చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. పెళ్లి అయ్యి ఎన్నో ఏళ్ళు అయినాగాని కొందరు మాత్రం పిల్లలు పుట్టకపోవడంతో తీవ్ర నిరాశకు గురి అవుతున్నారు. అయితే కొందరు మాత్రం పిల్లలు పుట్టకపోవడానికి ఆడవాళ్ళలోనే లోపం ఉండి ఉంటుంది అనే భ్రమలో ఉంటారు.. నిజానికి సంతానలేమి సమస్య అనేది స్త్రీ, పురుషులలో ఇద్దరిలోనూ ఉంటుంది.మరి సంతానలేమి. సమస్యకు కారణాలు ఏంటో తెలుసుకుందామా.
ఒత్తిడి, ఆందోళన:
సంతాన లేమి సమస్యకు ముఖ్య కారణం ఒత్తిడి. సంతానలేమిని నిరోధించడానికి మీరు ఒత్తిడి నుండి బయట పడాలి.అలాగే పిల్లల కోసం ట్రై చేసే దంపతులిద్దరు ఆరోగ్యకరంగా ఉండటం చాలా అవసరం. ఆరోగ్యకరమైన తాజా పండ్లు మరియు కూరగాయలు తీసుకోవడం వల్ల సంతానలేమిని నిరోధించవచ్చు.
మధ్య సేవించడం, పొగ త్రాగడం :
మద్యపానం, సిగరెట్ మరియు కొన్ని హానికర పదార్థాలు తీసుకోవడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది. అలాగే మహిళల్లో అండం విడుదలలో కూడా సమస్యలు తలెత్తుతాయి.అందుకే చెడు అలవాట్లకు దూరంగా ఉండటం ఉత్తమమైన మార్గం.
గర్భనిరోధక మాత్రలు :
గర్భనిరోధక మాత్రల వినియోగం కూడా ఒక్కోసారి సంతానలేమి సమస్యకు కారణం అవుతాయి. ఒక్కోసారి వీటి వలన ప్రెగ్నన్సీ రావడం ఆలస్యం అవుతుంది అలాగే కొంత మంది స్త్రీలు పూర్తిగా ఉండాల్సిన బరువుకంటే అతి తక్కువగా ఉండటం, లేదంటే మరింత ఎక్కువగా ఉండడం వల్ల కూడా గర్భం పొందడం కష్టం అవుతుంది. గర్భసంచిలో నీటి బుడగలు ఉన్నాగాని,సరైన ఆహారం, సరైన సమయంలో తీసుకోకపోవడం వల్ల కూడా సంతానోత్పత్తి సమస్యలు వస్తాయి.