Paneer: కొంచెం ఆలోచించి ప్రయోగాలు చేయాలే గానీ.. అనేక రకాల సమోసాలు రుచి చూడవచ్చు.బీట్రూట్ సమోసా, క్యారెట్ సమోసా, మష్రూమ్ సమోసా, గోబీ సమోసా ఇలా అందులో పెట్టె ఫిల్లింగ్ ఒక్కటే మారుతుంది. రుచి మాత్రం దేనికి అదే స్పెషల్ గా ఉంటుంది. చిరుధాన్యాలతో సమోసా: పావుకిలో పెసలు,పావు కప్పు:రాజ్మా,పావు కప్పు: సెనగలు, పావు కప్పు: మినుములు ,పావు కప్పు:బొబ్బర్లు,పావు కప్పు:పచ్చి బఠాణీ గరంమసాలా టేబుల్ స్పూన్, నిమ్మరసం, కొద్దిగా, ఉల్లిపాయలు: రెండు, పచ్చిమిర్చి: ఐదు, అల్లం వెల్లుల్లి ముద్ద: అర టీ స్పూన్, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా..
పెసలు, రాజ్మా, సెనగలు, మినుములు, బొబ్బర్లు, పచ్చి బఠాణీలు అన్నీ ఉడికించుకుని పెట్టుకోవాలి . తరువాత బాణలిని స్టవ్పైపెట్టి రెండు చెంచాలు నూనె పోయాలి. నూనె వేగాక ఉల్లిపాయ ముక్కల్ని వేసి రెండు నిముషాలు వేయించి అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి మరికాసేపు వేపాలి . తర్వాత ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్న అన్ని రకాల పప్పులు వేసి ఉప్పు, గరం మసాలా కూడా వేయాలి . తరువాత దీనిలో కాస్త నిమ్మరసం కలపాలి. ఇది సమోసాలో నింపి వేపుకోవాలి.
కార్న్ పనీర్ సమోసా
ఉడికించిన స్వీట్‌కార్న్ అరకప్పు -, తరిగిన పనీర్ అర కప్పు, మీడియం సైజు ఉల్లిపాయ, పచ్చిమిర్చి-3, కొత్తిమీర- తరుగు కొంచెం , ప్రాసెస్డ్ ఛీజ్- అర కప్పు, రెడ్‌చిల్లీ ఫ్లేక్స్- మూడు టేబుల్ స్పూన్లు, ఒక గిన్నె తీసుకొని అందులో తరిగిన పనీర్ ,కార్న్, ఉల్లిపాయ, కాప్సికమ్, ప్రాసెస్డ్ ఛీజ్ , కొత్తిమీర,వేసి బాగా కలపాలి. చివరలో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు వేసి మరొకసారి కలపాలి. ఇప్పుడు దీన్ని సమోసా లో ఫిల్ చేస్తే రుచిగా ఉండే కార్న్ పన్నీర్ సమోసా రెడీ.