NewsOrbit
Entertainment News Telugu TV Serials

Trinayani February 5 2024 Episode 1155: చూపులమ్మని తీసుకువచ్చి ఇంట్లో పెట్టిన త్రిలోత్తమా, అమ్మ జడ తెలుస్తుందాని టెన్షన్ పడుతున్న విశాల్..

Trinayani Today Episode February 5 2024 Episode 1155 Highlights

Trinayani February 5 2024 Episode 1155:  ఏమి తీసుకెళ్లడానికి నీ గదిలోకి రాలేదు లాప్టాప్ తీసుకు వెళుతున్నాను అని విక్రాంత్ అంటాడు. నా గదిలో ఏముంది తీసుకెళ్లడానికి కానీ స్టోర్ రూమ్ లో ఉన్న చీరని త్రిలోత్తమ అత్తయ్యకి ఇచ్చారు ఎలా అని సుమన అడుగుతుంది. నైని వదిన లాగా భవిష్యత్తు చెప్పలేను అని విక్రాంత్ అంటాడు. కానీ నేను మన భవిష్యత్తు గురించి చెప్పగలను అని సుమన అంటుంది. నీ గురించి నీకే సరిగ్గా తెలియదు మన గురించి అని నన్ను కలపకు అని విక్రాత్ అంటాడు. మీ అమ్మ చీర అడగగానే ఇచ్చేశారు ఎవరు ఏమి అడిగినా విశాల్ బావగారు చేస్తారు ఎంతో విలువైన వాళ్ళ అమ్మ చీర అడ్డంగా గానే ఇచ్చేసాడు అంటే వాళ్ళ అమ్మ స్థాపించిన 16 కంపెనీలలో ఏదో ఒక కంపెనీని అడుగు  అని సుమన అంటుంది. నువ్వు అడగమనేది కప్పు కాఫీ కాదు ఒక కంపెనీని నేను అడిగితే ఎలా ఇస్తారు నాకు నవ్వొస్తుంది అని విక్రాంత్ అంటాడు. నేను పది సార్లు అడిగానా సరే మిమ్మల్ని కంపెనీకి ఓనర్ ని చేయకపోతే నా పేరు మార్చుకుంటాను అని సుమన అంటుంది. నిన్నే హ్యాండిల్ చేయలేను కానీ కంపెనీని ఎలా హ్యాండిల్ చేయగలను చెప్పు నువ్వు మారితే అప్పుడు ఆలోచిద్దాం అని విక్రాంత్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Trinayani Today Episode February 5 2024 Episode 1155 Highlights
Trinayani Today Episode February 5 2024 Episode 1155 Highlights

హాల్లోకి రాకుండా గదిలో ఏం చేస్తున్నారు అని నైని అంటుంది. అత్తయ్య వాళ్ళు ఇంట్లో లేరు అని సుమన అంటుంది. గాయత్రి అమ్మ గారి చీర తీసుకున్నాక వాళ్ళు ఇంట్లో ఎందుకుంటారు అమ్మ అని ఎద్దులయ్య అంటాడు. ఇంతలో విశాల్ ఇంటికి వచ్చి వాళ్ళ ప్లాన్ ని ఎలా తిప్పి కొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో తిలోత్తమ వాళ్ళు కూడా ఇంటికి వస్తారు. బాగా చూడవమ్మ చూపులమ్మ గాయత్రి అక్క దాన సంస్కారాలు జరిగింది ఇక్కడే అని కలశం పట్టుకుని అంటుంది తిలోత్తమ అంటుంది. అమ్మ చూపులమ్మని ఎవరైనా చూస్తే ఏం చెప్పాలి అని వల్ల అంటాడు. ఎవరికి డౌటు రాకుండా మాట్లాడు చాలు అని తిలోత్తమ అంటుంది. గాయత్రి చీరను తీసుకొని తిలోత్తమ వల్లభ లోపలికి వెళ్తారు. నన్ను కన్న తల్లిని కాపాడుకోవడానికి వీళ్ళతో యుద్ధమే చేయాలి అని విశాల్ అనుకుంటూ లోపలికి వెళ్తాడు. కట్ చేస్తే, పెద్దమ్మ ఎప్పుడో కట్టింది  ఆ చీరని తీసుకుని అమ్మ వాళ్ళు ఎందుకు బయటకు వెళ్లారు అని విక్రాంత్ అంటాడు.

