NewsOrbit
Featured బిగ్ స్టోరీ

స్వర్ణ సుందరి .. స్వప్న సుందరి.. చుట్టూ కేరళ రాజకీయం…!

కేరళను ఓ కేసు కుదిపేస్తోంది. బంగారం లాంటి కేసు.., అందాల రాష్ట్రాన్ని కుదిపి పీఠాల్ని కదిలించేస్తుంది…! ఒక యువతీ చుట్టూ… ఆమెను అల్లుకుని ఉన్న ఓ ఐఏఎస్ అధికారి చుట్టూ…, ఆయన ఉన్న సీఎం కార్యాలయం చుట్టూ… అలా రాష్ట్రం చుట్టూ ఈ కేసు తిరుగుతుంది. తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ కి చేరిన ఈ కేసులో ఎటువంటి మలుపులు ఉంటాయనేది ఆసక్తిగా మారింది.

సింపుల్ గా చెప్పుకోవాలి అంటే దుబాయ్ నుండి కేరళకి బంగారం స్మగ్లింగ్. ఇది ఏనాటి నుండో జరుగుతుంది. దీనిలో తాజాగా కొన్ని తలకాయలు బయటకు రావడం.., కస్టమ్స్ అధికారులు పట్టుకుంటే మా వాళ్ళే వదిలేయండి అంటూ సీఎం కార్యాలయం నుండి ఫోన్లు వెళ్లడం… అక్కడి నుండి మలుపులు తిరుగుతూ ఇప్పుడు జాతీయ స్థాయి ఇష్యూ గా మారింది. కేరళలో సిపిఎం కి చెమటలు పడుతున్నాయి, కేంద్రంలో కొందరు బిజెపి వాళ్లకి చెమటలు పడుతున్నాయి.

 

ఆ సుందరి సర్కిల్ భలే పెద్దది బాసూ…!

ఈ కేసులో ప్రధాన సూత్రధారి, పాత్రధారిగా ఉన్న స్వప్న సురేష్ అనే యువతి ఇప్పుడు అందరి దృష్టిలో ఉన్నారు. ఆమెకి చాల పెద్ద సర్కిల్ ఉంది. ఎంతగా అంటే…!
పేరు : సీఎం కార్యాలయంలో ఓ ఐఏఎస్ అధికారి శివ కుమార్.
పాత్ర : కస్టమ్స్ అధికారులకు ఫోన్ చేసి నిందితులను వదిలేయమని అడిగారు.
పేరు : బిజెపి నాయకుడు సందీప్ నాయర్
పాత్ర : నేరుగా బంగారం స్మగ్లింగ్ చేస్తుంటారనేది ఆరోపణ.
పేరు : సౌమ్య (సందీప్ నాయర్ భార్య)
పాత్ర : సందీప్ బంగారం స్మగ్లింగ్ చేస్తుంటారని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.
తాజాగా ఏమిటంటే : ఈ స్వర సుందరి అలియాస్ స్వప్న సుందరి కేరళ ఆర్ధిక మంత్రి తో ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. అంటే అటు ఐఏఎస్ అధికారులు, ఇటు బీజేపీ నాయకులు, ఇటు కంప్ నాయకులతో కూడా ఈమె రహస్యాలు నడిపింది. బంగారు లావాదేవీలు నడిపించినట్టు కథలు వస్తున్నాయి. ఏది ఏమైనా NIA కి పెద్ద పని పడింది. ఈ కేసు నుండి తానూ క్లీన్ గా బయట పడాలని సీఎం పినరయి విజయన్ చూస్తున్నారు. నిజమే ఆయనపై ఇప్పటి వరకు అవినీతి మరకలు లేవు. ఇది అంటితే వదిలేది కాదు.

ఆమె గురించి సింపుల్ గా…!

స్వప్న సురేష్… అలియాస్ స్వర సుందరి చరిత్ర చాలా పెద్దది. పదో తరగతి కూడా పాస్ కాలేదట. కానీ ప్రైవేట్ గా డిగ్రీ సంపాదించేసింది. మొదట ఒక ప్రైవేట్ కొలువు చేసుకుని.., ట్రావెల్ ఏజెన్సీ నడిపించింది. తర్వాత త్రివేండ్రం ఎయిర్ పోర్ట్ లో చేరింది. అక్కడ సిబ్బందితో గొడవ పెట్టుకుని… ఓ ఐఏఎస్ అధికారి పరిచయం అవ్వడంతో ఏకంగా దుబాయ్ ఎమిరేట్స్ కార్యాలయంలో చక్రం తిప్పే స్థాయికి చేరుకుంది. తల్లి సాధారణ గృహిణి, తండ్రి దుబాయ్ లో ఉంటారు. ఆయన ద్వారానే ఆమె అనేక సార్లు దుబాయ్ వెళ్లారు, వచ్చారు. అక్కడి నుండి కొన్ని కథలు నడిపారు. గతంలోనే ఈమె పై కొన్ని కేసులున్నాయి. ఇలా దుబాయ్ లింకులు మూల కారణం ఆమె. కానీ ప్రస్తుతం మారకాలన్నీ రాజకీయులకు, ఐఏఎస్ కి అంటాయి. ఇది ఇంకా ఎక్కడికి వెళ్తుందో.., ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో…!! అందుకే ఇది బంగారం లాంటి కథ..!!

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju