Chapathi: చాలా మంది చపాతీ చేసిన కొద్దీ సేపటికి గట్టి పడిపోతుంది.. సాగుతుంది అని అంటుంటారు.. ఇప్పుడు చెప్పబోయే చపాతీ 3 గంటల తర్వాత కూడా మృదువుగా ఉండటమే కాదు ఇందులో వేసే ఐటమ్స్ వలన రుచిగా ఉంటాయి. ఒకసారి ట్రై చేస్తే ఎప్పుడు అవే కావాలంటారు.
గోధుమ పిండి -2 కప్పులు
ఉల్లిపాయ తరుగు- అరకప్పు
3 – పచ్చిమిర్చి సన్నని తురుము-
ఉప్పు – మీ రుచికి తగినట్టు
గరం మసాలా- ఒక స్పూన్ లేదా కొంచెం తగ్గించుకోవచ్చు
కారం- 1\4 స్పూన్
నీళ్లు – పిండి కలపడానికి తగినన్ని
ఒక బౌల్ లో కి గోధుమ పిండి తీసుకుని దానిలో మిగిలిన ఐటమ్స్ అన్ని వేసుకుని ఉల్లిపాయ లో కూడా నీరు ఉంటుంది కాబట్టి కొంచెం నీరు మాత్రమే పోసి పిండి సాఫ్ట్ గా అయ్యేదాక ఎక్కువ సేపు కలుపుకుని , పిండి మీద గుడ్డ కప్పి 20-40 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
ఇలా బాగా నానిన పిండి ఉండలుగా చేసుకుని పొడి పిండి చల్లి చపాతీలను చేసుకోవాలి .
వత్తుకున్న చపాతీలను పెనం మీద నూనె లేకుండా వేసుకుని రెండు వైపులా కాల్చిన తర్వాత ,నూనె వేసి కాల్చుకుంటే సరిపోతుంది.రుచికరమైన చపాతీలు రెడీ అయినట్టే.. ఈ చపాతీలు నంజు ఏమి లేకుండా కూడా తినవచ్చు లేదా ఫ్రెష్ గా తొడుక్కున్న పెరుగు లేదా నచ్చిన కూర్మ తో తిన్న రుచి అదిరిపోతోంది.ఇందులో ఉల్లిపాయలు వేయడం వలన ఒక ప్రత్యేక రుచి ఉంటుంది. కూర చేసుకునే సమయం లేని వారు వీటిని ట్రై చేయండి.