World Television Day 2023: నవంబర్ 21న అంతర్జాతీయ టెలివిజన్ దినోత్సవం జరుపుకుంటారు….ఎందుకో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయాలను మన కళ్ళ ముందు చూపిస్తున్న టెలివిజన్ పుట్టినరోజు. ఐక్యరాజ్యసమితి 1996 నుండి ప్రతి ఏడాది నవంబర్ 21న ప్రపంచ టెలివిజన్ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. దీంతో నవంబర్ 21న ప్రపంచంలోని అనేక దేశాలలో టెలివిజన్ దినోత్సవం పాటిస్తారు. ఈ క్రమంలో టెలివిజన్ సమాజంపై చూపే సేవలను స్మరించుకుంటారు. సమాజంలో ప్రజలను ప్రభావితం చేసే విభిన్నమైన సమస్యలను ప్రదర్శించడంలో టెలివిజన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని గుర్తిస్తారు. ఇప్పుడైతే అందరి చేతులలో సెల్ ఫోన్స్ ఉన్నాయి గాని ఒకప్పుడు టెలివిజన్ లేనిదే పూటగడవని పరిస్థితి. టెలివిజన్ ద్వారా మంచి, చెడు రెండు ఉన్నాయి. దీన్ని ఎంతవరకు వినియోగించాలో అంతవరకు వినియోగిస్తేనే మానవ మనుగడకు మంచిది. ప్రపంచంలో విచక్షణారహిత వార్తలకు మార్గం టెలివిజన్ ఒకటి. ప్రజలకు సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై టెలివిజన్ ఒక అవగాహన ఇస్తుంది. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ఒక భాగమైన ఎన్నికలలో అభ్యర్థులను ఎంచుకునే విషయంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
)
వాస్తవానికి ప్రపంచ టెలివిజన్ దినోత్సవం అంతకుముందు టెలివిజన్ డేగా ఉండేది కాదు. గతంలో ఏమని ఉండేదంటే.. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే, వరల్డ్ టెలికమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే, వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే వంటి రకరకాల పేర్లతో ఉండేది. అయితే 1996లో అవేమీ కాకుండా ఐక్యరాజ్యసమితి నవంబర్ 21న ప్రపంచ టెలివిజన్ దినోత్సవం అని ప్రకటించింది. ఏదైనా ప్రింట్ మీడియా లేదా సోషల్ మీడియా టెలివిజన్ వీటి ఉద్దేశాలు సత్యం సమాజానికి తెలియాలి. కానీ ప్రజెంట్ ఈ మాధ్యమాలలో చూపించేవి ఏది సత్యమో ఏది అసత్యమో గుర్తించలేని పరిస్థితి నెలకొంది. టెక్నాలజీ కారణంగా సమాచారం కూడా చాలా వరకు కల్తీగా మారిపోయింది. ఒక జాతిపై లేదా మతంపై ఇతర దేశాలపై విద్వేషాలను రగలించే.. వేదికలుగా టెలివిజన్స్ మారిపోయాయి. మరి ముఖ్యంగా రాజకీయ పార్టీలకు చాలా టెలివిజన్స్.. చానల్స్ కొమ్ముకాసే పరిస్థితి ప్రస్తుత సమాజంలో కనిపిస్తుంది. ఇదంతా పక్కన పెడితే టెలివిజన్ (దూరదర్శన్) నేపథ్యం చూస్తే…దీనిని జాన్ లోగీ బెయిర్డ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.

ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో అతడు అనారోగ్యంతో మంచం పట్టాడు. దీంతో చదువు ఆగిపోయింది. 1922లో కోలుకున్నాక టెలివిజన్ ఆవిష్కారంపై దృష్టి పెట్టాడు. ఓ ఇరుకు గదిని ప్రయోగశాలగా మార్చుకున్నాడు. ఎలక్ట్రిక్ మోటారు, చిన్న అట్టముక్క, కటకాలు, తీగలు, వైర్ లెస్ టెలిగ్రాఫ్, టార్చ్, బ్యాటరీ, జిగురు ఉపయోగించి ఓ పరికరం తయారు చేశాడు. రెండేళ్ళ నిరంతర కృషి ఫలితంగా 1922 నవంబర్ 21న కొన్ని ఆకారాలను మూడు మీటర్ల దూరం వరకూ ప్రసారం చేశాడు. అది చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత కాలంలో రిసీవర్ లో కనబడే ప్రతిబింబం మరీ స్పష్టంగా ఉండాలని, ప్రసార దూరం పెంచాలని బెయిర్డ్ ప్రయోగాలు చేశాడు. ఆయన కృషికి గుర్తింపుగా ఐక్యరాజ్య సమితి 1996 నుంచి నవంబరు 21ని ప్రపంచ టెలివిజన్ దినోత్సవంగా ప్రకటించింది.