NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

నాగాలాండ్, మేఘాలయాల్లో కొనసాగుతున్న పోలింగ్

Nagaland, meghalaya election 2023 polling Going On

ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకూ జరగనుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రెండు రాష్ట్రాల్లో 60 శాసనసభ స్థానాల చొప్పున ఉన్నాయి. కాగా మేఘాలయలో ఓ అభ్యర్ధి మరణించగా, నాగాలాండ్ లో ఓ నియోజకవర్గం ఏకగ్రీవం అయ్యింది. దీంతో రెండు రాష్ట్రాల్లో 59 స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మార్చి 2న జరగనుంది.

Nagaland, meghalaya election 2023 polling Going On
Nagaland meghalaya election 2023 polling Going On

 

కాగా రెండు రాష్ట్రాల్లో 552 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. 34 లక్షలకుపైగా ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. మేఘాలయలో 369 మంది, నాగాలాండ్ లో 183 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. మేఘాలయలో అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ  (ఎన్ పీపీ), ప్రతిపక్ష కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ కనబడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకు గానూ 21 స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్ పీపీ) 20 సీట్లలో విజయం సాధించింది. ప్రాంతీయ పార్టీలు, బీజేపీ మద్దతుతో ఎన్పీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సారి ఎన్ పీపీ, బీజేపీ విడివిడిగానే పోటీ చేస్తున్నాయి.

Nagaland, meghalaya election 2023 polling Going On
Nagaland meghalaya election 2023 polling Going On

 

మరో వైపు నాగాలాండ్ లో అధికార నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ), బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో నిలిచాయి. కాంగ్రెస్, ఎన్సీపీ, జేడీయూల నుండి వాటికి గట్టి పోటీ ఎదురవుతోంది. 2018 ఎన్నికల్లో ఎన్ఫీఎఫ్ 26, బీజేపీ 12, ఎన్ డీ పీపీ 18 స్థానాల్లో విజయం సాధించగా, ఎన్ డీ పీపీ – బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

 

ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్ధిని బలి.. ఇంజనీరింగ్ విద్యార్ధిని ఆత్మహత్య

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju