Halwa: కొబ్బరి లో మన శరీరానికి అవసరమైన పోషకాలు అన్ని ఉన్నాయి. కాబట్టి కొబ్బరిని ఆహారం లో తీసుకోవడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో కూడా ఎలాంటి సందేహం లేకుండా దీన్ని తినవచ్చు. రోజువారీ ఆహారంలో కొబ్బరి చేర్చుకుంటే, ఆరోగ్యంగా ఉంటారని తెలియచేస్తున్నారు. కొబ్బరిలో కొలెస్ట్రాల్ అనేవి ఉండవు . కొబ్బరి తింటే గుండె జబ్బులకు కారణం అవుతుంది అనేది కేవలం అపోహ మాత్రమే. కొబ్బరి లో ఎన్నో రకాల ప్రోటీన్లు ఉండడం తో పాటు పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరగడాన్నీ తగ్గించి షుగర్ ను అడ్డుకుంటుంది .
కొబ్బరి శరీరానికి తగినంత శక్తి ఇవ్వడం తో పాటు , అవయవాలు చురుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది కొవ్వును తగ్గిస్తూ జీర్ణవ్యవస్థను చురుగ్గా ఉండేలా చేస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది తినడం చాలా ఉపయోగం.
శరీరంలో ఉండే నీటి శాతం కోల్పోకుండా కొబ్బరి చేస్తుంది. శరీరానికి హాని చేసే కొవ్వు ను బయటకుపోయేలా చేస్తుంది. పచ్చి కొబ్బరి లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి గుండెకు చాలా మేలు కలిగేలా చేస్తాయి . దెబ్బతిన్న కణాల ను తిరిగి పెరిగే విధంగా చేయడంలో ముందుంటాయి.
కొబ్బరి లో సంవృద్ధిగా విటమిన్ ఎ,బి,సి, థయామిన్, నియాసిన్,రైబోఫ్లెవిన్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఇనుము లభిస్తాయి. క్రమం తప్పకుండా కొబ్బరి ని ఆహారంలో తీసుకునే వారికి థైరాయిడ్ మలబద్ధకం, సమస్య అంతగా ఇబ్బంది పెట్టావ్ .
ఈ సారి మాత్రం కొబ్బరి హల్వా చేసి చూడండి.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.
అయితే ఈ కొబ్బరి హల్వా చేయడం చాలా తేలిక త్వరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు కొబ్బరి హల్వా కి కావలసిన పదార్థాలు తెలుసుకుందాం.
1 -కప్పు బెల్లం
4-టేబుల్ స్పూన్లు నెయ్యి
4- స్పూన్స్ నీళ్ళు
½-టీ స్పూన్ యాలక పొడి
2 కప్పుల పచ్చి కొబ్బరి
5- జీడిపప్పు పలుకులు
తరిగిన బెల్లం, తురుముకున్న పచ్చికొబ్బరి ఈ రెండిటిని కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ లో మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఇది కొంచెం గట్టిగా ఉండాలి. మరి జారుగా ఉండకూడదు.అడుగు మందంగా ఉన్న మూకుడు తీసుకుని అందులో లో నెయ్యి వేసి కరిగించి జీడిపప్పు ఎర్రగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నెయ్యి లో మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని గరిటెతో కలుపుతూ ఉంటే 20-25 నిమిషాలకు హల్వాలా దగ్గరకు అవుతుంది.కానీ తీగ పాకం మాత్రం రానివ్వకూడదు. ఇప్పుడు ఇంకో స్పూన్ నెయ్యి వేసి యాలకల పొడి , జీడిపప్పు వేసుకుని కలుపుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.అంతే రుచికరమైన కొబ్బరి హల్వా రెడీ గా మీ ముందు ఉంటుంది.