NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TS Politics: తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు సన్నద్దమవుతున్న ప్రధాన పార్టీలు.. ఆ నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్

TS Politics: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అవ్వడంతో ప్రధాన రాజకీయ పక్షాలు లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించాయి. లోక్ సభ ఎన్నికలు ముందుగానే వస్తాయని వార్తలు వెలువడుతుండటంతో పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 17 పార్లమెంట్ స్థానాలకు గానూ 12 స్థానాలకు దాదాపు అభ్యర్ధులను ఖరారు చేసినట్లు తెలుస్తొంది. ఇక బీజేపీ యంత్రాంగాన్ని సన్నద్దం చేస్తొంది. ఈ క్రమంలో భాగంగా 28వ తేదీన పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ కు వస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బలం పెరగడం, మూడు స్థానాల నుండి 8 స్థానాలను ఎదగడం ఆ పార్టీకి ఊపు ఇస్తొంది. గత లోక్ సభ ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలవగా, ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో కనీసం పది స్థానాలు అయినా సాధించాలన్న పట్టుదలతో ఉంది. సీనియర్ నేతలు లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నారు. మరో పక్క కాంగ్రెస్ పార్టీ నుండి ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుండి పోటీ చేయడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ తీర్మానం చేసి పంపింది.

పదికి పైగా లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని తాజాగా ఏబీబీ సీఓటర్ సర్వే అంచనాలు వెలువడటంతో కాంగ్రెస్ లో మరింత జోష్ పెరిగింది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులపై కసరత్తు ప్రారంభించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుండి పోటీ చేసే అంశంపై పార్టీ అధిష్టానం పరిశీలిస్తొంది. మల్కాజ్ గిరి నుండి సోనియాను పోటీ చేయించే ఆలోచనలో తెలంగాణ నేతలు ఉన్నట్లు తెలుస్తొంది. గత ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుండి రేవంత్ రెడ్డి ఈ స్థానం నుండి ఎంపీగా గెలిచారు. సోనియా గాంధీని తొలుత మెదక్ నుండి పోటీ చేయించాలని పార్టీ నేతలు అనుకున్నా ఢిల్లీ నేతలు చర్చల అనంతరం మల్కాజ్ గిరి నుండి పోటీ చేయించే అవకాశం ఉందని అంటున్నారు. జనవరి రెండో వారం తర్వాత కాంగ్రెస్ అభ్యర్ధులను ఖరారు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుండి ఇప్పటి వరకూ మూడు సార్లు ఎన్నికలు జరగ్గా 2009లో కాంగ్రెస్ అభ్యర్ధి సర్వే సత్యనారాయణ, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా మల్లారెడ్డి, 2019లో రేవంత్ రెడ్డి విజయం సాధించారు. బీఆర్ఎస్ ఒక్కసారి కూడా గెలవలేదు. ఈ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు అన్నీ బీఆర్ఎస్ గెలుపొందడంతో ఇక్కడ నుండి బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి ని బరిలోకి దించే అవకాశం ఉందనే టాక్ నడుస్తొంది. సోనియా గాంధీ పోటీకి దిగితే బీఆర్ఎస్ కు ఈ స్థానం లో గెలుపు ప్రతిష్టాత్మకంగా మారనుంది. ఈ నియోజకవర్గంలో బీజేపీకి ఓటింగ్ బాగానే ఉంది. గడచిన ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసిన రామచంద్రరావుకు మూడు లక్షలకుపైగా ఓట్లు వచ్చాయి. కేవలం పది వేల ఓట్ల తేడాతోనే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధిపై విజయం సాధించారు.

గడచిన ఎన్నికల్లో రామచంద్రరావు ఓటమి పాలైనందున ఆ సారి తనకు అవకాశం లభిస్తుందేమో అన్న ఆలోచనలో ఈటల రాజేందర్ ఉన్నారుట. అయితే ఈ స్థానం నుండి పోటీ చేయడానికి బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు ఆసక్తి చూపుతున్నారన్న మాట కూడా వినబడుతోంది. అయితే సోనియా గాంధీ పోటీ చేయడం ఖాయమైతే మాత్రం ఇక్కడ నుండి సినీ సెలబ్రిటీలను పోటీకి నిలిపే ఆలోచన బీజేపీ చేస్తుందని అంటున్నారు. మాజీ ఎంపీ జయప్రద, లేదా మాజీ ఎమ్మెల్యే జయసుధ పేర్లను పరిశీలించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధిని బట్టి బీజేపీ అభ్యర్ధిని ప్రకటించే అవకాశం ఉంటుంది.

AP Politics: ఏపీ ఎన్నికల్లో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు..ఏ పార్టీకి ప్లస్ .. ఏ పార్టీకి మైనస్..?

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri