NewsOrbit
Entertainment News Telugu TV Serials

Trinayani December 26 2023 Episode 1120: తిలోత్తమని మరోసారి ఆపదలోకి నెట్టిన గాయత్రి పాప..

Trinayani Today Episode December 26 2023 Episode 1120 Highlights

Trinayani December 26 2023 Episode 1120: శ్యామల దేవి నైని ఇచ్చిన చీరలని మూట కడుతూ ఉండగా ఇంతలో పెద్ద బొట్టమ్మ వస్తుంది.ఏంటి పెద్ద బుట్ట మామ మళ్లీ వచ్చావు సుమను చూస్తే నన్ను తిడుతుంది ఊలోచిని అక్కడ పెట్టి వెళ్ళిపో అని శ్యామల అంటుంది. ఇంతలో నైని దురంధర హాసిని పైకి వస్తూ ఉంటారు. ఇప్పుడు నా పెద్ద కూతురు చూసిందంటే నన్ను తిట్టేస్తుంది ఎలా ఊలోచిని ఎత్తుకొని ఉన్నావు అని శ్యామల అంటుంది. ఏమి కంగారు పడకండి అమ్మ అని నాగులపురం పెట్టెలో ఉలొచ్చిని పెట్టి ఆ పెట్టే బట్టల మూటలో పెట్టి మూట కడుతుంది పెద్ద బొట్టమ్మ. ఇలా పెట్టిన పెట్టి మూట కట్టేస్తే పాపకి ఏమైనా అవుతుంది అప్పుడు కూడా నన్నే తిడతారు అని శ్యామల అంటుంది. నువ్వేం కంగారు పడకు శ్యామలమ్మ ఊలోచ్చి ఇంకొక ఐదు నిమిషాల్లో పాముగా మారిపోతుంది అప్పుడు తనకి ఏం కాదులే అని పెద్ద బొట్టమ్మ నచ్చ చెప్తుంది. కట్ చేస్తే, ఇంతలో ఏంటి పిన్ని అన్ని సర్దేసుకుంటున్నావ్ అన్నం కూడా తినలేదు అని హాసిని అంటుంది. ఏమీ లేదమ్మా నైని ఇచ్చిన బట్టలన్నీ మూట కట్టుకుంటున్నాను పొద్దున్నే వెళ్ళిపోవాలి కదా అని శ్యామల అంటుంది.

Trinayani Today Episode December 26 2023 Episode 1120 Highlights
Trinayani Today Episode December 26 2023 Episode 1120 Highlights

నైని ఇచ్చిన బట్టలు మూట పెద్దగా కనపడుతుంది ఏంటి అందులో ఏమైనా పెట్టావా అని తిలోత్తమ అంటుంది. ఏముందమ్మా పాతవి కొత్తవి అన్ని కలిపి ఎక్కువయ్యాయేమో ఇంకొన్ని వేసుకుందేమో అని వల్లభ అంటాడు. ఇంతలో పెద్ద బొట్టమ్మ కూడా అక్కడికి వస్తుంది. బాగున్నావా సుమన అని అడుగుతుంది పెద్ద బొట్టమ్మ. పెద్దవాళ్లు బాగున్నావా అన్నప్పుడు బాగున్నాను అని సమాధానం చెప్పడం సంస్కారం అని విక్రాంత్ అంటాడు. ఊలోచి రూమ్ లో ఉందో లేదో చూసిన తర్వాత ఆ మాట చెప్తాను అని సుమన అంటుంది. సరే నువ్వు వెళ్లి చూసి రా సుమన అని ఎద్దులయ్య అంటాడు. శ్యామల అమూట అంత పెద్దగా ఉంది కదా విప్పి చూడొచ్చా అని తిలోత్తమా అంటుంది. ఎందుకు నీకేమైనా కావాలా అని హాసిని అంటుంది. నేను చూడొచ్చా అన్నాను కానీ కావాలి అనలేదు అయినా ఆ బట్టలు నాకెందుకే అని తిలోత్తమ అంటుంది. కట్ చేస్తే, సుమన తన రూమ్ లోకి వెళ్లి ఊలోచ్చి ఎక్కడున్నావమ్మా నువ్వు కనపడకపోతే పెద్ద బొట్టమ్మ అని అనుమానించాల్సి ఉంటుంది అని ఉయ్యాలలో చూస్తే ఉయ్యాలలో ఉలొచి కనిపిస్తుంది పాలు తాగి పడుకున్నావా ఉలోచి హాయిగా నిద్రపో అని సుమన వెళుతుంది. బట్టల మూట ఒకసారి రిప్పి చూద్దామని తిలోత్తమ మూట దగ్గరికి వెళ్లి వదిలే శ్యామల మళ్లీ నిన్ను అనుమానించినట్టు అవుతుంది అని తిలోత్తమ అంటుంది.కట్ చేస్తే, ఇంతలో సుమన అక్కడికి వస్తుంది.

Trinayani Today Episode December 26 2023 Episode 1120 Highlights
Trinayani Today Episode December 26 2023 Episode 1120 Highlights

చూసావా చెల్లి ఊలోచి ఇంట్లోనే ఉందా అని నైని అడుగుతుంది. చూశాను తను గదిలోనే ఉంది అని సుమన అంటుంది. ఇదేంటి పాప పెట్టెలో ఉంటే తన గదిలో ఎలా ఉంది అని శ్యామల కంగారు పడుతుంది. ఏంటి మాత కంగారు పడుతున్నావ్ ఎందుకు అని ఎద్దులయ్య అంటాడు. పాప పెట్టలో ఉంది కదా ఏమైనా అవుతుందేమోనని కంగారు పడుతున్నాను అని శ్యామల అంటుంది. అదేంటి ఏ పాప ఉంది అందులో అని నైని అంటుంది. అదే మాత అగ్గిపెట్టెలో అని చిట్టి మాత తల్లి చెప్తుంది అని ఎద్దులయ్య అంటాడు. ఇది జోక్ వేసే టైం కాదు ఎదులయ్యా జోక్ వేసిన పదిమంది నవ్వాలి అదేం జోకు అని పావన మూర్తి అంటాడు. అంటే ఉలొచ్చి గదిలోనే ఉన్నప్పుడు ఇంకా ఎవరికి ఏ ప్రమాదం ఉంటుంది అని డమ్మక అంటుంది. ఉలొచ్చి గదిలోనే ఉంది కాబట్టి నన్ను సుమన ఏమి అనట్లేదు లేకుంటే చంపేసేది అని పెద్ద బొట్టమ్మ అంటుంది. లేదంటే ఈ పార్టీకి నా చేతిలో అయిపోయే దానివి అని సుమన అంటుంది. సరే సర్లే ఇప్పటికే లేట్ అయిపోయింది అందరం భోంచేద్దాం రండి అమ్మ నువ్వు కూడా రా పెద్ద బొట్టమ్మా నువ్వు కూడా రా అని నైని అంటుంది. వద్దులే నైనీ అమ్మ నేను తినలేను అని పెద్ద బొట్టమ్మ అంటుంది. సరే అని అందరూ కిందికి వెళ్ళిపోతారు. ఏంటి పెద్ద బొట్టమ్మ పెట్టెలో పాపని పెడితే గదిలో ఎలా ఉంది అని శ్యామల కంగారు పడుతూ ఉంటుంది.

Trinayani Today Episode December 26 2023 Episode 1120 Highlights
Trinayani Today Episode December 26 2023 Episode 1120 Highlights

నేను పెట్టిలో పెట్టి మూట కట్టేటప్పుడు తప్పించుకొని ఉంటుంది నేను కూడా సుమన ఏదైనా చేయాలి అనుకుంటే అలాగే తప్పించుకుంటాను అని పెద్ద బొట్టమ్మ అంటుంది. నైని  కిందికి వెళ్తూ ఏదో జరుగుతుంది పైన అని ఆలోచించి మళ్లీ కిందికి వెళ్ళిపోతుంది. పాప తప్పించుకుంది కాబట్టి ఈరోజు తప్పించుకున్నాం లేదంటే నీ పని నా పని అయిపోయేది అని శ్యామల అంటుంది. సరేలే శ్యామలమ్మ నేను వెళ్తాను అని పెద్ద బొట్టమ్మ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, రేయ్ వల్లభ ఈ శ్యామలాదేవి మూట కట్టిన బట్టలు మనం కట్టల నోట్లు పెడితే మనకు ఏమైనా ఉపయోగపడుతుందేమో అని తిలోత్తమా అంటుంది.

Trinayani Today Episode December 26 2023 Episode 1120 Highlights
Trinayani Today Episode December 26 2023 Episode 1120 Highlights

ఏముందమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి అమ్మ విశాలాక్షి అమ్మ తల్లి నేను పడ్డ కష్టాలకి నన్ను కరుణించి కట్టలు ఇచ్చావా అని సంతోష పడిపోతుంది దానివల్ల మనకేంటి మమ్మీ లాభం అని వల్లభ అంటాడు. రేయ్ నేను చెప్పేది మనసుపెట్టి సరిగ్గా వినరా శ్యామలాదేవి మూట కట్టుకున్న బట్టలు నెత్తిన పెట్టుకొని వెళ్లిపోతూ ఉండగా మనం పెళ్లి మూట విప్పి చూపించు అందాము అప్పుడు దొంగతనం బయటపడుతుంది కదా అని తిలోత్తమ అని నడుస్తూ ఉండగా అంతకుముందే గాయత్రి పాప పాలు తాగుతూ ఆ రూమ్లో పాలు పోసి వెళ్ళిపోతుంది ఆ పాలలో కాలు వేసి జారీ కింద పడుతుంది తిలోత్తమ అమ్మో నా నడు విరిగిపోయింది అని తిలోత్తమ అంటుంది.

Trinayani Today Episode December 26 2023 Episode 1120 Highlights
Trinayani Today Episode December 26 2023 Episode 1120 Highlights

అమ్మ అంటున్నవు ఎక్కడ అత్తయ్య మీ అమ్మ ఏది చూపించు అని హాసిని జోక్ చేస్తుంది. వదిన ఏ టైం లో కూడా జోక్లు ఏంటి అమ్మ తలడిల్లి పోతుంది లేపు అన్నయ్య అని విక్రాంతు అంటాడు. తల చెయ్యి పట్టుకుని లేకపోయేసరికి రేయ్ పిచ్చి నా కొడకా  గాయమైన కాడనే పట్టుకొని ఇంకా నొప్పి చేస్తావ్ ఏంటి రా అని తినోత్తమ వల్లభని తిడుతుంది. రెండు నొప్పులు అయ్యాయా అమ్మ అని వల్లభ లేపి సోఫాలో కూర్చోబెడతారు. అయినా ఇప్పుడు ఎలా జారి పడ్డావా అత్తయ్య అని హాసిని అంటుంది. మమ్మీ అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉండగా జారిపడింది అని వల్లభ అంటాడు. ఈ వయసులో క్యాట్ వాకింగ్ నీకు అవసరం అంటావా తిన్నగా కూర్చొని ఇంట్లో పడి ఉండక అని హాసిని అంటుంది. వదిన ఊరికే అమ్మ జారి పడలేదు ఇక్కడ పాలు ఎవరో పోశారు అందుకే జారిపడింది ఈ రూమ్ లోకి పాలు ఎలా వచ్చాయి చూడు వదిన అని విక్రాంత్ అంటాడు.  చూస్తాను విక్రాంత్ అని హాసిని పాలు చూస్తూ ఉంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu