NewsOrbit
జాతీయం బిగ్ స్టోరీ

Narendra Modi: ఇద్దరు అత్యున్నత నాయకులు అద్భుత ప్రసంగం!

PM Modi : గుజరాత్ లో అలా.. ఏపీలో ఇలా..! ఆయన మ్యాజిక్కే వేరప్పా.. ఆ!

Narendra Modi: నిమ్మగడ్డ రమేష్ ను జగన్ ఇరకాటం లో పెట్టారు? ఎన్నికల కమిషనర్ మంత్రి పెద్దిరెడ్డి మీద కొరడా ఝుళిపించారు? అదిగో కొత్త పార్టీ రానుంది. ఇదిగో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎన్ని పంచాయితీలు మా పార్టీ గెలుచుకుంది. ఒక దంపుడు ఆంధ్రప్రదేశ్ వార్తలను ఒక్కసారి పక్కనబెట్టి, కక్షలు కార్పణ్యాలు నిండిపోయిన ఆంధ్ర ముసుగులను పక్కకు తొలగించి ఒకసారి రాజ్యసభలో జరిగిన ఓ ఆసక్తికరమైన పరిణామాల్ని ఇద్దరు పెద్ద నేతల మధ్య జరిగిన హుందా రాజకీయాన్ని ఒక సారి పరిశీలించండి. మనసులు కాస్త తేలిక పడతాయి. రాజకీయాలు ఎంత అందంగా చేయవచ్చో తెలుస్తాయి. రాజకీయ ప్రత్యర్థులు అంటే బూతులు తిట్టుకోవడం కాదని అర్థం అవుతాయి.

Narendra Modi  two great leaders to say super speech
Narendra Modi two great leaders to say super speech

ఒకరినొకరు మెచ్చుకోదగిన సందర్భంలో, చిరకాల మిత్రుడు సభను వీడుతున్న సమయంలో ఎలా వ్యవహరించాలి అన్నది రాజ్యసభలో కనిపించిన ఓ గతం ద్వారా ఆవిష్కృతమైంది. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు గులాం నబీ ఆజాద్ పదవీకాలం పూర్తి అవుతున్న సమయంలో ఆయనకు వీడ్కోలు పలికే సమయంలో ప్రధాని మోడీ మాట్లాడిన మాటలు అందరితో శభాష్ అనిపించాయి. తన సీనియర్ సహచరుడైన గులాంనబీ కు ఆయన తన కన్నీటి ద్వారా వీడ్కోలు పలుకుతూ కాస్త ఆవేదనకు లోనై ప్రసంగాన్ని చదవడం కనిపించింది. కాంగ్రెస్ సభ్యుడిగా రాజ్య సభకు వచ్చిన గులాంనబీ కూ ప్రధాని హోదాలో ఉన్న మోదీ ఎంత అద్భుతంగా వీడ్కోలు పలికారు అంతే అద్భుతంగా గులాం నబీ ఆజాద్ సైతం మోడీ మాటలకు కరిగి కన్నీరు కార్చారు. తన ప్రసంగంలో భారత జాతి ఔన్నత్యాన్ని చెప్పడం అందరితో శభాష్ అనిపించుకుంది. ఇద్దరు నేతలు ఎంత బాగా మాట్లాడుతున్నారు అనేది అందులో పెద్దల సభలో ఎంత హుందాగా వ్యవహరించారు అనేది ఈ ఘటన ద్వారా భవిష్యత్తు తరాలకు ఓ నిర్దేశకం కానుంది.

Narendra Modi  two great leaders to say super speech
Narendra Modi two great leaders to say super speech

 Narendra Modi: ఎప్పటికీ ఆజాద్ను మర్చిపోలేను…

గులాం నబీ ఆజాద్కు వీడ్కోలు సందేశం చదువుతున్న సమయంలో ప్రధాని మోదీ పాత సంఘటనలు ఒకసారి గుర్తు తెచ్చుకున్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందే గులాం నబీ ఆజాద్ పరిచయం ఉందని, గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక కాశ్మీర్ పర్యటనకు వచ్చిన గుజరాతి పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి జరిగినప్పుడు స్వయంగా గులాంనబీ ఆజాద్ తనకు ఫోన్ చేసి వివరాలు చెప్పారని… ఆ సమయంలో ఆయన తన సొంత మనుషులే ప్రమాదం లో ఉన్నట్లు మాట్లాడడం ఎప్పటికీ మరిచిపోలేనని మోడీ అన్నారు. పదవులు శాశ్వతం కాదు.. నాకు నిజమైన స్నేహితుడు గులాంనబీ ఆజాద్ అంటూ మనస్ఫూర్తిగా సెల్యూట్ చేశారు. నా నిజమైన స్నేహితుడు కి నా ఇంటి తలుపులు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయి మీ అనుభవాలు సలహాలు సూచనలు మాకు ఎంతో అవసరం అంటూ కన్నీరు పెట్టుకుంటూ ఉద్వేగం చెందారు. మోదీ ఓ విపక్ష పార్టీలకు చెందిన నాయకుడు మీద ఇంత ఆవేదనగా మాట్లాడడం భాజపా ఎంపీలు సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది.

Narendra Modi  two great leaders to say super speech
Narendra Modi two great leaders to say super speech

నేను భారతీయ ముస్లిము గా గర్వపడుతున్నా

మోదీ ప్రసంగం తర్వాత గులాం నబీ ఆజాద్ సైతం తన వీడ్కోలు ప్రసంగాన్ని అద్భుతంగా అందించారు. జమ్ము కాశ్మీర్ సీఎం గా పని చేస్తున్నప్పుడు ఉగ్రదాడిలో చనిపోయిన వారి పిల్లలు తనను చుట్టేసినప్పుడు, వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితిలో తనకు కలలో నీళ్లు వచ్చాయి అని అయితే చనిపోయిన వారిని తీసుకు రాలేని పరిస్థితి లో ఉన్నాం అని చెప్పారు. ప్రతి పండుగకు తనకు ఇద్దరు నుంచి కచ్చితంగా శుభాకాంక్షలు అందుతాయని ఒకరు సోనియాగాంధీ అయితే మరొకరు ప్రధాని మోదీ తన ఆపేక్ష ను ఆయన మాటల్లో తెలియజేశారు. విభిన్నమైన పార్టీలుగా విభిన్నమైన సిద్ధాంతాలు ఉంటాయి.. ఎన్నో విషయాల మీద వాదనలు ఉంటాయి విమర్శలు ఉంటాయి.

కానీ ఎప్పుడూ ఏ విషయం మీద మోదీ తనను వ్యక్తిగతంగా తన విమర్శలను ప్రత్యేకంగా తీసుకోలేదని ఎంతో హుందాగా చక్కగా రాజ్యసభలో తమకు అవకాశం కల్పించాలని ఆజాద్ చెప్పు కు రావడం తో పాటు భారత దేశం లో ఉన్న ముస్లింలు ఎంత భద్రంగా ఉన్నారో చూసి నేర్చుకోవాలని తాను భారతీయ ముస్లింలు గా ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాం అంటూ వ్యాఖ్యానించారు. భిన్నమైన మతాలు భిన్నమైన కులాలు ఉన్నప్పటికీ భారతీయ ముస్లింలు అందరితో కలిసిమెలిసి ఉండటాన్ని ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఆకాంక్షించారు. ఎలాంటి ఇతర మూలాలు లేని ముస్లిం దేశాలలో అక్కడ ముస్లిం లు తమలో తామే కొట్టుకు చచ్చిపోతున్న భారతదేశం ముస్లింలు మాత్రం ఎప్పుడు వెళ్లారని, అదే ఈ దేశపు గొప్పతనం అంటూ ఆజాద్ భారతదేశం ఔన్నత్యాన్ని చక్కగా చెప్పుకొచ్చారు.

ఒకసారి ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో జరిగే రాజకీయ కీచులాటలు కాస్త పక్కనబెట్టి జాతీయ రాజకీయాలు, భారతదేశ అత్యున్నత అత్యున్నత చట్టసభల్లో ఏం జరుగుతుందో అక్కడ రాజకీయ నాయకులు ఎలా వ్యవహరిస్తున్నారు ఒకసారి పరిశీలిస్తే ఇలాంటి అద్భుత దృశ్యాలు మరిన్ని కళ్లకు కడతాయి.

author avatar
Comrade CHE

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

Lok Sabha Elections 2024: భారీ భద్రత నడుమ మణిపూర్ లో కొనసాగుతున్న రీపోలింగ్

sharma somaraju

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju