NewsOrbit
హెల్త్

Vitamin E: శరీరంలో విటమిన్ ‘ఈ’ పెరగాలంటే ఇవి తినాలిసిందే.. తప్పదు..!

Vitamin E: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటూ ఉండాలి. అన్ని రకాల పోషకాలు ఉంటేనే శరీరంలోని అన్ని అవయవాల పనితీరు మెరుగ్గా ఉంటుంది.ముఖ్యంగా శరీరానికి విటమిన్స్ చాలా అవసరం.. వాటిలో విటమిన్ ఇ చాలా ప్రత్యేకం అనే చెప్పాలి. విటమిన్ E అనేది కొవ్వును కరిగించే విటమిన్. అలాగే మనలో వ్యాధినిరోధక శక్తి పెరగాలన్నా,జ్ఞాపక శక్తి పెరగాలన్న జుట్టు రాలకుండా ఉండాలన్నా,వృద్ధాప్య ఛాయలు రాకూడదు అన్నా విటమిన్ ఈ చాలా అవసరం. అందుకే ప్రతిరోజు కూడా విటమిన్ ఇ ఉండే ఆహారాన్ని తింటూ ఉండాలి. మరి విటమిన్ ఇ లభించే ఆహారాలేంటో తెలుసుకుందామా..!

These must be eaten to increase vitamin E
These must be eaten to increase vitamin E

విటమిన్ ఇ దొరికే ఆహార పదార్ధాలు ఇవే:

మన అందరికి పొద్దు తిరుగుడు పువ్వులు గురించి తెలిసే ఉంటుంది. ఈ పొద్దు తిరుగుడు పువ్వులలో విటమిన్ ఇ అనేది పుష్కలంగా ఉంటుంది. ప్రతి ఈ పొద్దు తిరుగుడు పువ్వుల గింజలను విడిగా తినవచ్చు లేదంటే నూనె రూపంలో కూడా వంటలలో వాడవచ్చు.అలాగే ప్రతిరోజు రాత్రి పూట ఏడు లేదంటే పది బాదం పప్పులను నీళ్లలో నానబెట్టుకుని పొద్దునే తినటం వల్ల విటమిన్ ఇ శరీరానికి లభిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బాదం పప్పులను తినటం వల్ల చర్మం ముడతలు పడవు. అలాగే వృద్ధాప్య ఛాయలు అనేవి కూడా కనిపించకుండా చర్మం కాంతివంతంగా మారుతుంది.

These must be eaten to increase vitamin E
These must be eaten to increase vitamin E

ఆకుకూరల్లో నిజంగానే విటమిన్ ఇ ఉంటుందా..?

ఇంకా ఆకు కూరల గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు.ఎందుకంటే ఈ ఆకు కూరల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.మరి ముఖ్యంగా పాలకూరలో విటమిన్ ఇ ఎక్కువగా లభిస్తుంది. అందుకే వారానికి రెండు సార్లు పాలకూర తింటే విటమిన్ ఇ లభిస్తుంది.
మనం వంట చేయడానికి ఏ నూనె పడితే ఆ నూనె వాడడం మంచిది కాదు. విటమిన్ ఇ అధికంగా ఉండే వెజిటేబుల్ అయిల్స్ వాడాలి. ఉదాహరణకు విటమిన్ ఇ అధికంగా ఉండే పొద్దు తిరుగుడు నూనె, ఆలివ్ నూనె, కనోలా అయిల్ వంటి నూనెలు వంటల్లో ఊయోగించాలి.అలాగే సముద్రం నుండి లభించే ఆహారపదార్థాల నుంచి కూడా విటమిన్ ఇ అధికంగా ఉంటుంది.

.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri