Romance: తరచుగా శృంగారం చేయడం వలన రక్తనాళాల ద్వారా రక్తం బాగా ప్రసరణ జరిగి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది .
రతి రతి క్రీడ జరిగే సమయంలో మానవ శరీరంలో డోపమైన్ అనే ఒక పదార్థం విడుదలవుతుంది. అది శరీరంలో వున్న ఒత్తిడి హార్మోన్ల మీద యుద్ధం చేసి శరీరానికి మంచి సుఖాన్ని ఇస్తుంది . ప్రతి రోజు శృంగారం లో పాల్గొనడం వల్ల హార్మోన్ల, విడుదల జరిగి శరీరంలో రోగనిరోధక శక్తిని పెరిగి వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది.
శృంగారం చేసేటప్పుడు ఒక ఉద్వేగ సమయంలో విడుదల అయ్యే ఆక్సిటోసిన్ మంచి నిద్రకు కారణం అవుతుంది. అలాగే మానసిక ఒత్తిళ్ల నుంచి బయట పడేస్తుంది. కొంతమంది కి సహజ మైన ఒళ్ళు నొప్పులతో బాధపడుతుంటారు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు రోజూ శృంగారంలో పాల్గొంటే ఆ సమయంలో మగవారు ,ఆడవారి శరీరంలో ఎండార్ఫిన్స్ అనే హార్మోన్ ఉత్పత్తి జరిగి సహజ నొప్పి ని తరిమి కొట్టి విశ్రాంతిని ఇస్తుంది .ప్రతిరోజూ శృంగారం చేస్తే వ్యాయామం ఎక్కువగా చేయాల్సిన అవసరం రాదు అంటే దాని అర్థం అంత ఫిట్ గా ఉంటారు. అయితే ఇలా ఫిట్ గా ఉండాలంటే అందుకు ప్రత్యేకమైన పద్ధతి లో శృంగారం చేయవలసి ఉంటుంది. ఒక చాప ను నేల మీద వేసుకుని పడుకుని 30 నిమిషాలపాటు కౌగిలించుకోవాలి .
చర్మాన్ని అందంగా ఉంచడంలో శృంగారం కీలకమైన పాత్ర పోషిస్తుంది. దీనితో పాటు త్వరగా వృద్ధాప్యం రాకుండా రక్షణ కల్పిస్తుంది .
రోజూ శృంగారం చేస్తే మగవారి లో ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. మగవారు స్ఖలించే ద్రవాలలో ఎక్కువ భాగం ప్రోస్టేట్ గ్రంధి స్రవించినదే. ఒకవేళ శృంగారం చేయకపోతే ఆ ద్రవాలు ప్రోస్టేట్ గ్రంథిలో ఉండిపోయి ప్రోస్టే క్యాన్సర్ కు దారితీసే ప్రమాదముంది కూడా ఉంది. రోజూ శృంగారం చేస్తే స్త్రీ లలో టెస్టోస్టిరాన్ అధిక మోతాదులో విడుదల జరిగి ఎముకల సాంద్రత ను పెంచుతాయి. అలాగే అస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఇది బాగా పనిచేస్తుంది.