NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope మార్చి-24- పాల్గుణ మాసం – బుధవారం.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope మార్చి-24- పాల్గుణ మాసం – బుధవారం.

మేష రాశి :Today Horoscope మార్చి-24- పాల్గుణ మాసం – బుధవారం. ప్రయాణాలు అనుకూలిస్తాయి !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహనాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు, ఉన్నత కళాశాలల్లో ప్రవేశాలు పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పని భారం తగ్గించుకుంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. పెట్టుబడులు పెడతారు. స్త్రీలు కుటుంబ బాధ్యతలను పెంచుకుంటారు.
రెమిడీః అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృషభ రాశి :Today Horoscope మార్చి-24- పాల్గుణ మాసం – బుధవారం.  సమస్యలు ఎదురవుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. మీలో ఉన్న రహస్యాలను బయటకి చెప్పడం వల్ల అనుకోని సమస్యలు ఎదురవుతాయి. మీలో ఉన్న మొండి పట్టుదల వల్ల మీకు సహాయం చేసేవారు దూరమవుతారు. అనవసర ఖర్చులు అధికమవుతాయి. రుణ బాధలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు. విద్యార్థులు స్నేహితుల వల్ల చదువున్ని అశ్రద్ధ చేస్తారు. కార్యాలయాల్లో పని భారం పెరుగుతుంది.
రెమిడీః శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

మిధున రాశి : ప్రమాదాల నుంచి బయట పడతారు !

ఈ రోజు బాగుంటుంది. మీలో ఉన్న కోరికలను, ఇష్టాయిష్టాలను నెరవేర్చుకుంటారు. అన్ని రకాల సమస్యలను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంటారు. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. తెలివిగా, సమయస్ఫూర్తిగా ఇతరులతో పని చేయించుకుంటారు. కొన్ని రకాల ప్రమాదాల నుంచి బయట పడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఆయన వారితో సఖ్యతగా ఉంటారు.
రెమిడీః ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి : కుటుంబంలో సమస్యలు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. మితమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. కార్యాలయాల్లో అనుకోని ఇబ్బందులు. విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు.
రెమిడీః శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.
Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

సింహరాశి : పుట్టింటి నుంచి శుభవార్తలు !

ఈరోజు ఆనందకరంగా వుంటుంది. చేపట్టిన ప్రతి పనిని సంతోషంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. రుణబాధలు తగ్గిపోతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన లాభం కలుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు. విలువైన వస్తు, వాహనాలను కొనుగోలు చేస్తారు.
రెమిడీః శ్రీ లలితా అష్టోత్తర శత నామ స్తోత్రం పారాయణ చేసుకోండి.

కన్యారాశి : అనవసరపు ఖర్చులు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. తప్పు చేసిన వ్యక్తులను ప్రోత్సహించడం వల్ల నష్టపోతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం వల్ల ఇబ్బందులు. అనవసరపు ఖర్చులు ఎక్కువ అవుతాయి. సమయానికి చేతికి డబ్బులు అందక ధననష్టం కలుగుతుంది. ఇష్టపడేవారు దూరమవుతారు. ఆచార సంప్రదాయాలను మరచిపోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ కోల్పోతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

తులారాశి : మిత్ర లాభం !

ఈరోజు బాగుంటుంది. విద్యార్థులు నూతన విద్యావకాశాలను అందుకుంటారు. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ముఖ్యమైన విషయాల్లో స్నేహితుల సహకారం పొందుతారు. మిత్ర లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఇంక్రిమెంట్లు పొందుతారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. గతంలో ఉన్న అనారోగ్యాన్ని తొలగించుకుని ఆరోగ్యంగా ఉంటారు. స్త్రీలు కుటుంబ బాధ్యతలను పెంచుకుంటారు.
రెమిడీః శ్రీ భ్రమరాంబిక అమ్మవారిని ఆరాధించండి.

వృశ్చిక రాశి : ప్రశాంతత కోల్పోతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. ఓర్పు సహనం లేకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలను కోల్పోతారు. ప్రశాంతత కోల్పోతారు. విద్యార్థులు చదువు విషయంలో ఆశ్రద్ధ చూపుతారు. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం వల్ల నష్టం కలుగుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.
రెమిడీః దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి : నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు !

ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. పెద్ద వారిని గౌరవించడం వల్ల, వారి మాటలను సూచనలు పాటించడం వల్ల అనేకరకాల ఇబ్బందుల నుంచి బయట పడతారు. విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. క్రొత్త క్రొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు.
రెమిడీః కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకర రాశి : రుణ బాధలు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. వ్యాపారాల్లో నష్టాలు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అనుకోని ఇబ్బందులకు గురవుతారు. విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోని చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. కుటుంబంలో సమస్యలు అధికమవుతాయి. రుణ బాధలు పెరుగుతాయి. సమయానికి చేతికి డబ్బులు లేకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. విలువైన పత్రాల మీద సంతకాలు చేయడం వల నష్టపోతారు.
రెమిడీః ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

కుంభరాశి : ఆధ్యాత్మిక చింతన !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గొప్ప హోదాలను పొందుతారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. రుణబాధలు తగ్గిపోతాయి. ధన లాభం కలుగుతుంది.
రెమిడీః ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

మీన రాశి : పనిభారం పెరుగుతుంది !

ఈరోజు సంతోషకరంగా లేదు. వ్యాపారాల్లో వచ్చిన అవకాశాలను వదులుకోవడం వల్ల నష్టపోతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పనిభారం పెరుగుతుంది. ప్రశాంతత కోల్పోతారు. విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. తొందరపడి ఇతరుల మాటలను నమ్మడం వల్ల మోసపోతారు. సోదరులతో విభేదాలు ఏర్పడతాయి. స్థిరాస్తులు అనుకూలించవు. ప్రయాణాలు వాయిదా పడతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

author avatar
Sree matha

Related posts

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju