Tillu Square Twitter Review: 2024 లో యూత్ ఆడియన్స్ ఎంతగానో క్యూరియాసిటీగా ఎదురుచూసే సినిమాలలో టిల్లు స్క్వేర్ ఒకటి. సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని మల్లిక్ రామ్ తెరకెక్కించాడు. ఇక దీని మొదటి భాగం 2022లో రిలీజ్ అయ్యి పెద్ద సంచలనమే సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో సిద్దు చెప్పిన ఒక్కో డైలాగ్ ప్రేక్షకుల్లోకి వేరే లెవెల్ లో వెళ్లాయి. ఈయన డైలాగ్ ని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారు వరకు కామన్ గా వాడుతూ ఉంటారు. అంతలాగా ప్రేక్షకు ఆదరణ పొందింది మరి. ఇక తాజాగా ఈ మూవీ యొక్క సీక్వెల్ కూడా రిలీజ్ అయింది. టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ మూవీని నేడు రిలీజ్ చేసింది.
ఇక తన ట్రెండ్ మార్క్ కామెడీ తో సిద్దు టిల్లు స్క్వేర్ లోను ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నట్లు నెటిజన్స్ ట్విట్టర్ వేదికగా ట్విట్స్ చేస్తున్నారు. డీజే టిల్లు గా సిద్దు బాడీ లాంగ్వేజ్ మరియు పంచ్ డైలాగ్స్ వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సిద్ధూ వన్ మెన్ షో ద టిల్లు స్క్వేర్ మూవీ నిలుస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదేవిధంగా సిద్దు డీజే టిల్లు తెలుగులోని మ్యాజిక్ చాలా వరకు రిపీట్ అయిందని ట్వీట్స్ చేస్తున్నారు. ఫుల్ ఫన్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ను పంచే మూవీ గా దీనిని చెప్పుకోవచ్చని చెబుతున్నారు. టిల్లు పక్క బాక్స్ ఆఫీస్ విన్నర్ అని కామెంట్స్ చేస్తున్నారు కూడా. ఫస్టాఫ్ మొత్తం సిద్దు తన కామెడీతో కడుపుబ్బ నవ్వించినట్లు తెలుస్తుంది.
అదేవిధంగా ఇంటర్వెల్ ట్విస్ట్ ఈ మూవీ కో హైలెట్గా ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ ట్విస్ట్ తోనే డైరెక్టర్ సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరో నెటిజన్..” సెకండాఫ్ మొత్తం యావరేజ్ గా ఉంది. కామెడీ తో మాత్రమే సాగింది. కథపై దృష్టి పెట్టకుండా కామెడీతో సినిమాని రూపొందించేశారు. ఈ మూవీలో కొన్ని ట్విస్టులు బాగానే ఉన్నప్పటికీ మరికొన్ని మాత్రం ఎక్కువైనట్లు అనిపించింది. టోటల్గా చెప్పాలంటే డిజె టిల్లు లాగానే అనిపించింది. కొద్దిగా టిల్లు స్క్వేర్ కనుక మార్పులు చేర్పులు చేసి ఉంటే బాగుండు.
హీరోయిన్ ని మార్చారు కానీ మిగతా అంతా సేమ్ టు సేమ్ లాగానే అనిపిస్తుంది. సో ఇక మీదట ఇలాంటి సినిమాలను సీక్వెల్ తీసేటప్పుడు కొంచెం జాగ్రత్త పడండి ” అంటూ ఓ నెటిజన్ ట్వీట్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఇక ఈ సినిమాలో అనుపమ క్యారెక్టర్ విషయానికి వస్తే..లిల్లీ క్యారెక్టర్ లో అనుపమ యాక్టింగ్ అదరగొట్టిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎక్స్పోజింగ్ కి స్టైల్ కి సరిపోయిందని చెబుతున్నారు. ఇక సిద్దు మరియు అనుపమ కెమిస్ట్రీ ఈ సినిమాకు టోటల్గా హిట్ అయిందని పేర్కొంటున్నారు. అదేవిధంగా ఈ మూవీలో డీజెటిలు హీరోయిన్ నేహా శెట్టి గెస్ట్రోలో కనిపించి ఆకట్టుకుంటుందని ట్వీట్స్ చేస్తున్నారు. ఇక టోటల్ గా అయితే పర్లేదు అనిపించుకుంది ఈ మూవీ. టిల్లు స్క్వేర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 60 నుంచి 65 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం ఖాయం అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
Hero timing and jokes pelayi anthe aa story, screenplay endo emo #TilluSquare 2.5/5
— Hibernator (@TheMSDhon7) March 29, 2024
#TilluSquare Decent 1st Half!
Siddhu is back again with his trademark energetic avatar and one liners that are carrying the film. Comedy works in parts so far but feels redundant at times . Fun interval twist sets up the 2nd half well.
— Venky Reviews (@venkyreviews) March 29, 2024
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!