Teeth Care: దంతధావనం (బ్రషింగ్) అనేది మన జీవనవిధానంలోని ఓ భాగం. వేకువనే లేదంటే లేటుగానో నిద్ర లేవగానే మనం సహజంగానే కాలకృత్యాలు తీర్చుకుని ముఖ్యంగా తినడానికి ముందు బ్రష్ చేసుకుంటాము. అయితే కొంతమంది మాత్రం నిద్ర లేవగానే బెడ్ టీ లేదా కాఫీ తాగుతారు. అక్కడితో ఆగకుండా బ్రేక్ ఫాస్ట్ (అల్పాహారం) కూడా కానిచ్చేస్తారు. అయితే బద్దకం కారణంగా మనం చేసే చర్యలకు ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. అవును.. కోవిడ్ కారణంగా చాలామందికి పని తక్కువై బద్దకం పెరిగిపోయింది కూడా.
Health Benefits: వేసవిలో మన శరీరం చాలా కూల్ గా ఉండాలంటే.. ఇవి తింటే చాలు ..!!
Teeth Care: అలా చేయడం వలన జరిగేది ఇదే:
ఇలాంటి చర్యల వలన తీవ్రమైన వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వలన చాలా త్వరగా నోటి దుర్వాసన సమస్య తొందరగా వచ్చేస్తుంది. దీన్నే మెడికల్ పరిభాషలో ‘హలిటోసిస్’ అని అంటారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. నోటి శుభ్రత లేకపోవడం వల్ల ఇది వస్తుంది. దంతాలను తోమకపోతే నోట్లో బాక్టీరియా పెరిగిపోతుంది. దీంతో సమస్య ఇంకా తీవ్రతరం అవుతుంది. ఇక నోట్లో బాక్టీరియాను అలాగే పెట్టుకుని ఉదయం బెడ్ టీ, కాఫీలను తాగడం కూడా అంత మంచిది కాదు.
Teeth: ఈ పండు తిన్నతర్వాత మౌత్ వాష్ చేసుకోకపోతే..! ఇక అంతే సంగతులు.. డాక్టర్ కూడా ఏమి చేయలేరు..!!
ఈ విషయాలు కూడా తెలుసుకోండి!
ఉదయం ఖచ్చితంగా దంతాలను తోముకున్న తరువాతే టీ, కాఫీ వంటివి తీసుకోవాలి. అలాగే ఉదయం, రాత్రి భోజనం తరువాత దంతాలను తోముకుంటే మరింత ఆరోగ్యంగా దంతాలను ఉంచుకోవచ్చు. అప్పుడప్పుడు ఓ చుయింగమ్ ని నోటిలో వేసుకొని నమిలితే దంతాలకు కాస్త వ్యాయామంలాగా ఉంటుంది. దంతాలు కొంచెం కసిగా వున్నాయి అనిపిస్తే, జమ ఆకులు నమిలితే మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.