అందమైన ముఖం కోసం బొగ్గు ని ఇలా వాడండి!!

Share

బొగ్గు  ను అందం కోసం వాడతారు అని  చాలా మందికి తెలియదు..వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం…  అసలు బొగ్గును చూస్తేనే చాలా  మందికి చిరాకుగా అనిపిస్తుంది. కానీ దానితో మంచి ప్రయోజనాలు చాలా ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం.    బొగ్గు ను ముఖానికి పూస్తే కలర్  వస్తుంది అని చాలా మందికి తెలియదు.

ఇంటి వద్ద దొరికే బొగ్గుతో ఫేస్‌క్రీమ్‌ తయారు  చేసుకోవచ్చు.  అది ఎలాగో తెలుసుకుందాం. బొగ్గును నీటితో మెత్తగా నూరి,   ముఖానికి పూసి, కొంత సేపు తర్వాత శుభ్రం  చేసుకోవాలి. ఇలా   ఒక వారం పాటు    చేయడం వల్ల నెమ్మదిగా చర్మ సౌందర్యం  పెరుగుతుంది.ఈ రోజుల్లో కాలుష్యం లో ఉండే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు.  వారికీ  ముఖంపై ఉండే రంధ్రాలు మరింత పెద్దగా కనబడుతుంటాయి. కాబట్టి వాళ్ళు ఫేస్‌మాస్క్‌లో కొంచెం బొగ్గుపొడిని వాడితే, అది మృతకణాలను పోగొట్టి, మురికి బయటకు వచ్చేలా చేస్తుంది.  దీనితో పాటు… పళ్ళు పచ్చగా  ఉన్నవారు  కాస్త  బొగ్గు పొడి తీసుకుని, దాని లో తగినంత  వంటసోడా కలిపి ఈ  పొడి తో వారానికోసారి పళ్ళు తోముకుంటే…పళ్ళు ముత్యాల్లా  మెరుస్తాయి అంటున్నారు.


వేసవి కాలం  లో  జిడ్డు చర్మం  చాలా మందిని బాగా  ఇబ్బంది పెడుతుంది. ఇందుకోసం ఎన్నో క్రీములు వాడుతూ, డాక్టర్స్ ని సంప్రదిస్తూ, పార్లర్ల చుట్టూ తెగ తిరుగుతుంటారు. అయితే  ఇలాంటివారు బొగ్గు మాస్క్‌ను వాడడం వలన చర్మం నుంచి అతిగా నూనెలు  రావడం   తగ్గిపోతాయి. ఇలా చేస్తే మాత్రం  చర్మం మృదువుగా కనిపిస్తోందని తెలియచేస్తున్నారు. బొగ్గును వాడడం వలన చర్మం నుండి ఎక్కువగా ఉత్పత్తి అయ్యే నూనెలు తగ్గడం తో పాటు సహజ నూనెలు కోల్పోకుండా ఉంటుంది  అని తెలియచేస్తున్నారు.


Share

Related posts

Diabetes : చిన్న చిన్న లక్షణాలతో మీకు షుగర్ ఉందా లేదా చెప్పేయచ్చు !

Kumar

cooking items: మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉన్న ఈ వంట పాత్రలను మీరు కూడా వాడుతున్నారా?? (పార్ట్ -1)

siddhu

Angioplasty: ఆంజియోప్లాస్టీ ఆపరేషన్  తర్వాత  శృంగారం  చేయటానికి ఈ  సూచనలు పాటించండి!!

siddhu