ప్రతి ఒక్కరు యాపిల్స్ ఇష్టం గా తింటారు. రోజు కో యాపిల్ తింటే ఆస్పత్రి కి వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతారు. దీనిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు.
ప్రతి రోజు ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మ సంబధింత వ్యాధులను తగ్గిస్తుంది. ఊబకాయం, తలనొప్పి, కీళ్లనొప్పులు, ఆస్తమా, అనీమియా, క్షయ, నాడీ సమస్యలు, నిద్రలేమి, జలుబు వంటి పలురకాల సమస్యలకు ఆపిల్ చక్కని ఔషధంగా పనిచేస్తుంది..అదే విధంగా.. యాపిల్స్‌ని ఫ్రిజ్‌లో పెట్టకూడదు.. ఒక వేళ పెట్టినా బయటకు తీసిన 5 నిమిషాల్లోనే తినాలి. లేదంటే ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు. వీటితో పాటు ఆపిల్ గింజలు కూడా తినకూడదని చెబుతారు. ఇవి విషంతో సమానమని చెబుతారు. అందుకే వీటిని తినకూడదని చెబుతున్నారు.
యాపిల్ కోసుకొని తిన్నప్పుడు దాంట్లో ఉండే గింజలను తీసి పారేస్తూ ఉంటారు. తెలియకపోయినా చాలామంది ఆ గింజల్ని తినడానికి ఇష్టపడరు. అయితే యాపిల్ గింజ ల్లో అమాక్డాలిన్ అనే పదార్థం ఉంటుంది. గింజలను నమిలినప్పుడు ఆ పదార్థం హైడ్రోజన్ సైనైడ్ గా మారుతుంది..ఓ సర్వే ప్రకారం 60 కిలోల బరువు ఉన్న 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 15 నుంచి 175 విత్తనాలు తినడం వల్ల చనిపోతారట. అదే పదేళ్లలోపు చిన్నారులు 50 తిన్నా చనిపోతారని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీటిని తినే విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. వీటిని తినే విషయంలో ఏ మత్రం అజాగ్రత్తగా ఉన్న భవిష్యత్‌లో ప్రాణాలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.