NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో కొత్త ముఖాలు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. వాళ్ల వివరాలు..!!

Share

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ నిజంగానే ఉల్టా పుల్టా అనే రీతిలో సాగుతోంది. హౌస్ లో ఉన్న సభ్యులు చూస్తున్న ఆడియన్స్ సైతం గేమ్ నీ అంచనా వేయలేకపోతున్నారు. గత సీజన్ లలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఆడియన్స్ చాలావరకు అంచనా వేసేవాళ్లు. షోలో కూడా అదే జరిగేది. కానీ ఈసారి సీజన్ ఎవరి అంచనాలకు ఊహలకు అందని రీతిలో సాగుతోంది. మొత్తం 14 మంది సభ్యులు హౌస్ లో ఎంట్రీ ఇవ్వగా ప్రస్తుతం హౌస్ లో.. పాత కంటెస్టెంట్స్ ఎనిమిది మంది ఉన్నారు. ఐదు వారాలకు ఐదుగురు లేడీ కంటెస్టెంట్ వెలిపోగా ఆదివారం ఎపిసోడ్ లో గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయినట్టు ఇంటి సభ్యుల ముందు తెలియజేసి అతన్ని సీక్రెట్ రూమ్ లో పెట్టడం జరిగింది. దీంతో సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Wild card entries in telugu Bigg Boss house their details

ఇదిలా ఉంటే సగం సీజన్ కంప్లీట్ అయిన తర్వాత.. ఆదివారం ఎపిసోడ్ లో.. వైల్డ్ కార్డు రూపంలో కొత్త కంటెస్టెంట్స్ నీ హౌస్ లోకి పంపించారు. వాళ్ళు ఎవరు అంటే టీవీ సీరియల్ నటుడు అర్జున్, నటి అశ్విని, సంగీత దర్శకుడు భోలే షావలి, గుండమ్మ కథ సీరియల్ ఫేమ్ పూజ, టీవీ నటి నయని పావనీలను బిగ్ బాస్ ఇంటిలోకి పంపించడం జరిగింది. దీంతో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కొత్త వాతావరణం నెలకొంది. ఇప్పటివరకు గేమ్ ఆడిన కంటెస్టెంట్లకు.. ఊహించని షాక్ ఇచ్చినట్లయింది.

Wild card entries in telugu Bigg Boss house their details

ఈసారి సీజన్ లో ఇప్పటివరకు ఎలిమినేట్ అయినా వాళ్లందరూ లేడీసే కావటం గమనార్హం. అయితే కొత్త వాళ్లు హౌస్ లోకి రావడంతో షోపై ప్రేక్షకులకు మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. అంతేకాదు సీజన్ సెవెన్ కెప్టెన్ కి సకల భోగాలు అనుభవించే రీతిలో విఐపి రూమ్ కేటాయించారు. దీంతో ఈ సీజన్ మొట్టమొదటిగా కెప్టెన్ అయిన పల్లవి ప్రశాంత్.. నేడు విఐపి రూమ్ లో ఉండనున్నారు. సగం సీజన్ కంప్లీట్ అయిన తర్వాత చాలా రూల్స్ మార్చడంతో.. హౌస్ లో ఏం జరుగుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Share

Related posts

GodFather: “గాడ్ ఫాదర్” చూసి బన్నీ చెప్పినది మర్చిపోలేను.. మోహన్ రాజా సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Avatar 2: “అవతార్ 2″లో అవసరాల శ్రీనివాస్..!!

sekhar

బిగ్ బాస్ సీజన్ 6లో కొత్త కొత్త రూల్స్..??

sekhar