పేదవాడి ఆపిల్ అనగానే గుర్తుకు వచ్చేది జామపండు. జామపండు తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. పండు వల్లనే కాదు జమ ఆకులు తిన్న ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా మధుమేహ వ్యాధి గ్రస్తులకు, పురుషులకి చాల ఉపయోగాలు ఉన్నాయి. కొందరు పురుషులకు సహజంగానే, పొగ తాగే వారిలో స్పెర్మ్ ఉత్పత్తి కాకుండా ఉంటాయి. ఈ లాంటి సమస్యలు ఉన్న వారికి జామ ఆకు రసం చాలా మేలు చేస్తుంది. అంతే కాదు జామ ఆకు వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి అవి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి వివాహ అనంతరం దాంపత్య జీవితం, పిల్లపాపలతో సంతోషంగా ఉందాం అనుకుంటాడు ప్రతి పురుషుడు. కాని వీర్యకణాల కొరత వల్ల ఆ వ్యక్తి వివాహం చేసుకోలేక సంక్షోభం ఎదుర్కొంటాడు. ఈ బయటకి చెప్పుకోలేక లోలోపల బాధపడుతుంటారు కొందరు. దీనికి అతిక్రమించేందుకు సహజంగా లభించే ఒక ఔషధం ఉంది అదే జామ ఆకు రసం. ఈ జామ ఆకును నేరుగా నమిలి మింగడం లేదా పానీయంగా తీసుకోవడం వల్ల స్పెర్మ్ ఉత్పత్తి త్వరగాపెంచడమే కాకుండా స్పెర్మ్ నాణ్యతను పెంచుతుంది. అంతేకాదు ఈ ఆకులు తినడం ద్వారా శరీరానికి అనేక ప్రయోజనాలను కలుగుతాయి. జామ ఆకులలో వివిరివిగా యాంటీఆక్సిడెంట్లు కలిగిఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఈ ఆకులను టీ రూపంలో తయారు చేసి మూడు నుండి నాలుగు నెలలు రోజు తాగడం వల్ల శరీరంలో చెడు కొవ్వులను తొలగించి శరీర బరువు నియంత్రణకు కృషి చేస్తుంది.
జామ ఆకులను రసంగా తయారు చేసి వారానికి ఒకసారి తలకుప్యాక్ లాగా పెట్టుకోవడం వల్ల తలలోని ఇన్ఫెక్షన్, చుండ్రు, పేన్ల సమస్యలను తొలగిస్తుంది. జామ ఆకులను పొడి చేసి టీగా నీళ్లలో వేడిచేసి తీసుకుంటే జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. జామ ఆకు ‘టీ’ని ఈవిధంగా చేసుకోండి. శుభ్రంగా ఉన్న నాలుగు జామ ఆకులు తీసుకోండి. జామ ఆకులను ఎండలో ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు లేదా తాజా ఆకులను నీటితో ఉడకబెట్టాలి. ఆ రసంలో తేనేను కలుపుకోవాలి లేకుంటే వగరుగా ఉండి తాగడానికి ఇష్టం కలగదు, వీటితోపాటు యాలకులు కూడా వేసుకోవచ్చు. రోజులో ఎప్పుడైనా తాగొచ్చు, ఉదయం పూట తాగితే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వైద్య చికిత్స తీసుకుంటూ వాటితో పాటు ఈ జామ ఆకు టీని రెగ్యులర్ గా తీసుకోండి వీర్య ఉత్పత్తి పెరుగుతుంది.