Tea: టీ మాట వింటే చాలు ఎవరికయినా సరే ఎక్కడ లేని ఉషారు వచ్చేస్తుంది.ఎందుకంటే టీ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది.పొద్దునే నిద్ర లేచిన వెంటనే టీ తాగిన తర్వాతే ఏ పని అయిన మొదలుపెడతాం. కొందరికి అయితే ఒక్కసారి అయిన టీ సిప్ చేయనిదే అసలు పొద్దుగడవదు. ఈ ప్రపంచంలో చాలా మంది ‘టీ’ అభిమానులు ఉన్నారు. కొందరికి అయితే ఫలానా సమయానికి టీ తాగనిదే విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంది.. ఆ సమయానికి టీ తాగిన తరువాత గాని చేయాలిసిన పనులు ముందుకు సాగవు..ఇంకో విషయం ఏంటంటే ఈ టీ లో చాలా రకాలు టీలు ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చాయి.అయితే రిలాక్స్ కోసం టీ తాగడం మంచిదే. అలా అని టీ ను మరి ఎక్కువ సార్లు తాగడం కూడా మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు.అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని రకాల ఆహార పదార్ధాలను తిన్నా తరువాత టీ ను అసలు తాగకూడదు అని, అలా తాగడం వలన చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
టీ ఎప్పుడు తాగకూడదు అంటే..?
మీరు ముందుగా చల్లటి నీళ్లు గాని, చల్లటి ఆహార పదార్ధాలు గాని తిన్నా వెంటనే టీ తాగకుండా ఉంటే చాలా మంచిది.ఎందుకంటే చల్లటి నీళ్లు, పానీయలు తాగిన వెంటనే వేడి వేడి టీ తాగడం వలన జిర్ణక్రియ ప్రక్రియ సాఫిగా సాగదు.అలాగే నిమ్మరసం తాగిన తర్వాత కూడా టీ తాగకూడదు. ఫలితంగా ఆసిడీటీ సమస్య వస్తుంది.అలాగే చాలా మందికి భోజనం. చేసిన తర్వాత టీ తాగే అలవాటు ఉంటుంది కానీ అలా తాగాడం ఆరోగ్యానికి మంచిది కాదు. అలా టీ తాగడం వలన రక్తపోటు సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా గుండె యొక్క పనితీరు కూడా తగ్గుతుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
టీ కు షుగర్ వ్యాధి గ్రస్థులు దూరం… ఎందుకంటే..?
షుగర్ వ్యాధిగ్రస్తులు సాధ్యమైనంత వరకు టీ కు దూరంగా ఉంటే చాలా మంచిది. మరి ఎక్కువ సార్లు కాకుండా లిమిట్ గా టీ తాగాలి. టీలో పంచదారకు బదులుగా బెల్లం గాని, షుగర్ ఫ్రీ పౌడర్ గాని వేసుకుని తాగితే మంచిది. అలాగే శెనగపిండితో చేసినవంటలు తిన్నా వెంటనే టీ తాగకూడదు అలా తాగితే జీర్ణ క్రియ ప్రక్రియ అనేది సాఫిగా జరగదు.టీ తాగడానికి ముందు లేదా తాగిన అనంతరం ఐరన్ తో ఉన్న ఆహారాలను తీసుకోకూడదు. ముఖ్యంగా ఆకు కూరల్ని అసలు తీసుకోకూడదు.టీ తాగేటప్పుడు పసుపు ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి.ఈ రెండిటి కలయిక వలన గ్యాస్, అసిడిటీ లేదంటే మలబద్ధకం వచ్చే అవకాశాలు ఉన్నాయి.నిజానికి టీ తాగడానికి ముందు గాని తాగిన తరువాత గాని ఒక పావు గంట పాటు ఏమి తినకుండా, తాగకుండా. ఉంటే ఆరోగ్యానికి ఈ డోకా ఉండదు.