Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “సలార్” సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. డిసెంబర్ 22వ తారీకు విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడు రోజులలో ₹400 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. కచ్చితంగా ₹1000 కోట్ల జాబితాలో “సలార్” స్థానం దక్కించుకుంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన మూడు పాన్ ఇండియా సినిమాలు నిరాశపరచడంతో ఈ సినిమాపై అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. “KGF” దర్శకుడు ఈ సినిమా చేయటంతో ఖచ్చితంగా ప్రభాస్ విజయం సాధించాలని మళ్లీ హిట్టు ట్రాక్ ఎక్కాలని కోరుకున్నారు.
అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా ఫలితం ఉండటంతో అభిమానులు పొంగిపోతున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. “సలార్” కి వచ్చిన టాక్ తో 2023 ఏడాదిలోనే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రావటం జరిగింది. ఈ ఏడాది విడుదలైన అన్ని సినిమాల్లో కంటే ఎక్కువ ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా “సలార్” నిలిచింది. బడ్జెట్ పరంగా ఇంకా తారాగణం పరంగా… ఫైట్స్ పరంగా ఈ సినిమా అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. యాక్షన్ డ్రామా తరహాలో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ బాడీ చాలా అద్భుతంగా ఉంది. ఇంటర్వెల్ లో వచ్చే సన్నివేశాలు హీరో ఎలివేషన్స్ సినిమాకి చాలా హైలెట్ గా నిలిచాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో “వినరా” సాంగ్ మేకర్స్ తాజాగా విడుదల చేశారు. తెలుగు సహా ఐదు భాషలలో విడుదలయ్యింది. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొదటి పార్ట్ భారీ హిట్ కావటంతో ఇప్పుడు సెకండ్ పార్టీ మీద అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవల ప్రభాస్ మొదటి భాగం కంటే రెండో భాగం చాలా బాగుంటుందని కూడా కామెంట్లు చేయడం జరిగింది. “సలార్” వాస్తవానికి సెప్టెంబర్ నెలలో విడుదల కావాల్సింది. కానీ ఆ సమయంలో సినిమా గ్రాఫిక్స్ వరకు కంప్లీట్ కాకపోవడంతో డిసెంబర్ నెలలో విడుదల చేయాల్సి వచ్చింది. సరిగ్గా “సలార్” విడుదలకి ఒక రోజు ముందు షారుక్ “డంకీ” విడుదల కాగా..”సలార్” యే పోటీలో గెలిచింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!