Trinayani Today Episode February 5 2024 Episode 1155 Highlights
Trinayani Today Episode February 5 2024 Episode 1155 Highlights

ఇంతలో తిలోత్తమ వల్లభ చూపులమ్మని తీసుకుని ఇంట్లోకి వస్తారు. చేతిలో కలశం దాని మీద ఉన్నది అమ్మవారు అనుకుంటా అని విక్రాంత్ అంటాడు. ఎవరికి వారు అనుకోవాల్సిందే విక్రాంత్ బాబు ఎందుకంటే ఇ తల్లిని నేనెప్పుడూ చూడలేదు అని నైని అంటుంది. విశాల్ రా మీ పెంచిన అమ్మ ఏం తెచ్చిందో అని హాసిని అంటుంది. ఏం చేస్తున్నావ్ అమ్మ అని విశాల్ అడుగుతాడు. గాయత్రి అక్క చీర కట్టుకోవడానికి ఏమైనా కట్టుబాట్లు ఉన్నాయేమో గురువుగారిని అడుగుదామని వెళ్ళాము నాన్న అని తిలోత్తమ అంటుంది. ఏ స్వామి నమ్మ అని విశాల్ అంటాడు. అఖండ స్వామిని కలిసి వచ్చాం బ్రో అని వల్లభ అంటాడు. మన గురువుగారిని కలిసి వస్తే బాగుండేది బ్రో అని విక్రాంత్ అంటాడు. గురువు దగ్గర పరువు పోతుందని దారి మల్లారు అని ఎద్దులయ్య అంటాడు. అటు వెళ్లి కలశాన్ని పట్టుకొచ్చారా అని హాసిని అంటుంది. కలశం కాదు చూపులమ్మ తల్లి అని తిలోత్తమ అంటుంది. నేను అమ్మ వార్ల పేర్లన్నీ చెప్పగలను కానీ ఎక్కడా చూపులమ్మ పేర్లు నాకు తెలియదే అని నైని అంటుంది. మేము పెట్టాము అని వల్లభ అంటాడు. నీ కొడుకు పేరు పెట్టడం రాదు ఇక అమ్మవారికి పేరు పెట్టారా మీరు అని హాసిని అంటుంది. ఒకరోజు అమ్మవారిని ఇంట్లో గురువుగారు ఉంచమన్నారు అని తిలోత్తమ అంటుంది. పెట్టి ఏం చేస్తావ్ అని విశాల్ అంటాడు.

Trinayani Today Episode February 5 2024 Episode 1155 Highlights
Trinayani Today Episode February 5 2024 Episode 1155 Highlights

