Child Care: పిల్లల మలబద్ధకాన్ని తగ్గించే ఇంటి చిట్కాలు
పురాతనమైన నివారణ మలబద్ధకానికి బెల్లం ఒక పురాతనమైన నివారణ మార్గం అని చెప్పవచ్చు. బెల్లం వలన జీర్ణవ్యవస్థ (digestion ) బాగా పని చేస్తుంది. బెల్లం శరీరంలోని జీర్ణ ఎంజైములను సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. ప్రేగుల కదలికలను మెరుగయేలా చేసి మలబద్ధకానికి ఉపశమనం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.
మలబద్దకానికి నీరు చాలా మంచి ఉపశమనం అని చెప్పవచ్చు. ఒక అర కప్పు ఆర్ వో నీటిలో, ఒక స్పూన్ పంచదార కలిపి ఆ నీటిని మీ పిల్లలకు ఇవ్వండి. మీ పిల్లలు మలబద్ధకంతో ఇబ్బంది పడుతుంటే,వేపుడు పదార్థాల కానీ ఎక్కువ మసాలాలు ఉన్న ఆహారం కానీ ఇవ్వకూడదు. బిస్కెట్స్ తో పాటు మైదా కారమైన చిప్స్ ని కూడా పిల్లలకు అస్సలు పెట్టకూడదు.ఇవి మల బద్దకాన్ని ఎక్కువయేలా చేస్తాయి.
Child Care: నీటిని ఎక్కువగా
మలబద్ధకం సమస్య ఉన్నప్పుడు నీటిని ( water ) ఎక్కువగా తీసుకోవడం తో పాటు సూప్ లు, జ్యూస్లు, వంటి ద్రవాలు ఎక్కుగా ఇస్తుండాలి . ఎక్కువ నీరు తిరుకోవడానికి మీ పిల్లలు ఇష్టపడకపోతే, ఇంట్లో తయారు చేసుకున్న పల్చటి మజ్జిగ, బార్లీ నీరు రాగించడం మలబద్దకానికి మంచి నివారణ. కనుక ఎక్కువ నీటి శాతం ఉండే కీర,టమాటా , క్యారెట్ , వంటి కాయగూరలను కూడా ఎక్కువగా పెట్టవచ్చు.
పిల్లలకు రాత్రిపూట ఎండు ద్రాక్షను నానబెట్టి కూడా పెట్టవచ్చు. కానీ వాటిని తగుమాత్రం గా ఇవ్వాలి అని గుర్తు పెట్టుకోండి. విరోచనాల మందు లో ఉండే లక్షణాలు తేనెలో కూడా సంవృద్ధిగా ఉంటాయి. మలబద్ధకం ఉన్నప్పుడు రోజుకి రెండు స్పూన్స్ తేనే ఇస్తుండాలి. మలబద్ధకాన్ని నివారించడం లో అరటి పండు బాగా పనిచేస్తుంది. అయితే ఆకుపచ్చ అరటిపండు మాత్రమే పెట్టాలి. పసుపు పచ్చ అరటి పండు పెట్టడం వలన మలబద్దకం బాగా పెరిగే అవకాశం ఉంది.