The Raja Saab: సంక్రాంతి పండుగ సందర్భంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. మారుతీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాకి “ది రాజాసాబ్” అనే టైటిల్ పెట్టడం జరిగింది. ప్రభాస్ లుంగీ ధరించుకున్న లుక్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి.. “ఇది నాకు ప్రత్యేకమైన సంక్రాంతి. అధికారికంగా “ది రాజాసాబ్”నీ మీకందరికీ తెలియజేస్తున్నాం. ఇదే సమయంలో మీ అందరి ఆశీర్వాదాలు కూడా కోరుతున్నాం. చాలా రోజుల నుంచి, ఎప్పుడు ఎప్పుడు అని వెయిటింగ్. చివరిగా ఈరోజు అన్నిటికీ కుదిరింది. డార్లింగ్ ని ఎలా చూడాలి అనుకున్నారో అలా చూడబోతున్నారు.. ఇది నా ప్రామిస్” అని ట్విట్టర్ లో తెలియజేశారు.
2023 చివరిలో ప్రభాస్ సలార్ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కటం జరిగింది. అంతకుముందు దాదాపు అయిదు సంవత్సరాలు ఒక్క విజయం లేదు. “బాహుబలి 2” వంటి భారీ బ్లాక్ బస్టర్ తీసిన గాని ఆ తర్వాత ఆ స్థాయిలో ఎలాంటి విజయం దక్కలేదు. “బాహుబలి” తర్వాత చేసిన మూడు సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అలాంటి సమయంలో “KGF” సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ “సలార్” చేసి అద్భుతమైన భారీ హిట్టు అందుకోవటం జరిగింది. నెక్స్ట్ “సలార్” రెండో భాగం కూడా రాబోతుంది. ఈ ఏడాదిలోనే “సలార్ 2” షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో “కల్కి 2898 AD” సినిమాలతో పాటు మారుతి దర్శకత్వంలో “ది రాజసాబ్” సినిమా చేస్తున్నారు. మారుతి “ది రాజాసాబ్” సినిమాకి తమన్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, భాషల్లో విడుదల కాబోతోంది. ప్రభాస్ కెరియర్ లో ఇప్పటివరకు టచ్ చేయని జోనర్ హర్రర్ ఎంటర్టైన్మెంట్ తరహాలో “ది రాజాసాబ్” ఉంటుందని సమాచారం.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!