hair: జుట్టును బాగా పెరిగేలా చేసే వాటిలో ముందు ఉండేది బ్రింగ్రాజ్ తైలం. జుట్టు సమస్యలు తగ్గించడం తో పాటు జుట్టుకు బలం ఇస్తుంది. జుట్టు చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును తగ్గిస్తుంది. చుండ్రు సమస్య లేకుండా చేస్తుంది. బ్యాక్టీరియా, ఫంగస్ పూర్తిగా నిర్ములించడం లో బ్రింగ్రాజ్ బాగా పనిచేస్తుంది అని కొన్ని పరిశోధనలో కూడా తేలింది.
జుట్టుకు వచ్చే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది. జుట్టు రాలకుండా ఉండాలన్న , కొత్త జుట్టు పెరగాలి అన్న కుదుళ్లు బలంగా ఉండాలి.అందుకోసం బ్రింగ్రాజ్ సరైన తైలం అని చెప్పక తప్పదు.ఈ నూనెలో విటమిన్ E ఉండడం వలన ఇది జుట్టును పాడు చేసే విష వ్యర్థాలను నాశనం చేస్తుంది. బ్రింగ్ రాజ్ నూనెను తలకు రాసుకుని, వేళ్ళతో మసాజ్ చేసుకొని ఓ గంట తర్వాత షాంపూతో తలస్నానం చేసేయాలి . ఇలా వారానికి 2 లేదా 3 సార్లు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.ఇప్పుడిప్పుడే జుట్టు తెల్ల బడుతూ ఉంటే కనుక వెంటనే బ్రింగ్రాజ్ వాడటం మొదలుపెట్టండి. ఎందుకంటే ఇది వాడితే జుట్టు త్వరగా తెల్లబడదు. ఎందుకంటే ఇది జుట్టుకు అవసరమైనంత మెలనిన్ ఇస్తూ జుట్టు నల్లగా ఉండేలా చేస్తుంది.
కొంత మందిలో చుండ్రు సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. అది పోగొట్టుకోవడం కోసం రకరకాల షాంపూలు వాడి సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకనుండి వాటి బదులు బ్రింగ్రాజ్ తైలం రోజూ వాడేలా జాగ్రత్త పడండి . ఈ నూనెను రోజు వాడుతూ అంతగా ఘాడత లేని షాంపూలు తలస్నానానికి వాడితే ఇది తలలో వేడిని తగ్గించడం తో పాటు చుండ్రు, సోరియాసిస్ బాధలు లేకుండా చేస్తుంది. తలపై రక్త ప్రసరణ బాగా జరగడానికి కూడా ఇది సహాయపడుతుంది