Eye Health : కంటి చూపు ఎంత ముఖ్యమైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అవి చేసే మేలు అలాంటిది. అయితే.. అలాంటి కళ్లను మనం జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. కళ్లకు కొన్ని విటమిన్ల సమతుల్యత చాలా అవసరం. వాటిని మనం తీసుకోవాలి. అలా తీసుకుంటే మన కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ మనలో విటమిన్-బీ12, విటమిన్-ఏ తగినంత తీసుకోకపోతే చాలా ప్రమాధం పొంచి ఉంటుంది. దీంతో మన కంటిచూపు మందగించే అవకాశం ఉంది. అలాగే కంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. దీంతో కొన్ని సార్లు పూర్తిగా కంటి చూపును కోల్పోయే ప్రమాధం కూడా ఉంది.
మనం పండ్లు, ఆకుకూరలను ఎక్కువగా తినాలి. దీంతో మన కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. పండ్లు, ఆకుకూరలతో పాటు విటమిన్ సప్లిమెంట్లను కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాంటి సప్లిమెంట్ల గురించి మీకోసం కొంత సమాచారం..
విటమిన్ ఏః విటమిన్ ఏ కంటి ముందు భాగమైన కార్నియాకు, వెనుక భాగం అయిన రెటీనాకు మేలు చేస్తుంది. విటమిన్ ఏ ఎక్కువగా అందాలంటే.. చిలకడదుంపలు, గుమ్మడికాయ, క్యారెట్లు, వెన్న, గుడ్లు ను ఎక్కువగా తినాలి. మనం తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ లేకపోతే కార్నియా, రెటీనాలకు హాని జరుగుతుంది.
అలాగే విటమిన్ బీ ను అందించే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఈ విటమిన్ లోపం వలన ఆప్టిక్ నరాల సమస్యలు వస్తాయి. విటమిన్ బీ ఎక్కకువగా దొరకాలంటే.. పల్లీలు, చికెన్, చిక్కుళ్లు, ఓట్స్, పాలకూర, నారింజను తినాలి.అలాగే విటమిన్ నీ, విటమిన్ ఈ ఎక్కువగా ఉండే ఆహారాన్ని కూడా తీసుకోవాలి. దీంతో మన కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.