గాయత్రి అమ్మ జాడ తెలుసుకోవడానికి చూపులమ్మని తీసుకువచ్చారు మాత అని ఎద్దులయ్య అంటాడు. అంటే గాయత్రి అత్త జాడ తెలుసుకోవడానికి తీసుకువచ్చారా అని సుమన అంటుంది. ఎద్దులయ్య మాట పట్టుకుంటే బాగోదు చూపులమ్మ ని గాయత్రి అక్క ఫోటోకి ఎదురుగా పెట్టి చీర కట్టుకొని పూజ చేస్తే అంత మంచే జరుగుతుందంట అని తిలోత్తమ అంటుంది. అమ్మ నువ్వు చీర కట్టుకొని సంతోషంగా ఉండి అమ్మ కోరిక తీర్చానని అనుకోకుండా ఈ అమ్మవారిని తీసుకువచ్చి పూజలు ఎందుకు చేస్తున్నావ్ అని విశాల్ అంటాడు. మీ అమ్మ కట్టుకున్న చీరను కట్టుకొని చూపులమ్మ దగ్గర దీపం వెలిగిస్తే చాలు సుమన నువ్వు వెళ్లి ముగ్గు పెట్టు నేను దీపం వెలిగిస్తాను అని తిలోత్తమ అంటుంది. అలాగే అత్తయ్య అని సుమన ముగ్గు వేస్తుంది. బయటికి వెళ్లిన వాళ్లకి భక్తి కలగడం ఆశ్చర్యమే అని హాసిని అంటుంది. పూజ అయిపోయిన తర్వాత ఇల్లును సుఖసంతోషాలతో ఉండమని దీవించి వెళ్తే చాలు అని దురంధర అంటూది. ముగ్గు వేశారు అత్తయ్య చూపులమ్మ ని అక్కడ పెట్టి చీర కట్టుకొని రండి అని హాసిని అంటుంది.తిలోత్తమ వెళ్లి కలశం గాయత్రీ దేవి కి ఎదురుగా పెడుతుంది. అందరూ సాయంత్రం దీపారాధనకి రండి అని వల్లభ అంటాడు కట్ చేస్తే, గాయత్రి ఎక్కడ ఉంది నైని అని విశాల్ అంటాడు. హాసిని అక్క దగ్గర ఉంది తీసుకు రమ్మంటారా ఈమధ్య మీరు గానవి కన్నా గాయత్రి పాప గురించి ఆలోచిస్తున్నారు ఎందుకు అని నైని అంటుంది.

Trinayani Today Episode February 5 2024 Episode 1155 Highlights
Trinayani Today Episode February 5 2024 Episode 1155 Highlights

పక్షపాతం ఏమీ లేదు నైని అని విశాల్ అంటాడు. ఉన్న నేను ఏమీ అనుకోను దత్తత తీసుకున్న పాపను చాలా బాగా చూసుకున్నారని అందరూ అనుకుంటారు అని నైని అంటుంది. పిల్లలు క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉండాలని నా కోరిక అని విశాల్ అంటాడు. మీ కన్నతల్లిని పట్టుకోడానికి అమ్మవారిని తీసుకువచ్చారు కదా అని నైని అంటుంది. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అని విశాల్ అంటాడు. చూపులమ్మ అంటే రెండు అర్థాలు ఉన్నాయి బాబు గారు ఒకటి చూపిస్తుంది ఒకటి తెలిసేలా చేస్తుంది ఏం చూపిస్తుందో తెలియదు అని నైని అంటుంది. ఏం చేయబోతున్నారో నీకేమైనా ఐడియా ఉందా నైని అని విశాల్ అంటాడు. మంచి పని చేయాలనుకున్న వాళ్ళకి సమయం సరిపోదు కానీ చెడ్డ పని చేసే వాళ్ళకి సమయం సరిపోదు ఏం చేయాలనుకుంటున్నారో మీకు తెలుసేమో అని అడిగాను అని నైని అంటుంది.

Trinayani Today Episode February 5 2024 Episode 1155 Highlights
Trinayani Today Episode February 5 2024 Episode 1155 Highlights

అంటే ఏం చేస్తారు అంటావ్ అని విశాల్ అంటాడు. నాకు తెలియదు బాబు గారు నాకు పనులు ఉన్నాయి అంటూనై నైని వెళ్ళిపోతుంది. ఏం చేయబోతున్నారు అని విశాల్ టెన్షన్ పడుతూ ఉంటాడు. కట్ చేస్తే, సుమన చీర కట్టుకొని రెడీ అవుతుంది ఇంతలో విక్రాత్ వచ్చి చూస్తూ ఉంటాడు. చీరలో అంత అందంగా ఉన్నానా బుల్లి బాబు గారు అలా చూస్తున్నారు అని సుమన అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N