అలసిపోయినప్పుడు సీతాఫలం తింటే ఏం అవుతుందో తెలుసా?

సీతాఫలం.. శీతాకాలంలో దొరికే అద్భుతమైన పండు ఇది. ఎంత తిన్న ఎన్ని తిన్న ఇంకా ఇంకా తినాలి అనిపించే రుచిని ఇవి అందిస్తాయ్. కేవలం రుచినే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయ్. ఇక ఈ పండు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ్. అవి ఏంటి అనేది మనం ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

 

1. సీతాఫలంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో విష వ్యర్థాలను బయటకు పంపుతుంది.

2. సీతాఫలంలో విటమిన్ ‘సి ‘ఉంటుంది. ఇంకా పొటాషియం, మెగ్నీషియం కూడ ఉంటాయి. అందువల్ల గుండెకు చాలా మంచిది.

3. సీతాఫలం తినడం వల్ల బిపి కంట్రోల్ అవుతుంది. ఈ పండ్లలోని విటమిన్ ‘ఎ ‘మన చర్మాన్ని, జుట్టును ఆరోగ్యాంగా ఉంచుతుంది. కంటి చూపు కూడ మెరుగవుతుంది.

4. సీతాఫలంలోని కాపర్ మలబద్దకాన్ని నివారిస్తుంది. డమేరియాకు చెక్ పెట్టె గుణం ఈ ఫలానికి ఉంది.

5. సీతాఫలంలోని మెగ్నీషియం ఉండడం వల్ల బాడీలోని నీటి లెవల్స్ ని క్రమబద్దీకరిస్తుంది.

6. అలసిపోయినట్లు అనిపిస్తే వెంటనే సీతాఫలం తినండి. వీటిలో ఉండే పొటాషియం కండరాల బలహీనతను తగ్గించి శక్తిని ఇస్తుంది.

7.సీతాఫలంలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రక్తహీనతను అరికడుతుంది. ఇంకా బరువు పెరగడానికి కూడ ఉపయోగపడుతుంది.

8. ఇందులో ఉండే సహజ చెక్కర ఆరోగ్యానికి చాలా మంచిది. ఆస్తమాతో బాధపడేవారు సీతాఫలం తింటే మేలు జరుగుతుంది. ఇందులోని విటమిన్ బి ఆస్తమాకు చెక్ పెడుతుంది.

9. గర్భిణీల కు ఈ పండు చాలా మంచిది. పిల్లలు పుట్టే సమయంలో నొప్పుల్ని నివారించి గుణం ఈ పండులో ఉంది.

10. సీతాఫలంను డయాబెటిస్ ఉన్నవారు కూడ తినవచ్చు. ఇందులో డైటరీ ఫైబర్ ఉంది కాబట్టి షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తుంది.