Unstoppable 2: ఆహా ఓటిటిలో “అన్ స్టాపబుల్” టాకీ షో దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే. ఓటిటి రంగంలో దేశంలోనే కాదు గ్లోబల్ పరంగా అత్యధిక వ్యూస్ తో స్ట్రీమింగ్ అవుతూ అనేక రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంది. అక్టోబర్ 4వ తారీఖు నుండి సెకండ్ సీజన్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. సెకండ్ సీజన్ మొదటి ఎపిసోడ్ కి హోస్ట్ బాలకృష్ణ బావ టీడీపీ అధినేత చంద్రబాబు మొదటి గెస్ట్ గా రావడం జరిగింది. ఈ షో మధ్యలో నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. చంద్రబాబు బాలకృష్ణ “అన్ స్టాపబుల్” షో రాజకీయంగా.. సంచలనం రేపింది. ఈ షోలో చంద్రబాబు చాలా నవ్వుతూ అనేక విషయాలకు సమాధానాలు ఇచ్చారు.
పొలిటికల్ గా కొన్ని కాంట్రవర్సీ ప్రశ్నలు కూడా చంద్రబాబుని.. బాలకృష్ణ అడగటం వాటికి ఆయన సమాధానం చెప్పడంతో.. మొదటి ఎపిసోడ్ అనేక రికార్డులు క్రియేట్ చేసింది. ఇటువంటి తరుణంలో ఈసారి లేటెస్ట్ వర్షన్ తో… మొదటి ఎపిసోడ్ ఫుల్ అన్ కట్ వర్షన్ మొత్తాన్ని అక్టోబర్ 28వ తారీఖున రిలీజ్ చేశారు…షో నిర్వాహకులు. దీనిలో మరిన్ని సీక్రెట్స్ ఉండనున్నట్లు ఆహా టీం ప్రకటించింది. అంతేకాదు త్వరలో మూడో ఎపిసోడ్ కూడా రానున్నట్లు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈ అన్ కట్ వెర్షన్ కి సంబంధించి ఆహా టీం ప్రోమో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రోమోలో బాలయ్య బావ ప్రాంక్ ఎప్పుడైనా చేసావా అని అడుగగా అటువంటిదేమీ చేయలేదని చంద్రబాబు సమాధానమిచ్చారు.
దీనికి బాలయ్య.. నేను కాలేజీ టైములో ఇంటర్నల్ ఎగ్జామ్ కి సరిగ్గా ప్రిపేర్ కాలేదు. ఎగ్జామ్ రోజే నా ఫ్రెండ్ శివైక్యం అయ్యాడని బోర్డు మీద రాస్తే మొత్తం కాలేజీ సంతాప సభ పెట్టేసింది.. అని బాలకృష్ణ చెప్పగానే వెంటనే చంద్రబాబు అందుకే నిన్ను అల్లరి కృష్ణ అంటారు అంటూ బాబు తనదైన శైలిలో సెటైర్ వేశాడు. ఏది ఏమైనా ఈ అన్ కట్ వర్షన్ రిలీజ్ చేయటంతో మరోసారి చంద్రబాబు బాలకృష్ణ ఎపిసోడ్ చూడటానికి వీక్షకులు ఎంతగానో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!