న బయట వాళ్ళు మాట్లాడినట్లుగా నువ్వు కూడా సత్యదే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నావు ఇందులో సతి తప్ప ఏముంది ఆ రౌడీగారి పగబెట్టుకొని మనల్ని సాధించడానికి ఇదంతా చేస్తున్నాడు. ఇప్పుడు నా దగ్గర ఒక ఐడియా ఉంది నేను చెప్పినట్టుగా మీరు వింటేనే మనం ఈ ప్రాబ్లం నుంచి బయట పడతామని అంటాడు హర్ష. ఏంటో చెప్పమని విశ్వనాథం అంటే మనందరం కలిసి వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాము అని అంటాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అవ్వదు అని అంటుంది విశ్వనాథం భార్య కాదు ఇవ్వాల్సిందే అమ్మ చూశావు కదా మనం సైలెంట్ గా ఉంటే వాడు మన మీద రెచ్చిపోయేటట్టు ఇలాంటి ప్రవర్తనలన్నీ చేస్తున్నాడు అదే మనం ఎదురు తిరిగితే ఇలాంటివి ఏమీ జరగవు కదా అని అంటాడు.

Satyabhama Today Episode February 8 2024 Episode 39 Highlights
Satyabhama Today Episode February 8 2024 Episode 39 Highlights

ఇక అందరూ హర్ష చెప్పిందానికి సరే అని పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటారు హర్ష మాత్రం మనం ఒక పులిని వేటాడాలంటే చేతిలో కర్ర కాదు ఉండాల్సింది కత్తి అంటే మనం ఇచ్చే కంప్లైంట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అందుకనే వాడు మన అమ్మాయి వెంటపడుతున్నాడని ఫిజికల్ గా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడని కంప్లైంట్ ఇద్దామని అంటాడు అలా ఎలా అబద్ధం చెప్తామని అంటుంది సత్య చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పాల్సిందే అని హర్ష బలవంతం చేసి వాళ్ళ చేత పోలీస్ కంప్లైంట్ ఇప్పించాలనుకుంటాడు. ఇక అప్పుడే శేఖర్ ఫోన్ చేస్తాడు విశ్వనాథం ఫోన్ లిఫ్ట్ చేసి ఇక్కడ జరిగిందంతా తెలిసిందేమోనని భయపడుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. కానీ శేఖర్ వాళ్లకు జరిగిన ఘోరాన్ని గురించి చెప్తాడు మేమిద్దరం కారులో వెళ్తూ ఉంటే ఆ రౌడీ గాడు మా వెంటపడి మాకు బెదిరించాడు. ఈ పెంచితే అర్థం చేసుకున్నారు కదా ఇక పెళ్లి దాకా వెళ్లారంటే మాత్రం బాగోదు ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుని అమెరికా వెళ్లిపోండి అని మాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి వెళ్లిపోయాడు అంతే కాదు సత్య నాది అని మా ముందే చెప్పి వెళ్ళిపోయాడు అని శేఖర్ జరిగింది అంతా చెప్తాడు దానికి విశ్వనాథం ఇంకా బాధపడతాడు. ఇక హర్ష అందుకే నాన్న నేను చెప్పేది ఇప్పుడు మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇవన్నీ ఆపుతాడు అని అంటాడు దాంతో అందరు సరే అంటారు.

Satyabhama Today Episode February 8 2024 Episode 39 Highlights
Satyabhama Today Episode February 8 2024 Episode 39 Highlights

రేపటి ఎపిసోడ్లో సత్య ఇంటికి పోలీసులు వచ్చి ఇక్కడ హర్ష ఎవరు అని అడిగితే హర్ష నేనే అని ముందుకు వస్తాడు మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. మీరు కృష్ణ కత్తితో పొడిచి చంపాలి అనుకున్నారు మర్డర్ అటెండ్ చేయబోయారు అందుకనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి తీసుకువెళ్తారు పోలీస్ స్టేషన్కు వెళ్లేసరికి హర్ష అక్కడ క్రిష్ ని ఉంటాడు. ఏంట్రా నా మీదే ఫేక్ కంప్లైంట్ ఇద్దామనుకున్నావా నేను ఫేక్ కంప్లైంట్ ఇస్తే ఎలా ఉంటుందో చూసావు కదా అని అంటాడు ఇక పక్కనే ఉన్న విశ్వనాథంతో నాన్న మీరు కూడా విడి మీద కంప్లైంట్ ఇవ్వండి నాన్న ఏది జరిగితే అదే జరుగుతుంది అని అంటాడు హర్ష వెంటనే క్రిష్ హర్షిని కొట్టడానికి వెళ్తాడు బాబు గొడవలు వద్దు అని విశ్వనాథం ఆపుతాడు.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N