Bread: వర్క్ బిజీ వలన సమయం లేక చేసుకోవడం తెలియక అని ఈ మధ్య కాలంలో చాలామంది బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ తినడానికి అలవాటు పడుతున్నారు. ఈ పద్దతిని ఎంత త్వరగా మార్చుకుంటే అంత మంచిది.మనం ఆరోగ్యం గా ఉండాలన్న రోజంతా ఉత్సహం గా ఉండాలంటే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తినకుండా ఉండకూడదు. తేలికగా అయిపోతుంది కదా.. అని ప్రతిరోజూ మార్నింగ్ టైం అరటిపండు, బ్రెడ్, కోడిగుడ్డు వీటిని ప్రతి రోజూ తింటూ ఉంటారు. కానీ వీటినే రోజూ తీసుకోవడం అనేది చాలా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు.
బ్రెడ్లోపొటాషియం అయోడేట్ అధిక పొటాషియం బ్రోమేట్, ఉంటుంది, ఇది శరీరానికి చాలా ప్రమాదకరం. మంచి రుచిగా ఉండే బ్రెడ్ తో శరీరానికి ఎంత ప్రమాదం ఉందో కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది .. అల్పాహారం గా బ్రెడ్ తినే అలవాటు ఎంత త్వరగా మార్చుకుంటే, ఆరోగ్యానికి అంత మంచిది.
బ్రేక్ ఫాస్ట్ అంటే బటర్ టోస్ట్, శాండ్విచ్లు, ఫ్రెంచ్ టోస్ట్. అన్నట్లుగా ఉంది పరిస్థితి. బ్రెడ్ తయారు చేసే క్రమంలో అనేక రకాల పోషకాలను తొలగిస్తారు. బ్రెడ్ ని తయారు చేయడానికి వాడే పిండి కి ఒక రుచి ఉంటుంది అది ఉండటం వలన బ్రెడ్ రుచి అసలు బాగోదు. ఆ దుర్వాసన పోగొట్టడానికి వివిధ రుచులు కలుగుతుండటం వలన ఇది ఆరోగ్యానికి హానికరం.వైట్ బ్రెడ్ ని బ్లీచింగ్ కూడా చేస్తారు. ఇది శరీరానికి తీవ్ర ప్రమాదాన్ని తీసుకువస్తుంది. ఈ బ్రెడ్ ఆహారంగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ పెరుగుతుంది.
ప్రతిరోజూ బ్రెడ్ తినడం వల్ల కార్బన్ డయాక్సైడ్, బ్రోమిన్ వంటి విష పదార్థాలు శరీరంలో పేరుకుని ఉండి పోతాయి . ఇలా ఉండటం అనేది భయంకరమైన వ్యాధులకు కారణం అవుతుంది. బ్రెడ్ లో ఉండే అధికమైన ఉప్పు మరియు సోడియం ఆరోగ్యం దెబ్బ తినేలా చేస్తాయి. వీటిలో ఉండే షుగర్ కారణంగా అధిక బరువు సమస్య కూడా వస్తుంది.