హెల్త్

Plastic : ప్లాస్టిక్  చిమ్మే విషం నుండి  పర్యావరణం  తర్వాత కాపాడవచ్చు.. ముందు ఇంటిని, కాపాడుకోండి!!

Share

Plastic : వంట సామాగ్రి హానికరమైన
మన ఆరోగ్యంగా ఉండడం కోసం ఎక్కువ డీప్  ఫ్రై చెయ్యకుండా ఉన్నవి తినడం, పంచదార  వాడకం వీలైనంత  తగ్గించడం  తో పాటు మైదాని పూర్తిగా మానేయడం  వంటివి చేస్తుంటాము.  అయితే అంతవరకూ బాగానే ఉన్న  మనం వంటగదిలో వాడే సామానుల మీద  కూడా శ్రద్ద పెట్టకపోతే..  మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అదంతా  వృదాఅనే చెప్పాలి.   దీనికి కారణం  ఇప్పుడు మార్కెట్ లో లభ్యమవుతున్న  చాలా వంట సామాగ్రి హానికరమైన రసాయనాలు వాడి చేయబడినవే అని గుర్తు పెట్టుకోండి.


వేటిలో ఎలాంటి రసాయనాలు ఉన్నాయి? వాటికి  బదులుగా ఇంక వీటిని వాడవచ్చు?  ఆ విషయాలు గురించి తెలుసుకుందాం.
1. ప్లాస్టిక్  సామాన్లు – పప్పు లు, నూనెలు మరియు  పచ్చళ్ళను కూడా ప్లాస్టిక్ డబ్బాలలో నిల్వ  చేసేస్తున్నాం.  అవి   తక్కువ ధరకు బోలెడన్ని మోడల్స్ లో ఆకర్షణీయం గా  వస్తాయి.  అయితే  ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో బిపిఎ వంటి అనేక విష రసాయనాలు  ఉన్నాయి. ఇవి ఆహారంలోకి  చేరి   హార్మోన్ల అసమతుల్యత,  అధిక బరువు , సంతాన సమస్యలను కలిగిస్తాయి.  కాబట్టి వీటిని మానేసి స్టీల్ వస్తువులను వాడుకోవాలి. పచ్చళ్ళ కోసం జాడీలను,గాజు సీసాలను వాడుకోవడం ఉత్తమం.

2. మంచి నీటి కోసం   ప్లాస్టిక్   బాటిల్స్  వాడే  బదులు స్టీలు, రాగి,   గ్లాస్ బాటిల్స్  ను ఎంచుకోవాలి.

3.. ప్లాస్టిక్  లంచ్ బాక్స్ : వీటికి బదులు స్టీల్ బాక్స్ లు  వాడటం మంచిది. స్టీల్ బాక్స్ తీసుకెళ్లడం కాస్త ఇబ్బందిగా ఉన్నా  ఏమి కాదు . ఆరోగ్యాన్ని మించింది ఏది లేదు.

4. బయట నుండి  ఏవైనా తీసుకు రావడానికి ప్లాస్టిక్ బ్యాగ్స్ కి  బదులు క్లాత్ బ్యాగ్స్  ని వాడండి.

5. కూరగాయలు  కోయటానికి ప్లాస్టిక్ కటింగ్ బోర్డ్  బదులుగా   చెక్క బోర్డు  వాడండి.

6.టీ ,కాఫీ కోసం  ప్లాస్టిక్ కప్స్  బదులు  సిరామిక్ కప్స్ గాజు  కప్స్ లేదా స్టీలు కప్స్,వాడండి.

వంటగదిలో  వాడే  ప్రతీ ప్లాస్టిక్ వస్తువుకి  బదులుగా మట్టి,సిరామిక్, స్టీల్, ఇనుము,   గ్లాస్  ని వాడుకోవచ్చు. ఈ రోజుల్లో ఆన్లైన్ లో ప్రతిదీ అందుబాటులో ఉంటుంది.ఇంకా ఎందుకు ఆలస్యం మార్చేసి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి.


Share

Related posts

Cooking Oils : మనం రోజువారీ వాడే వంట నూనెల గురించి మీకు ఈ విషయాలు తెలుసా ??

Kumar

Lungs: ఊపిరితిత్తుల సమస్యలకు ఈ అద్భుతమైన చిట్కా తో చెక్ పెట్టండి..!! 

bharani jella

Hypothyroidism: మీ చేతులను బట్టి థైరాయిడ్ ఉందో లేదో గుర్తించండి..!?

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar