HBD Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు రేపే కావడంతో అభిమానులు భారీ ఎత్తున వేడుకలు చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. అదే రోజు “బిల్లా” 4K టెక్నాలజీతో విడుదల కానుంది. దివంగత కృష్ణంరాజు.. ప్రభాస్ నటించిన సినిమా కావటంతో “బిల్లా” మూవీ లేటెస్ట్ టెక్నాలజీతో స్పెషల్ షోలు వేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ కెరియర్ లో హై బడ్జెట్ మూవీ వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
వైజయంతి మూవీస్ బ్యానర్ లో 50వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని దర్శకుడు నాగ వంశీ తెరకెక్కిస్తున్నారు. “ప్రాజెక్టు కే” వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్, దీపికా పదుకొనే ఈ సినిమాలో నటిస్తున్నారు. హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హై టెక్నాలజీ కెమెరాలతో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్ బర్తడే నాడు సర్ప్రైజ్ అప్ డేట్ రాబోతున్నట్లు దర్శకుడు నాగవంశీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
ప్రభాస్ జన్మదినం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ఓ అభిమాని అప్ డేట్ గురించి ఏలాంటి ప్రకటన రాకపోవడంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ నీ ట్యాగ్ చేయడం జరిగింది. దీనికి స్పందించిన నాగ్ అశ్విన్… రేపు సర్ప్రైజ్ గిఫ్ట్ “ప్రాజెక్టు కే” నుండి రాబోతున్నట్లు రిప్లై ఇచ్చాడు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ప్రభాస్ ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల కంటే ఈ సినిమా హై బడ్జెట్. మరి సినిమాకి సంబంధించి ప్రభాస్ ఫోటో, టైటిల్ ఇంకా వీడియో ఏది రిలీజ్ అవుతుందే అని ఆసక్తిగా గమనిస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!