ట్రెండింగ్ హెల్త్

Dry Fruits: డ్రైఫ్రూట్స్ లడ్డు ఇలా తయరు చేసుకుని తింటే 100కి పైగా లాభాలు..

Share

Dry Fruits: డ్రైఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి మంచిది అని అందరికీ తెలిసిందే.. ఇందులో మన శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి.. నేరుగా వీటిని తినడానికి కొంత మంది ఇష్టపడరు.. ఇలా డ్రైఫ్రూట్స్ లడ్డు తయారు చేసుకుని తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు ప్రోటీన్స్ అందుతాయి…

Health Benefits Of Dry Fruits: laddu Preparation
Health Benefits Of Dry Fruits: Laddu Preparation

డ్రైఫ్రూట్స్ లడ్డు తయారీకి కావలసిన పదార్ధాలు..

జీడి పప్పు -ఒక కప్పు, బాదం పప్పు – అర కప్పు, కర్బూజా గింజలు – పావు కప్పు, గుమ్మడి గింజలు -పావు కప్పు, ఎండు ఖర్జూరం – పావుకప్పు, బెల్లంతురుము -ఒకటిన్నర కప్పు, ఎండు కొబ్బరి పొడి – ఒకటిన్నర కప్పు, ఎండు ద్రాక్ష – రెండు టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – ఒక టీ స్పూన్, నెయ్యి – ఒక చెంచా నీళ్లు – ముప్పావు కప్పు.

Health Benefits Of Dry Fruits: laddu Preparation
Health Benefits Of Dry Fruits: laddu Preparation

ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష , కర్బూజా గింజలు, గుమ్మడి గింజలు ఇలా వీటన్నింటిని ఒకదాని తర్వాత ఒకటి వేయించి పక్కన పెట్టుకోవాలి. చివరగా కొబ్బరి పొడి కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వీటన్నింటినీ మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో బెల్లం తురుము నీటిని వేసి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి. ఈ లడ్డు తయారీ కి ఎటువంటి బెల్లం పాకం అవసరం లేదు. అలా బెల్లం నీరు మరిగిన తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడిని వేసుకోవాలి. చివర్లో యాలకుల పొడి వేసి ఆఫ్ చేయలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న లడ్డూలు 10 రోజుల పాటు నిల్వ ఉంటాయి. రోజుకు ఒకటి చొప్పున ఈ లడ్డూలను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చర్మం నిగారింపు సంతరించుకునేలా చేస్తుంది.


Share

Related posts

Job  Notification  : అర్జెంట్ గా అకౌంటంట్ కావాలి – నెలకి ముప్పై వేల జీతం – ఇలా అప్లయ్ చేసుకోండి.

bharani jella

క్యాష్ ప్రోగ్రామ్ లో కలర్ ఫోటో టీమ్ సందడి.. మరోసారి సినిమా చూపించారు

Varun G

Intinti Gruhalakshmi: లాస్యని ఎదురించి ఇంటర్వ్యూ కి వెళ్లిన నందుకి జాబ్ వస్తే..!? లాస్య రియాక్షన్ ఏంటి..!? శృతి ప్రగ్నెంటా..!?

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar