NewsOrbit
న్యూస్ హెల్త్

Azoospermia: అజూస్పెర్మియా అంటే ఏమిటి? మగ వంధ్యత్వం తగ్గించే ఈ ఆహారాలతో అజూస్పెర్మియా కి చెక్ పెట్టండి..

Men suffering Azoospermia to check with these diet and foods

Azoospermia: మనదేశంలో చాలామంది పురుషులు 100త్వ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇది అనేక కారణాల వల్ల కావచ్చు.. అందులో ఒక కారణం అజోస్పెరియా.. మీరు మీ భాగస్వామితో పిల్లలను కనడానికి ప్రయత్నిస్తున్న విఫలం చెందితే మాత్రం ఖచ్చితంగా ఈ సమస్య మీకు ఒక కారణం కావచ్చు.. వీర్యంలో స్పెర్మ్ పొందని పురుషుల్లో ఉందని అజోస్పెరియా అర్థం.. ఈ సమస్య మొత్తం పురుషులలో ఒక శాతం మంది పురుషులలో మాత్రమే ఉంటుంది. సంతానం లేని పురుషులలో 15 శాతం మందిలో ఈ సమస్య ఉండవచ్చు. అజోస్పెరియా ఉన్న వారిలో ఎలాంటి లక్షణాలు ఉండవు..

Men suffering Azoospermia to check with these diet and foods
Men suffering Azoospermia to check with these diet and foods

గర్భం రాకపోతే అజోస్పెరియా ఉందని అనుమనించవచ్చు. డాక్టర్స్ కూడా వీర్యాన్ని పరీక్షించిన తరువాతే అజోస్పెరియా ఉందో లేదో నిర్దారణ చేస్తారు.. ఈ సమస్య ఉన్నప్పుడు మైక్రోసర్జికల్ చికిత్సలను ఉపయోగించి అడ్డంకులను సరి చేయవచ్చు. నేడు ఆధునిక పద్ధతులు , చికిత్సలతో ఈ సమస్యకు త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సమస్యతో బాధపడుతున్న వారు వైద్యుల్ని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఆరోగ్యకరమైన గర్భం దాల్చడానికి మీ డైట్ లో కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి..

అజోస్పెరియా కి తీసుకోవాల్సిన ఆహారాలు..
బచ్చలి కూర
వెల్లుల్లి
రెడ్ మీట్
గుమ్మడి గింజలు
వాల్నట్స్
అరటిపండు
ఆస్పరగాస్
డార్క్ చాక్లెట్
ఓయ్స్టర్స్
పుచ్చకాయ
దానిమ్మకాయ
మునక్కాయ
గుడ్డు

గుడ్లు:
కోడిగుడ్డులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది స్పెర్మ్ కౌంట్ పెంచడానికి ఆరోగ్యకరమైన ఎంపిక. గుడ్లు కూడా స్పెర్మ్‌ను ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడతాయి. అంతేకాకుండా చలనశీలతను మెరుగుపరుస్తాయి. గుడ్డు బలమైన, ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తి తోపాటు సంతానోత్పత్తిని మెరుగుపరుస్తాయి.

బచ్చలికూర: ఆకు కూరలలో ఫోలిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. బచ్చలికూర మీ ఆహారంలో తీసుకుంటే.. ఇందులో ఉండే ఫోలిక్ ఆమ్లం యొక్క అధిక స్థాయి వీర్యం లో అసాధారణ స్పెర్మ్ల సంఖ్యను కూడా తగ్గిస్తుంది.. తద్వారా స్పెర్మ్ గుడ్డులోకి విజయవంతంగా చొచ్చుకుపోయే అవకాశాలు ఉంటాయి.

అరటి పండు
అరటి పండులోని విటమిన్ ఎ, బి 1, సి ఉంటాయి. ఇవి బలమైన స్పెర్మ్ కణాల తయారీకి సహాయపడతాయి. స్పెర్మ్ కౌంట్ కూడా ఈ విటమిన్ల మీద ఆధారపడి ఉంటుంది. బ్రోమెలైన్ అని పిలువబడే అరుదైన ఎంజైమ్ మంటను నివారిస్తుంది. స్పెర్మ్ నాణ్యతను అధికంగా పెంచుతుంది.

మాకా రూట్స్
మాకా మూలాలు స్పెర్మ్ కౌంట్, సంతానోత్పత్తిని పెంచుతాయి. ఈ హెర్బ్‌ తీసుకునే పురుషులు వీర్యకణాల పరిమాణాన్ని కలిగి ఉంటారు. మంచి చలనశీలత కలిగిన వీర్యకణాలను కూడా కలిగి ఉంటారు.

ఆస్పరాగస్:
ఆస్పరాగస్ అనేది ఒక కూరగాయ. ఇందులో ఉండే విటమిన్ సి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. అలాగే వృషణ కణాలను రక్షిస్తుంది. పురుషులలో సెర్మ్ కౌంటును పెంచుతుంది.

డార్క్ చాక్లెట్:
డార్క్ చాక్లెట్ ఎల్-అర్జినిన్ హెచ్‌సిఎల్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది అధిక స్పెర్మ్ కౌంట్ ను పెంచుతుందని పరిశోధనలలో తేలింది.

వాల్నట్:
వాళ్లలో మన శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వుతో పాటు ప్రోటీన్స్ మినరల్స్ కలగలిపిన మిశ్రమం ఉంటుంది. ఇది స్పెర్మ్ కణాల కణ త్వచం ఉత్పత్తికి ఆరోగ్యకరమైన కొవ్వు అవసరం. ఈ ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ వృషణాలకు రక్త ప్రవాహాన్ని ప్రోత్సహించడం ద్వారా స్పెర్మ్ పరిమాణాన్ని పెంచడానికి కూడా సహాయపడతాయి. వాల్‌నట్‌లోని అర్జినిన్ కంటెంట్ స్పెర్మ్ ను ఇంప్రూవ్ మెంట్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రవాహంలోని విషాన్ని తొలగించడంలో కూడా సహాయపడతాయి.

గుమ్మడికాయ గింజలు
శరీరంలో టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని మెరుగుపరిచే ఫైటోస్టెరాల్ ఉత్పత్తికి గుమ్మడికాయ గింజలు సహాయపడతాయి. ఇది స్పెర్మ్ కౌంట్, సంతానోత్పత్తి పెరుగుదలకు సహాయపడుతుంది. ఇంకా వీర్య పరిమాణాన్ని పెంచుతాయి.

జింక్ అధికంగా ఉండే ఆహారాలు..
స్పెర్మ్ కణాల ఉత్పత్తిలో జింక్ భారీ పాత్ర పోషిస్తుంది. బార్లీ, బీన్స్ , ఎర్ర మాంసం వంటి ఆహారాలు జింక్‌లో పుష్కలంగా ఉంటాయి. వీర్యకణాల సంఖ్య ఎక్కువగా ఉండటానికి మీ ఆహారంలో చేర్చాలి. జింక్ లోపం వల్ల స్పెర్మ్ చలనశీలత తగ్గుతుంది, సంతానోత్పత్తి తగ్గుతుంది.

అజోస్పెరియా సమస్యతో బాధపడుతున్న వారు ఇప్పుడు సూచించిన ఆహార పదార్థాలు తీసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. వైద్యులు సూచించిన ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఈ ఆహారాలు కూడా మీ డైట్ లో భాగం చేసుకుంటే త్వరగా ఈ సమస్య నుంచి బయటపడటానికి అవకాశం ఎక్కువ.

author avatar
bharani jella

Related posts

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!

PM Modi: రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోడీ కౌంటర్ ఇలా .. ‘శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది’  

sharma somaraju