Trinayani November 17 2023 Episode 1087: బొచ్చ కాదే పిచ్చిదానా దీపపు ప్రమిద అందులో నూనె వేసుకుని తామర వత్తులు వేసుకొని వచ్చాను అని తిలోత్తమ అంటుంది. అర్థమైంది అక్క అది అఖండ దీపం కాద అని పావని మూర్తి అంటాడు. దీప అంటే దీపం వలి అంటే వరుస దీపాలని వరుసగా పెట్టడాన్ని దీపావళి అంటారు అని తిలోత్తమ అంటుంది. చాలా బాగా చెప్పావు అమ్మ అని విక్రాంత్ అంటాడు. ఈ ఘనత నాది కాదురా ఇందాక అడిగితే నైని చెప్పింది అని తిలోత్తమ అంటుంది. అవునా లేకపోతే పురాణాల మీద నీకింత పట్టు ఎక్కడిదా అని ఆలోచిస్తున్నాను అని హాసిని అంటుంది. అయితే ఆ దీపాన్ని ఎక్కడ పెడదాం అనుకుంటున్నావు అత్తయ్య అని నైని అడుగుతుంది.

ఓంకారాన్ని పెట్టావు కదా అమ్మ అక్కడ చంద్ర రేఖ లాగా ఉండే దగ్గర పెడతాను ఆని తిలోత్తమ అంటుంది. ఏకైక అక్షరం ఓంకారం అక్షరాన్ని పటించిన అన్ని శుభాలే జరుగుతాయి అని నైని అంటుంది. అమ్మ దీపాలు పెడతారు సరే నైని వెలిగించకుండా దీపాలు వెలిగితే అమ్మవారి భక్తురాలు అనుకుందాము అని వల్లభ అంటాడు. ఏంటి బ్రో పరీక్షిస్తున్నారా అని విక్రాంత్ అంటాడు. కాదు తమ్ముడు పెద్ద మరదలు మహిమగలది శక్తులు ఉన్నాయి అని అంటుంది కదా ఆవిడ శక్తి ఎంతో భక్తి ఎంతో అమ్మవారు మెచ్చి దీపాలు వెలిగించాలి అని వల్లభ అంటాడు. అంటే మీరంటున్నది ఏంటి ఎవరైనా వచ్చి వెలిగిస్తే సరిపోతుందా అని హాసిని అంటుంది. అత్తయ్య అన్నదానికి అర్థం అది కాదు అక్క భక్తిని మెచ్చి లక్ష్మీదేవి వరం ఇచ్చి దీపాలు వెలిగించాలి అని అంటుంది అని సుమన అంటుంది. ఎవరో వస్తే వాళ్లు మనతో ఉంటారు కదా అప్పుడు మనం ఎలా వెలిగిస్తాము అని తిలోత్తమ అంటుంది.

ఎవరైనా అంటే ఎవరు వస్తారు డమ్మక్క భయపెట్టకు అని పావని మూర్తి అంటాడు. మనుషులు కాకుండా ఇంకెవరు వచ్చి వెలిగిస్తారు దీపాలని అని సుమన అంటుంది. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే సరిపోతుంది దీపాలు వెలిగించాలి అని నైని అంటుంది. అలాగే నైని లక్ష్మీదేవి దగ్గర దీపం పెట్టుకుని ఈ దీపాలన్నీ నువ్వు వెలిగించకుండానే వెలగాలి అని తిలోత్తమ అంటుంది. ఏంటమ్మా జోక్ చేస్తున్నావా దేనికైనా ఓ సమయం సందర్భం ఉండాలి వెలిగించకుండా ఎలా వెలుగుతాయి అని విక్రాంత్ అంటాడు. నైని అమ్మవారి దగ్గర దీపం వెలిగించి ఒక కాకరపుళ్లను కూడా వెలిగించి చేతిలో పట్టుకో అని డమ్మక అంటుంది. కాకర పుల్ల నువ్వు వెలిగించి పట్టుకుంటే వాటి అంతట అవే వెలుగుతాయా అని సుమన అంటుంది. కాదు నాగులయ్య వచ్చి వెలిగిస్తాడు చూడు అని డమ్మక్క అంటుంది.ఇంతలో నాగయ్య అక్కడికి వస్తాడు. ఏం చేయాలో అర్థం కానప్పుడు నువ్వు ఎప్పటికప్పుడు వచ్చి సహాయం చేస్తూనే ఉంటావు నాగయ్య అని నైని కాకరపుళ్లను వెలిగించి నాగయ్య నోట్లో పెడుతుంది. నాగయ్య దీపాలన్నీ వెలిగిస్తాడు.

అది చూసి అందరూ షాక్ అయిపోతారు. అల్లుడు ఈ అద్భుతాన్ని కింది నుంచి కాకుండా పైనుంచి చూడాలి నన్ను ఎత్తుకోవా అని పావన మూర్తి అంటాడు. గాయత్రి పాపని సుమనకి ఇచ్చి విశాల్ వచ్చి పావని మూర్తిని ఎత్తుకుంటాడు. చాలు అల్లుడు ఈ జన్మకి లండన్ నుంచి ఇక్కడికి వచ్చినందుకు బ్రతికి ఉండగానే భగవంతుని దర్శనం ఇప్పిస్తున్నారు అని పావని మూర్తి సంతోషంతో అంటాడు. నైని ఆనందానికి అవధులు లేవు. ఇదేంటమ్మా నాగయ్య అన్ని దీపాలను వెలిగించాడు కానీ అక్కయ్య తెచ్చిన తామర వత్తిని వెలిగించలేదు అని పావని మూర్తి అంటాడు. భయపడ్డాడేమో చిన్న చిన్న దీపాలునైతే వెలిగించాడు కానీ పెద్ద దీపాన్ని వెలిగిస్తే మూతి కాలుతుందని భయపడ్డాడేమో అని సుమన అంటుంది.లేదు నాగయ్య ఆగిపోయాడు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అని నైని అంటుంది.

అత్తయ్య నిజం చెప్పండి అందులో ఏం పోసి తెచ్చారు ప్రమిద తెచ్చింది మీరే కదా అని హాసిని అంటుంది. కావాలంటే వాసన చూసుకోండి నువ్వుల నూనె పోసాను అని తిలోత్తమ అంటుంది. మమ్మీ వీళ్ళతో మాటలు ఎందుకు నువ్వే వెలిగించు అని వల్లభ అంటాడు. వద్దు అత్తయ్య నువ్వు కాదు సుమన వెలిగిస్తుంది అని నైని అంటుంది. నైని ఆలా అనగానే సుమన షాక్ అవుతుంది. ఏంటి మా అక్క కనిపెట్టేసిందా అత్తయ్య ప్రమిదలో నువ్వుల నూనె పోసింది తీసివేసి నేను వేరే నూనె పోసానని అక్క కనిపెట్టిందా అని సుమన మనసులో అనుకుంటుంది. చిట్టి రా వెలిగించు అని హాసిని అంటుంది. రామ్మా వెలిగించు పూజ పరిపూర్ణమైపోతుంది అని పావని మూర్తి అంటాడు. నేను వెలిగించాను అని సుమన అంటుంది. అయితే నేనే వెలిగిస్తాను అని హాసిని వెలిగించబోతుండగా, నాగయ్య దీపపు ప్రమిదను సుమన మొహం మీద విసిరేస్తాడు. అఖండ దీపం వెలిగించకుండా చేసింది పాముకి అంత చనువు ఇస్తే ఇలాగే చేస్తుంది అని తిలోత్తమ అంటుంది. ముందు మా అక్కని అనాలి అని సుమన అంటుంది.

కోపంతో నైని సుమన చంప మీద ఒక్కటి ఇచ్చి జుట్టు పట్టుకొని నన్ను ఏదో చేయాలనుకున్నావు, అత్తయ్య దీపం వెలిగిద్దామని ముందుకు వస్తుంటే ప్రమాదం జరిగినట్టు నాకు కనిపించింది, అందుకే నిన్ను వెలిగించమన్నాను అప్పుడు నీ మొహం లో భయం కనబడింది చెప్పు ఏం చేయాలనుకున్నావు అని నైని అంటుంది. అక్క చెల్లెలు ఏం మాట్లాడుకుంటున్నారు అమ్మ వినిపించట్లేదు అని పావని మూర్తి అంటాడు. నైని ఏమైనా ప్రాబ్లమా అని విశాల్ అంటాడు. ఏమీ లేదు బాబు గారు అని నైని అంటుంది.వదులు అని సుమన కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఏదో ఉంది అని వల్లభ అంటాడు. భోజనాలు ఉన్నాయి రండి తిందాం అని హాసిని అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది